• తాజా వార్తలు

వ‌న్‌ప్ల‌స్5 అంచ‌నాల‌ను అందుకుందా? లేదా?  


 

లాంచింగ్‌కు ముందు నుంచే మొబైల్ ల‌వ‌ర్స్‌ను  ఎంత‌గానో ఆక‌ర్షించిన వ‌న్ ప్ల‌స్ అంచ‌నాల‌ను అందుకుందా? ఫ‌్లాగ్‌షిప్ కిల్ల‌ర్‌గా టెక్నాల‌జీ మార్కెట్లో ప్ర‌చారం జ‌రిగిన వ‌న్‌ప్ల‌స్ శాంసంగ్‌, యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను ఢీకొట్టి నిల‌వ‌గ‌లిగిందా? వ‌న్‌ప్ల‌స్ 5లో ప్ల‌స్ పాయింట్లేంటి?  మైన‌స్‌లేంటి తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చ‌దవండి.  

వ‌న్‌ప్ల‌స్‌5  చాలా అంశాల్లో ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌తో కంపీట్ చేస్తుంద‌ని ముందు నుంచే యూజ‌ర్లంద‌రికీ అవ‌గాహ‌న ఉంది. దానికి త‌గ్గ‌ట్లుగానే ప్రాసెస‌ర్‌, పెర్‌ఫార్మెన్స్‌, లుక్ విష‌యంలో గెలాక్సీ ఎస్ 8, యాపిల్ 7 ప్ల‌స్ వంటి  హై ఎండ్ ఫోన్ల‌కు పోటీ ఇచ్చేలా ఉంది. అయితే కెమెరా క్వాలిటీ, డిస్‌ప్లే వంటి విష‌యాల్లో మాత్రం కొంత వెన‌క‌బడిన‌ట్లే క‌నిపిస్తోంది.  
 ప్ల‌స్ పాయింట్లు 

ప్రీమియం లుక్‌
* వ‌న్‌ప్ల‌స్ 3టీ కంటే వ‌న్‌ప్ల‌స్ 5 లైట్ వైయిట్‌. బ‌రువు 153 గ్రాములే. 
* చూడ‌డానికి స్లిమ్‌గా కూడా ఉంది.154.2 X 74.1 X 7.25mm డైమ‌న్ష‌న్స్‌తో ప‌ట్టుకోవ‌డానికి హ్యాండీగా.. పాకెట్‌లో పెట్టుకోవ‌డానికి కూడా సోఫిష్టికేటెడ్‌గా డిజైన్ చేశారు.  
* మిడ్ నైట్ బ్లాక్‌, స్లేట్ గ్రే క‌ల‌ర్స్ ప్రీమియం లుక్‌ను ఇచ్చాయి.  అయితే యాపిల్ ఐ ఫోన్‌ను చాలా వ‌ర‌కు ఇమిటేట్  చేసింద‌న్న ప్ర‌చారం ఉంది. ఇది కొంత వ‌ర‌కు నిజం కూడా.  

హార్డ్‌వేర్ సూప‌ర్  
ప్రాసెస‌ర్‌, ర్యామ్‌, 
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌తో వ‌న్‌ప్ల‌స్ 5ను తీర్చిదిద్దారు. అయితే ఇప్ప‌టికే సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియం, హెచ్‌టీసీ యూ11 ఈ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చేశాయి. అయితే ర్యామ్ విష‌యంలో మాత్రం వ‌న్‌ప్ల‌స్‌దే పై చేయి. 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్ల‌తో వ‌న్‌ప్ల‌స్ 5 లాంచ్ అయింది. ఇండియాలో  8జీబీ ర్యామ్‌తో  లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదే. ర్యామ్ భారీగా ఉండ‌డంతో ఎన్ని యాప్‌లు ఉన్నా మెమ‌రీ త‌గ్గిపోయి ఫోన్ స్లో అవుతుంద‌న్న టెన్ష‌న్ లేదు. 2.45 గిగా హెర్ట్జ్ సీపీయూ కూడా ఫోన్ పెర్‌ఫార్మెన్స్‌కు మంచి ఎసెట్‌.  ఆండ్రినో 540 జీపీయూ.. గ్రాఫిక్ ఇంటెన్సివ్ నీడ్స్‌ను, గేమింగ్ రిక్వైర్‌మెంట్స్‌ను  తీర్చ‌గ‌ల‌దు. 
* దాదాపు  అన్ని FDD-LTE bandsను స‌పోర్ట్ చేస్తుంది. కాబ‌ట్టి మీరు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లినా అక్క‌డి నెట్‌వ‌ర్క్ బాండ్ విడ్త్‌ను అందుకోవ‌డం మీకు స‌మ‌స్యే కాదు. అంటే మీరు బ్యాకప్‌గా మ‌రో ఫోన్ తీసుకోవాల్సిన ప‌ని లేద‌న్న‌మాట‌.
బ్యాట‌రీ విష‌యానికి వ‌స్తే వ‌న్‌ప్ల‌స్ 3టీ కంటే 100 ఎంఏహెచ్ త‌క్కువ‌గా 3,300 ఎంఏహెచ్ బ్యాట‌రీతోనే ఈ ఫోన్ వ‌చ్చింది. డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీ మాత్ర‌మే కావ‌డం వ‌ల్ల మోడ‌రేజ్ యూసేజ్‌కి రోజున్న‌ర వ‌ర‌కు బ్యాక‌ప్ వ‌స్తుంది.  డాష్ ఛార్జింగ్ ఆప్ష‌న్ ఉండ‌డం వ‌ల్ల ఒక‌రోజుకు స‌రిప‌డే బ్యాట‌రీని అర‌గంట ఛార్జింగ్‌తోనే పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ చోబుతోంది. 5వోల్ట్స్‌, 4 ఏ ఛార్జ‌ర్ ఇందుకు బాగా సూట‌వుతుంది. 

* డివైస్ ఫ్రంట్ ఎండ్‌లో కింది భాగంలో ఉన్న ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్  చాలా బాగా ప‌ని చేస్తుంది. 
వ‌న్‌ప్ల‌స్ 5 కంపెనీ ఓఎస్ అయిన ఆక్సిజన్ ఆప‌రేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. అయితే అది ఆండ్రాయిడ్ 7.1.1 నూగ‌ట్ బేస్డ్‌గా పని చేస్తుండ‌డంతో యూజ‌ర్‌కు ఆండ్రాయిడ్  మాదిరి ఎక్స్‌పీరియ‌న్సే వ‌స్తుంది. 

మైన‌స్ పాయింట్లు
* రియ‌ర్ సైడ్‌లో  డ్యూయ‌ల్ కెమెరాల‌తో వ‌చ్చింది. అది కూడా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఫోన్ల‌కంటే భిన్నంగా హారిజంటల్‌గా సెట్ చేశారు.  అయితే వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ మాదిరిగానే ఇది క‌రూడా యావ‌రేజ్ కెమెరా మాడ్యూల్‌. 
* 64 జీబీ, 128 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్ల‌తో వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ 5లో ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌కు అవ‌కాశం లేదు.  
*  ఒక మోడ్‌ను సెల‌క్ట్ చేయాలంటే చాలా టాప్స్, స్వైప్స్ చేయాల్సి వ‌స్తోంది. బొకే ఎఫెక్ట్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. పోర్ట్ర‌యిట్ ఇమేజ్‌ను క్యాప్చ‌ర్ చేయాల‌న్నా కొంత ఇబ్బందే. వీట‌న్నింటినీ ఫిక్స్ చేయ‌డానికి వ‌న్‌ప్ల‌స్ త‌న అప్‌డేట్ల‌లో దృష్టి పెట్టాలి. రియ‌ర్ కెమెరాతో పోల్చితే ఫ్రంట్ ఉన్న సెల్ఫీ కెమెరా బాగుంది. జియోనీ, ఒప్పో, వివో కంటే మంచి ఇమేజెస్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. 
*  5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తో వ‌చ్చింది. మిగ‌తా కంపెనీలు 2కే, 4కే డిస్‌ప్లేల‌తో వ‌స్తుంటే ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ద‌గ్గ‌రే వ‌న్‌ప్ల‌స్ 5 ఆగిపోవ‌డం మైన‌స్ పాయింటే. బ్యాట‌రీ వినియోగ‌ప‌రంగా డిస్‌ప్లేని తగ్గించాల‌నుకున్నా క‌నీసం 2కే డిస్‌ప్లే అయినా ఇచ్చి ఉండాల్సింది. 

ఫైన‌ల్‌గా చెప్పేది ఏమిటంటే..
 కెమెరా, డిస్‌ప్లే పరంగా కొంత వెన‌క‌బాటు ఉన్నా ఇప్ప‌టికీ వ‌న్‌ప్ల‌స్ 5.. ఫ్లాగ్‌షిప్ కిల్ల‌రే అని చెప్పాలి. ఎందుకంటే దీని ప్రైస్ రేంజ్ ఐ ఫోన్‌, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8, హెచ్‌టీసీ యూ 11 లాంటి ఇత‌ర కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కంటే ఎట్‌లీస్ట్  10వేల రూపాయ‌లు  త‌క్కువ‌గా ఉండ‌డం దీనికి పెద్ద ఎసెట్‌. 
సింపుల్‌గా చెప్పాలంటే  30 వేల రూపాయ‌ల రేంజ్‌లో  ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలంటే వ‌న్‌ప్ల‌స్ 5 ది బెస్ట్ ఆప్ష‌న్‌.  

జన రంజకమైన వార్తలు