• తాజా వార్తలు
  •  

రివ్యూ-రిలీజ్‌కు ముందే జియో ఫోన్ రివ్యూ మీ కోసం...

జియో ఫోన్‌.. ఇప్పుడిదొక సంచ‌ల‌నం. ఎవ‌రి నోట విన్నా జియో మాటే. ఎందుంటే భార‌త్‌లో ఇంత త‌క్కువ ధ‌ర‌తో డేటా, కాల్స్ ఇస్తున్న నెట్‌వ‌ర్క్ మ‌రొక‌టి లేదు కాబ‌ట్టి. ఇప్పుడు జియో మ‌రో విధంగా వార్త‌ల్లో నానుతోంది. అది ఫీచ‌ర్ ఫోన్ వ‌ల్ల‌. రూ.1500 డిపాజిట్ క‌డితే చాలు 4జీ ఫోన్ ఇస్తామంటూ ముఖేశ్ అంబాని సంస్థ ప్ర‌క‌టించ‌డం ఆల‌స్యం. జ‌నం ల‌క్ష‌ల సంఖ్య‌ను ఫోన్ కోసం రిజ‌స్ట‌ర్ చేసుకున్నారు. కానీ చాలామందికి జియో ఫీచ‌ర్ ఫోన్ ఎలా ఉంటుందో. . దానిలో ఉండే ఫీచ‌ర్లు ఏమిటో  కూడా అంద‌రికి తెలియ‌దు. మ‌రి త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న జియో ఫోన్‌లో ఫీచ‌ర్లు దాని ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసుకుందామా..

జియో ఫోన్ ఫీచ‌ర్లు ఇవే..
గూగుల్ అసిస్టెంట్‌, యాపిల్ సిరి, మైక్రోసాఫ‌ట్ కొర్టానా మాదిరిగానే జియో ఫోన్ వాయిస్ ఎనేబుల్డ్‌గా త‌యారైంది.  అంటే మీకు చేతులు ఉప‌యోగించ‌కుండానే ఎస్ఎంఎస్ పంపొచ్చు.. వాయిస్ ద్వారానే కాల్స్ చేయ‌చ్చు, సందేశాలు పంపొచ్చు.

జియో 4జీ ఫోన్‌లో ప్రి లోడెడ్ యాప్ప్ ఉన్నాయి. మై జియో, మ్యూజిక్‌, సినిమా, జియో టీవీ, జియో మ‌నీ, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఇలా అన్ని యాప్స్ ఈ ఫోన్ ద్వారా వ‌స్తాయి.

దీనిలో 23 భాష‌లు ల‌భ్యం అవుతాయి. మీకు న‌చ్చిన రీజ‌న‌ల్ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు

జియో ఫోన్‌లో ఒక ఎమ‌ర్జెన్సీ బ‌ట‌న్ ఉంది. అదే బ‌ట‌న్ 5. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ప‌ట్ట‌కుంటే ఎమ‌ర్జెన్సీ (100, 108) త‌దిత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

మీ జియో ఫోన్‌ను టీవీతో అనుసంధానం చేసి కూడా వాడుకోవ‌చ్చు. ఏ టీవీకైనా ఇది సెట్ అవుతుంది

ప్ర‌స్తుతానికి ఇది న‌లుపు రంగులో ల‌భిస్తుంది.

జియో ఫోన్ స్పెసిఫికేష‌న్స్‌
2.4 అంగుళాల డిస్‌ప్లే
1.2 గిగా హెట్జ్ డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్
కేఏఐ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌
0.3 మెగా పిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
2 మెగా పిక్స‌ల్ రేర్ కెమెరా
2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
512 ఎంబీ ర్యామ్‌
4 జీబీ స్టోరేజ్‌


జ‌న‌ర‌ల్ స్పెసిఫికేష‌న్లు
డివైజ్ టైప్: బ‌డ్జెట్ ఫోన్‌
సిమ్ టైప్: నానో జీఎస్ఎం
డిస్‌ప్లే: టీఎఫ్‌టీ స్క్రీన్‌
హార్డ్‌వేర్: మాలి400
క‌నెక్టివిటీ: 4జీ వొలైట్‌
 

ఎందుకు కొనాలంటే..
ఇది దాదాపు పూర్తిగా మ‌న‌కు ల‌భిస్తుంది. ఎందుకంటే మ‌న డిపాజిట్ మూడేళ్ల త‌ర్వాత తిరిగి మ‌న‌కు ఇచ్చేస్తారు కాబ‌ట్టి.

వీడియో కాలింగ్‌కు స‌పోర్ట్ చేయ‌డం. ఒక ఫీచ‌ర్ ఫోన్‌లో ఇది ఒక అద్భుత‌మై ఆప్ష‌న్‌

త్వ‌ర‌లోనే ఎన్ఎఫ్‌సీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కానుంది

మీ బ్యాంక్ అకౌంట్‌, యూపీఐ, డెబిట్‌, క్రెడిట్ కార్డు లాంటి లావాదేవీలు చేయ‌చ్చు

 

ఎందుకు కొన‌కూడ‌దు.. 

హాట్‌స్పాట్ ఫీచ‌ర్ లేదు

వాట్స‌ప్‌కు స‌పోర్ట్ చేయ‌ట్లేదు వెబ్‌బ్రౌజ‌ర్‌, ఫేస్‌బుక్ మాత్ర‌మే ప‌ని చేస్తాయి

ఇది సింగిల్ సిమ్ వేరియంట్‌

దీని ద్వారా ఒక ప్లాన్ రూ.153 మాత్ర‌మే యాక్టివేట్ చేసుకోగ‌లం
 

విజ్ఞానం బార్ విశేషాలు