• తాజా వార్తలు

రివ్యూ-జియోకి 1 ఇయర్,తెచ్చిన 10 కీలక మార్పులు

జియో.. జియో.. జియో ఇప్పుడు భార‌త టెలికాం రంగాన్ని ఊపేస్తున్న పేరిది. ఒక‌ప్పుడు మన దేశంలో టెలికాం స‌ర్వీసులు అంటే ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్ మాత్ర‌మే.. చిన్న‌చిన్న ఆప‌రేట‌ర్లు ఉన్నా వాటి ప్రభావం చాలా త‌క్కువ‌. కానీ జియో వ‌చ్చిన త‌ర్వాత సీన్ మారిపోయింది. జియో జోరు ముందు బ‌డా బడా కంపెనీలు కూడా చిన్న‌విగా మారిపోయాయి.  ల‌క్ష‌ల సంఖ్య‌లో యూజ‌ర్ బేస్ ఉన్న ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి దిగ్గ‌జ సంస్థ‌లు కూడా జియో దెబ్బ‌కు కుదేల‌య్యాయి. మ‌రి జియో వ‌చ్చిన త‌ర్వాత భార‌త టెలికాం రంగంలో వ‌చ్చిన ప‌ది పెను మార్పులేమిటో చూద్దామా...

ఆల్ట్రా చీప్ డేటా
భార‌త్‌లో ఒక‌ప్పుడు డేటా అంటేనే చాలా కాస్ట్‌లీ. ఎక్కువ‌మంది డేటాను ఉప‌యోగించేవాళ్లు కాదు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ ఉన్నా దాన్ని ఫీచ‌ర్ ఫోన్‌లాగే వాడుకునేవాళ్లు. కానీ జియో వ‌చ్చి డేటాను చాలా చీప్ చేసేసింది. 1జీబీ డేటాను రూ.450 కి కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అలాంటి 4జీ డేటాను ఉచితంగా అందించింది పెను ప్రకంప‌క‌న‌లు సృష్టించింద‌. అంతేకాదు రూ.399 క‌డితే 84 రోజుల పాటు రోజుకు 1జీఈబీ హైస్పీడ్ డేటా ఇవ్వ‌డంతో వినియోగ‌దారులంతా దీని మీద ప‌డ్డారు.

ఆన్‌లైన్ వాడ‌కం పెరిగిపోయింది
 ఒక‌ప్పుడు ఏమైనా ప‌ని ఉంటేనే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేవాళ్లు. కానీ జియో వ‌చ్చాక ఆల్వేస్ ఆన్‌లైన్ కాన్సెప్ట్ వ‌చ్చేసింది. ఏం చేయాల‌న్నా.. ఏం కావాల‌న్నా ఆన్‌లైన్ ద్వారానే. జియో ఉచితంగా ఆరు నెల‌ల పాటు 20 కోట్ల జీబీ నుంచి 120 కోట్ల జీబీ వ‌ర‌కు ఇవ్వ‌డంతో యూజ‌ర్లు కూడా పండ‌గ చేసుకున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ హిట్స్ ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి.  ప్ర‌తి కంజ్యుమ‌ర్ నెల‌కు క‌నీసం 10 జీబీ  డేటా అయినా ఉప‌యోగిస్తున్నారు.

ఉచిత వాయిస్ కాల్స్‌
జియో తెచ్చిన పెను మార్పుల్లో ఇదొక‌టి. ఒక‌ప్పుడు కాల్స్ చేయాలంటే ఉచిత కాల్స్ ఉన్నాయా.. ఎంత ఖ‌ర్చు అవుతుంది అని అంద‌రూ ఆలోచించేవాళ్లు. కానీ జియో ఉచిత వాయిస్ కాల్స్‌తో మొత్తం మారిపోయింది. ఏ ఫోన్ నుంచి ఏ ఫోన్‌కైనా వాయిస్ కాల్స్ చేసే అవ‌కాశం వ‌చ్చేసింది. దీంతో వినియోగ‌దారుల‌కు ఎంతో డ‌బ్బు ఆదా అవుతోంది.

4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పెరిగింది
4జీ స్మార్ట్‌ఫోన్ల‌ను వాడే వాళ్లు ఒక‌ప్పుడు చాలా త‌క్కువ‌. ఇప్పుడు దాదాపు అంద‌రి చేతుల్లోనూ 4జీ ఫోన్లే.  జియో వ‌చ్చిన త‌ర్వాత 4జీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ బాగా పెరిగింది. జియోనే స్వ‌యంగా 4జీ వీవో ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్ల‌ను రూ.2999కు విడుద‌ల చేసింది. ఈ క్వార్ట‌ర్‌లో 95 శాతం 4జీ ఫోన్లు అమ్ముడుపోయాయి.

డేటాలో వేగం
ఒక‌ప్పుడు 2జీ వాడితేనే అదో గొప్ప‌. ఇప్పుడు 4జీ డేటా వాడితే త‌ప్ప సంతృప్తి ఉండ‌ట్లేదు. దీనికి కార‌ణం డేటాలో వేగం. జియో తెచ్చిన మార్పుల్లో ఇది ప్ర‌ధాన‌మైంది. డేటాలో వేగాన్ని తీసుకొచ్చి బ‌ఫ‌రింగ్ స‌మ‌స్య‌లు తీర్చింది. 

యూజ‌ర్లు భారీ స్థాయిలో పెరిగారు
స్మార్టుఫోన్లు వాడేవాళ్ల సంఖ్య, 4జీ నెట్‌వ‌ర్క్‌ల‌ను యూజ్ చేసేవాళ్ల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. ఆరు నెల‌ల్లో 100 మిలియ‌న్ల యూజ‌ర్ల‌ను తాము సంపాదించుకున్న‌ట్లు జియో ప్ర‌క‌టించింది.  ఇది ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ పెరుగుద‌ల క‌న్నా ఎక్కువే. 

బ్రాండ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్ ల‌భ్య‌త‌
హైస్పీడ్ ఇంట‌ర్నెట్ ఒక‌ప్పుడు కొంద‌రికే ప‌రిమితం. ఇప్పుడు అంద‌రూ దాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. త‌క్కువ ధ‌ర‌కే డేటాను పొందొచ్చు. బ్రాడ్ బ్యాండ్ ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్న అతి పెద్ద ప్రొవైడ‌ర్‌గా జియో నెట్‌వ‌ర్క్స్ నిలిచింది.  ఇది త్వ‌ర‌లోనే జియో ఫైబ‌ర్  స‌ర్వీసుల‌ను కూడా ప్రారంభించ‌నుంది.

వొడాఫోన్‌-ఐడియా క‌లిసిపోయాయి
జియో దెబ్బ‌తో టెలికాం సంస్థ‌ల కూసాలు క‌దిలిపోయాయి. ఐడియా-వొడాఫోన్ క‌లిసిపోయాయి. జియో వ్యూహాలను తిప్పి కొట్టేందుకే తాము క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు ఈ రెండు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. దీంతో మార్కెట్లో అగ్ర‌స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ కూడా వెనుక‌బ‌డింది. 400 మిలియ‌న్ల క‌స్ట‌మ‌ర్ల‌తో ఐడియా-వొడాఫోన్ జియో త‌ర్వాత స్థానంలో నిలిచాయి. 

165 కోట్ల వీడియోలు చూశారు
జియో ఉచిత డేటా పుణ్య‌మా అని వినియోగ‌దారులు ఆన్‌లైన్‌లో వీడియోల మీద ప‌డ్డారు. 165 కోట్ల వీడియోల‌ను వీక్షించారంట‌నే వాడకం ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. జియో యాప్‌, టీవీతో పాటు యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌ల‌లో ఎక్కువ‌గా వీడియోలు చూశారు. 


 

జన రంజకమైన వార్తలు