• తాజా వార్తలు
  •  

బెస్ట్ పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్ యాప్‌.. లాస్ట్‌పాస్

ఇంట‌ర్నెట్ యూసేజ్‌తోపాటే సైబ‌ర్ క్రైమ్ కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్ర‌తి ప‌నినీ ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నాం. దాంతో ఆన్‌లైన్ అకౌంట్లు.. వాటికి లాగిన్‌, పాస్‌వ‌ర్డ్‌లు త‌ప్ప‌నిస‌రి. కానీ ఈ పాస్‌వ‌ర్డ్‌ల‌ను హ్యాక్ చేసి మ‌న విలువైన ఇన్ఫ‌ర్మేష‌న్ కొట్టేసే సైబ‌ర్ నేర‌గాళ్లు పెరిగిపోతున్నారు.  లేదంటే ఇన్ఫోను బ్లాక్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేసే ర్యాన్స‌మ్‌వేర్‌లు మ‌రోవైపు బెంబేలెత్తిస్తున్నాయి.  ఇలాంటి వాటికి ప్ర‌త్యామ్నాయంగా మీ పాస్‌వ‌ర్డ్‌ను సెక్యూర్డ్‌గా ఉంచ‌డంతోపాటు వాట‌న్నింటిని ఒక‌చోట మేనేజ్ చేసుకునే పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్ యాప్‌.. లాస్ట్‌పాస్ గురించి తెలుసుకోండి. 

లాస్ట్‌పాస్‌లో పాస్‌వ‌ర్డ్స్ ఎలా సెట‌ప్ చేసుకోవాలి?  
ఫ‌స్ట్‌టైం లాస్ట్‌పాస్‌లో పాస్‌వ‌ర్డ్స్‌సెట‌ప్ చేసుకోవాలంటే డెస్క్‌టాప్ వెర్ష‌న్ ఉప‌యోగిస్తే క‌న్వినెంట్‌గా ఉంటుంది.  స్టార్ట్ చేసేట‌ప్పుడు Master Passwordను స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే మీ మొత్తం పాస్‌వ‌ర్డ్‌ల‌న్నింటికీ ఇదే తాళం చెవి.  మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగ‌లిగేలా.. ఎవ‌రైనా హ్యాక్ చేయాలంటే క‌ష్ట‌మ‌య్యేలా ఈ పాస్‌వ‌ర్డ్ ఉండాలి.  పాస్‌వ‌ర్డ్ పెట్టుకున్నాక ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌లో మీ ఫింగ‌ర్ ప్రింట్‌ను స్కాన్ చేసి లాక్‌, అన్‌లాక్ కూడా చేసుకోవ‌చ్చు.  మీరు లోనికి ఎంట‌ర‌య్యాక  కుడివైపు  కింద చిన్న + గుర్తు క‌నిపిస్తుంది.   దాన్ని క్లిక్ చేస్తే Add Sites, Add Secure Notes, Add Form Fill Profileఅనే మూడు ఆప్ష‌న్లు వ‌స్తాయి.   Add Secure Notesలో మీ పాస్‌వ‌ర్డ్‌లు స్టోర్ చేసుకోవచ్చు. 
 Add Sitesలో మీరు వాడుకునే వెబ్‌సైట్ల యూజ‌ర్ నేమ్స్‌, పాస్‌వ‌ర్డ్ లు స్టోర్ చేసుకోవ‌చ్చు.  మీరు కొత్త‌గా ఓపెన్ చేసే  Form Fill సెక్ష‌న్ ఉంటే మీ డిటెయిల్స్‌తో వాటిని   LastPass  ఫిల్ చేస్తుంది. అందుకు త‌గ్గ వివ‌రాల‌ను Add Form Fill Profileలో సేవ్ చేసుకోవాలి. ఒక్క‌సారి మీరు పాస్‌వ‌ర్డ్‌ల‌ను యాప్ లో యాడ్ చేసుకుంటే చాలు మీరు ఆ వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ‌డానికి ట్రై చేయ‌డానికి ఆటోమేటిగ్గా మీ వివ‌రాల‌ను ఫిల్ చేస్తుంది. లేదంటే నోటిఫికేష‌న్  ప్యాన‌ల్‌ను కిందికి డ్రాగ్ చేసి  LastPass Fill helperను టాప్ చేస్తే మీ లాగిన్స్‌ను చూపిస్తుంది. దానిలో నుంచి సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. 

లాస్ట్‌పాస్ ఎంత సేఫ్‌? 
* సెక్యూరిటీప‌రంగా కాంప్ర‌మైజ్‌కాదు. ఒక‌వేళ మీ లాస్ట్‌పాస్ అకౌంట్‌ను హ్యాక్ చేయ‌డానికి ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే వెంట‌నే మీ ఈమెయిల్‌కు మెసేజ్ పంపి అల‌ర్ట్ చేస్తుంది.
* దీనిలో మీ పాస్‌వ‌ర్డ్‌లు అన్నీ సెక్యూర్డ్‌గా స్టోర్ చేసుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్‌, ఈ మెయిల్, వైఫై పాస్‌వ‌ర్డ్‌.. ఇలా ఎలాంటి పాస్‌వ‌ర్డ్ అయినా సేవ్ చేసుకోవ‌చ్చు.
* అంతేకాదు మీరు కొత్త‌గా ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వ‌డానికి పాస్‌వ‌ర్డ్ పెట్టుకోవాలంటే  స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ ఏమిటో కూడా స‌జెస్ట్ చేస్తుంది.   
 *  అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మీ పాస్‌వ‌ర్డ్‌ను మీరు న‌మ్మిన వ్య‌క్తికి షేర్  చేసుకునేందుకు ‘Emergency Access’ tab  కూడా ఈ యాప్‌లో ఉంది.   
ప్రీమియం వెర్ష‌న్ 
లాస్ట్‌పాస్ యాప్‌.. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, విండోస్ ఫోన్ ఓఎస్‌ల‌ల్లో కూడా దొరుకుతుంది. యాప్ LastPass Premium వెర్ష‌న్ కూడా అందుబాటులో ఉంది. ఏడాదికి 1534 రూపాయ‌లు చెల్లించాలి. దీనిలో 1జీబీ వ‌ర‌కు ఎన్ క్రిప్టెడ్ ఫైల్ స్టోరేజ్ , ప్ర‌యారిటీ క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌, ఎక్స్‌ట్రా సెక్యూరిటీ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటిఫికేష‌న్ వంటి ఫీచ‌ర్లు అద‌నం.  
 

 

విజ్ఞానం బార్ విశేషాలు