• తాజా వార్తలు

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటి వ‌ర్సెస్ రెడ్ మి 4 వ‌ర్సెస్ మోట్ ఇ 4

ఇప్పుడు మార్కెట్లో ఫోన్ల యుద్ధం జ‌రుగుతోంది. మేమంటా మేమ‌ని ఫోన్ త‌యారీ కంపెనీల‌న్నీ ఒక‌దానితో ఒక‌టి హోరాహోరీ పోటీప‌డుతున్నాయి. కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో రోజుకో మొబైల్‌ను మార్కెట్లోకి వ‌దులుతున్నాయి. దేశీయ కంపెనీల‌కు తోడు చైనా కంపెనీలు కూడా పోటీలో పాల్గొన‌డంతో  పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ, రెడ్‌మి 4, మోటో ఇ 4, కూల్ పాట్ నోట్ 5 మ‌ధ్య పోటీ నెలకొంది. మ‌రి ఈ నాలింగింట్లో ఏది ఉత్త‌మ‌మైన మొబైల్‌?

మిడ్ రేంజ్ ఫోన్ల కోసం చాలా మంది వెతుకుతుంటారు. అంతే భారీగా డ‌బ్బులు పెట్టి స్మార్ట్‌ఫోన్లు అంద‌రూ కొన‌లేరు. ఇలాంటివాళ్లు రూ.5 క‌న్నా ఎక్కువ పెట్ట‌లేక మిడ్ రేంజ్ ఫోన్ల‌వైపు మ‌ళ్లుతారు. అలాంటి వాళ్ల కోస‌మే రెడ్‌మిడ్‌, మైక్రోమాక్స్ లాంటి సంస్థ‌లు ఫోన్ల‌ను త‌యారు చేస్తున్నాయి.

రెడ్ మి 4
రెడ్ మి 4 మిడ్ రేంజ్ ఫోన్ల‌లో ముందంజ‌లో ఉండే ఫోన్‌. ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2.5డీ క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ఉంది. క్వాల్‌కామం స్నాప్‌డ్రాగ‌న్ 435 ఆక్టా కోర్ ప్రాసెస‌ర్‌తో త‌యారు చేశారు. 2జీ నుంచి 64 జీబీ పైన వేరియంట్స్‌లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ట్ర‌న‌ల్ మెమ‌రీ 128 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.  దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 4100 ఎంఏహెచ్‌గా ఉంది.

టాప్ ఫీచ‌ర్లు
4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ
డిస్‌ప్లే
ప్రాసెస‌ర్‌
 ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌

మోటో ఇ4
మిడ్ రేంజ్ ఫోన్ల‌లో మోటో ఇ 4 కూడా ముందంజ‌లోనే ఉంది. 5.0 హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5 డి గ్లాస్ ప్రాటెక్ష‌న్ ఆన్ టాప్‌. మీడియా టెక్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌. 2జీబీ ర్యామ్‌, 16 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ దీని ప్ర‌త్యేక‌త‌. 128 జీబీ వ‌ర‌కు మెమరీ పెంచుకోవ‌చ్చు. కెమెరా 8 మెగాపిక్స‌ల్ షూట‌ర్ ఉంది. 

టాప్ ఫీచ‌ర్లు
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగ‌ట్‌
కెమెరా
ఫ్రంట్ ఫ్లాష్‌
4జీ వీవోఎల్‌టీఈ

కూల్‌పాడ్ నోట్ 5
కూల్‌పాడ్ నోట్ 5 స్పోర్స్ ఫోన్‌లో ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. టాప్‌లో 2.5 డి క‌ర్వ‌డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్ ఉంది. క్వాల్‌కామ్ 617 స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌తో త‌యారైంది. 4జీబీ ర్యామ్‌తో పాటు 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఈ డివైజ్ సొంతం. 13 మెగా పిక్స‌ల్ రేర్ షూట‌ర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్న కెమెరా ఉంది.

టాప్ ఫీచ‌ర్లు
ప్రాసెస‌ర్‌
ర్యామ్‌
కెమెరా

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
5.7 ఇన్ఫినిటీ డిస్‌ప్లే, మంచి రిజ‌ల్యూష‌న్ మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ సొంతం. ఆండ్రాయిడ్ 7.1.2 నౌగ‌ట్ ఓఎస్ వాడారు. 1.4 జీహెచ్‌జెడ్ క్వాడ్‌కోర్  స్నాప్‌డ్రాగ‌న్ 425 కూల్‌పాడ్ మ‌రో ఆక‌ర్ష‌ణ‌. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. 13 ఎంపీ షూట‌ర్ కెమెరా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ అద‌నం.

టాప్ ఫీచ‌ర్లు
బిగ్ 5.7 ఇన్ఫినిటీ డిప్లే
13 మెగా పిక్స‌ల్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగ‌ట్‌
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ సాఫ్ట్ ఫ్లాష్‌

జన రంజకమైన వార్తలు