• తాజా వార్తలు

వాట్సాప్ లో  ఈ ఏడాది వ‌చ్చిన  అమేజింగ్ ఫీచ‌ర్లు ఇవే.. 



 వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫేమ‌స్ అయిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను క‌ట్టిప‌డేస్తోంది. యూజ‌ర్ల దృష్టి వాట్సాప్ మీద నుంచి దాటిపోకుండా ఉండేందుకు నెలకు ఒక‌టి రెండు కొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేస్తుంది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా 120 మంది వాడుతున్న వాట్సాప్‌కు ఇండియాలోనే 20 కోట్ల మంది యూజ‌ర్లున్నారు.  వాట్సాప్ ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన కొత్త ఫీచ‌ర్లేమిటో ఓ లుక్కేయండి..  
1. వాట్సాప్ స్టేట‌స్  : స‌్నాప్ చాట్ స్టోరీస్ మాదిరిగా వాట్సాప్ స్టేట‌స్ ఫీచ‌ర్‌ను ఫిబ్ర‌వ‌రిలో లాంచ్ చేసింది. ఇమేజ్ లేదా షార్ట్ వీడియోను స్టేట‌స్‌గా పెట్టుకుంటే 24 గంట‌ల్లో ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. ఈ ఫీచర్ బాగా క్లిక్ అయింది. 

2. మీడియా షేరింగ్ లిమిట్ 
వాట్సాప్‌లో మీడియా షేర్ చేయాలంటే ఒక్క‌సారి ప‌ది మందికి మాత్ర‌మే పంప‌గ‌లిగే వీలుండేది. ఇప్పుడు ఆ లిమిట్‌ను 30 మందికి పెంచింది. ఆండ్రాయిడ్ బీటా వెర్ష‌న్‌కు జన‌వ‌రిలో రిలీజ‌యిన ఈ ఫీచ‌ర్ త‌ర్వాత ఆండ్రాయిడ్‌, ఓఎస్ అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌కూ వ‌చ్చింది.  దీన్ని యూజ‌ర్లు ఇంకా పెద్ద‌గా వినియోగించ‌డం లేదు. 
3. రీకాల్‌/  రివోక్ ఫీచ‌ర్  
చాట్‌లో పొర‌పాటున ఏదైనా మెసేజ్ సెండ్ చేస్తే దాన్ని రీకాల్ చేసుకునే సౌక‌ర్యాన్నీ తీసుకొచ్చింది.  అయితే అన్‌సెండ్ మెసేజ్‌ల‌ను మాత్ర‌మే రీకాల్ చేసి కావ‌ల్సిన మార్పులు చేయొచ్చు. ఐ ఫోన్ బేటా వెర్ష‌న్‌లో వ‌చ్చిన ఈ ఫీచ‌ర్ వాట్సాప్ వెబ్‌లో కూడా అందుబాటులోకి వ‌చ్చింది. అయితే మొబైల్ యాప్‌కు ఇంకా రాలేదు.  
4.  టూ స్టెప్ వెరిఫికేష‌న్ 
ఇది యూజ‌ర్ల‌కు ఆప్ష‌న‌ల్ సెక్యూరిటీ ఫీచ‌ర్‌.  యాప్‌నుకొత్త డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసేట‌ప్పుడు  ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగిస్తే 6 డిజిట్స్ పాస్ కోడ్ వ‌స్తుంది. దీన్ని ఉప‌యోగించి వెరిఫికేష‌న్ చేసుకుంటే మీ యాప్ మ‌రింత సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఫిబ్ర‌వ‌రిలో ఈ ఫీచ‌ర్ రిలీజైనా యూజ‌ర్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.  
5. ఆల్‌టైప్స్ ఫైల్ ట్రాన్స్ ఫ‌ర్  
మొద‌ట్లో ఇమేజ్‌లు, వీడియోలు, కాంటాక్ట్స్  మాత్ర‌మే వాట్సాప్‌లో షేర్ చేయ‌గ‌లిగే అవ‌కాశం ఉండేది. ఆల్‌టైప్ ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్ ఫీచ‌ర్‌తో వ‌ర్డ్‌, పీడీఎఫ్ ఎలాంటి ఫార్మాట్‌లో ఉన్న ఫైల్ అయినా, ఎంపీ సాంగ్స్ వంటివి, ఆఖ‌రికి యాప్‌ల‌కు సంబంధించిన ఏపీకే ఫైల్స్‌నూ షేర్ చేసుకోవ‌చ్చు. అయితే ఐవోస్ డివైస్‌ల‌కు 128 ఎంబీ, వెబ్‌లో అయితే 64 ఎంబీ, ఆండ్రాయిడ్‌లో అయితే 100 ఎంబీ మాత్ర‌మే ఒక‌సారి షేర్ చేయ‌గ‌ల‌రు.  
6. క్యూ మెసేజ్  
నెట్‌వ‌ర్క్ క‌నెక్టివిటీ లేని చోట వాట్సాప్ మెసేజ్‌లు పంపే సౌక‌ర్యం ఐ ఫోన్ లో లేదు.  ఈ    queue messages ఫీచ‌ర్ తో ఇప్పుడు ఐ ఫోన్ యూజ‌ర్లు నెట్‌వ‌ర్క్ లేని చోట నుంచి కూడా మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఫోన్ నెట్‌వ‌ర్క్‌కు క‌నెక్ట్ అయిన మ‌రుక్ష‌ణం ఈ మెసేజ్ ఆటోమేటిగ్గా సెండ్ అవుతుంది.  
7. Reincarnation of Text Status
స్టేట‌స్ ఫీచ‌ర్‌ను ఇంట్ర‌డ్యూస్ చేయ‌గానే వాట్సాప్ త‌న పాత టెక్ట్స్ స్టేట‌స్ ఫీచ‌ర్‌కు ముగింపు ప‌ల‌కాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే యూజ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డ‌తో దీన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది.  
8. ఫొటో బండ్లింగ్‌
వాట్సాప్ లో ఎవ‌రికైనా ఎక్కువ ఫొటోలు, వీడియోలు పంపాలంటే మ‌నం ఒకేసారి సెండ్ చేసినా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టే వాళ్ల‌కు సెండ్ అవుతున్నాయి.  ఫొటో బండ్లింగ్ ఫీచ‌ర్ ద్వారా ఎక్కువ ఫొటోల‌ను ఒక ప‌ర్స‌న్‌కు పంపిస్తే అది ఫొటో ఆల్బ‌మ్ మాదిరిగా వాళ్ల‌కు చేరుతుంది. వాళ్లు అలా రిసీవ్ చేసుకున్న ఆల్బ‌మ్‌ను ఓపెన్ చేస్తే అవ‌న్నీ సింగిల్ పేజీలోనే క‌నిపిస్తాయి.  ఐఫోన్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ గ‌త నెల‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది. ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లో రానుంది.  

9.వీడియో స్ట్రీమింగ్‌
వాట్సాప్‌లో ఎవ‌రైనా మ‌న‌కు వీడియో షేర్ చేస్తే అది డౌన్‌లోడ్ అయ్యే వ‌ర‌కు చూడ‌డం కుదర‌దు. కానీ వీడియో స్ట్రీమింగ్ ఫీచ‌ర్‌తో అది డౌన్లోడ్ అవుతుండ‌గానే మ‌నం చూసేయ‌వ‌చ్చు. ఆండ్రాయిడ్ బీటా వెర్ష‌న్‌లో లాంచ్ అయినా ఫ‌స్ట్ మాత్రం ఐ ఫోన్ యూజ‌ర్ల‌కే అందుబాటులోకి వ‌చ్చింది. 

  10. రిఫ్రెష్‌డ్ కాలింగ్ స్క్రీన్‌
 వాట్సాప్ కాలింగ్ స్క్రీన్‌లో కూడా మార్పులు చేసింది. ఇంత‌కుముందు  వాయిస్ లేదా వీడియో కాల్ ఆన్స‌ర్ చేయాలంటే సైడ్‌కు స్వైపింగ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు  పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది.  
11. నైట్ మోడ్  
  లోలైట్ కండిష‌న్ల‌లో ముఖ్యంగా రాత్రి స‌మ‌యంలో ఫొటోలు తీసుకునేటప్పుడు  ఉప‌యోగ‌ప‌డేలా నైట్ మోడ్ ఫీచ‌ర్ను తీసుకొచ్చింది.   ఆటోఫోకస్ ఫీచ‌ర్‌తో ఫొటోను బ్రైట్‌గా చూపిస్తుంద‌ని తెలుస్తోంది. దీనికోసం వాట్సాప్ కెమెరా లో ఫ్రంట్‌, రియ‌ర్ కెమెరా ఆప్ష‌న్ల  మాదిరిగానే zoom in/out,  turn on/off LED flash అనే రెండు ఆప్ష‌న్లు కూడా   ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.  ఎల్ఈడీ ఫ్లాష్ ఆన్ చేస్తే ఫొటో లో లైటింగ్‌లో కూడా బ్రైట్‌గా వ‌స్తుంది.   నైట్ మోడ్‌లో వాట్సాప్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ (స్క్రీన్ లుక్‌) బ్లాక్ క‌ల‌ర్‌లో ఉంటుంది. దీనివ‌ల్ల యూజ‌ర్ కంటిపై స్ట్రెయిన్ త‌గ్గుతుంది.    ఐ ఫోన్ల‌లో ముందుగా ఈ ఫీచ‌ర్ వ‌చ్చింది.  
12.  సిరి తో రీడ్ మెసేజ్ ఫీచ‌ర్  
గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సిరికి వాట్సాప్ లో నాలుగు అడ్వాంటేజ్‌ల‌ను తీసుకొచ్చింది.  కావాలంటే మీ మెసేజ్‌ల‌ను సిరీయే చ‌దివి వినిపిస్తుంది. కాల్స్ టాబ్‌, కాంటాక్ట్ ఇన్పో, గ్రూప్ ఇన్ఫో స్క్రీన్‌ల‌కు విజువ‌ల్ ఇంప్రూవ్‌మెంట్ తీసుకొచ్చింది.  సెలెక్ట్ చేసిన మ‌ల్టిపుల్ స్టేట‌స్ ఒకే పేజీలో చూపిస్తుంది.  ప‌ర్షియ‌న్ లాంగ్వేజిని కూడా సిరి స‌పోర్ట్ చేస్తుంది.  
చాట్ ఇంప్రూవ్‌మెంట్స్‌, చాట్ పిన్నింగ్ వంటి ఫీచ‌ర్లు కూడా ఈ ఏడాదే రిలీజ‌యి యూజ‌ర్ల‌ను ఆకట్టుకుంటున్నాయి.  

జన రంజకమైన వార్తలు