• తాజా వార్తలు

నోకియా 3310 రివ్యూ

ప్రస్తుతం అయితే స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తుంది కానీ ఈ స్మార్ట్ ఫోన్ లు రాకముందు ఫోన్ అంటే ఫీచర్ ఫోనే కదా! ఫీచర ఫోన్ లలో అనేకరకాల కంపెనీలు ఉన్నప్పటికీ నోకియా మాత్రం ఫీచర్ ఫోన్ లలో రారాజు గా ఒక వెలుగు వెలిగింది. ప్రత్యేకించి నోకియా యొక్క 1100 మోడల్ కు ఇప్పటికీ విపరీతమైన డిమాండ్ మరియు అభిమానులు ఉన్నారంటే దీనికి ఉన్న క్రేజ్ ను అర్థo చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ ల రాకతో నోకియా కు గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి. విండోస్ ఓ ఎస్ తో ఒక ప్రయోగం చేసినప్పటికీ అది అంతగా విజయవంతం కాలేదు. అయితే పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి అనే ఉద్దేశ్యం తో నోకియా మరొక ఫీచర్ ఫోన్ తో నే తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నోకియా 3310 అనే ఒక సరికొత్త ఫీచర్ ఫోన్ ను 20 17 లో నోకియా మార్కెట్ లోనికి విడుదల చేయనుంది.
స్మార్ట్ ఫోన్ లు రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక ఫీచర్ ఫోన్ వాటి హవాని తట్టుకుని నిలబడగలదా? నిలబడి మనగలదా? అంటే ఖచ్చితంగా అవును అని నోకియా సమాధానం చెబుతుంది. ఈ నేపథ్యం లో ఈ నోకియా 3310 కి సంబందించిన విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
దీనిగురించి ముందుగా చెప్పుకోవలసింది దీని డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ గురించి . ప్రత్యేకించి దీనియొక్క రెడ్ మరియు ఎల్లో ఆప్షన్ లలో లభించే ఫోన్ లైతే అద్భుతమైన ఔటర్ షెల్ ను కలిగిఉంటాయి. ప్రస్తుతo లభిస్తున్న స్మార్ట్ ఫోన్ లతో పోలిస్తే లుక్ విషయం లో ఇది వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అంతేగాక వాటికంటే ఇది చాలా సన్నగానూ మరియు కేవలం 80 గ్రాముల బరువుతో తేలికగానూ ఉంటుంది. దీని స్క్రీన్ కూడా ఫుల్ కలర్ గానూ మరియు అందమైన డిజైన్ తో నూ కూడి ఉంటుంది. వెనక వైపు led ఫ్లాష్ తో కూడిన ఒక బ్రాండ్ న్యూ కెమెరా ఉంటుంది. క్రింద వైపు 3.5 mm సాకెట్ ఉంటుంది.
ఇక మన్నిక విషయం లోనూ ఇది పాత నోకియా వెర్షన్ లను తలదన్నే రీతిలో డిజైన్ చేయబడింది. 2.4 ఇంచ్ QVGA డిస్ప్లే ను కలిగిఉంటుంది. ఆహ్లాదపరిచే నోకియా రింగ్ తోనే కూడా దీనికి అదనపు ఆకర్షణ గా నిలువనుంది.
స్పెసిఫికేషన్ లు మరియు ఫీచర్ లు
ఈ ఫోన్ యొక్క యూజర్ ఇంటర్ ఫేస్ సరికొత్తగా ఉండనుంది. మెనూ లో మీకు ఫోటోస్, మ్యూజిక్ ప్లేయర్, ఓపెరా మొబైల్ స్టోర్, క్యాలెండర్, వెదర్, క్యాలిక్యులెటర్ , FM రేడియో, వాయిస్ రికార్డర్ మరియు క్లాసిక్ స్నేక్ గేమ్ యొక్క సరికొత్త వెర్షన్ లు ఉంటాయి. అంటే కొంచెం ఇంచుమించు గా ఇది స్మార్ట్ ఫోన్ ఫీచర్ లను పోలి ఉన్నట్లేగా! ఇందులో ఉండే ప్రధాన ఆకర్షణ స్నేక్ గేమ్. నోకియా పాత వెర్షన్ లలో స్నేక్ గేమ్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. దానికి మరిన్ని హంగులు జోడించి రంగులలో ఈ స్నేక్ గేమ్ సరికొత్తగా తీసుకురాబడింది.
ఇందులో డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ లు ఉంటాయి. 32 జిబి వరకూ సపోర్ట్ చేసే మైక్రో ఎస్ డి కార్డు స్లాట్ లు ఉంటాయి. అయితే ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం కేవలం 16 MB మాత్రమే ఉంటుంది. 3.5 mm హెడ్ సెట్ తో ఇది లభిస్తుంది. d- పాడ్ నావిగేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది.
పెర్ఫార్మన్స్, కెమెరా, బ్యాటరీ లైఫ్
ఇది కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే అయినప్పటికీ స్మార్ట్ ఫోన్ ల స్థాయిలో పర్ఫార్మన్స్ ఇస్తుంది. ఇది మీడియా టెక్ ఉత్పాదన అయిన నోకియా 30 ప్లస్ అన్ ఆపరేటింగ్ సిస్టం ను కలిగి ఉంటుంది. 2 మెగా పిక్సెల్ లు ఉండే కెమెరా led ఫ్లాష్ తో లభిస్తుంది. ఇక ఇందులో ఉండే బ్యాటరీ 1200 mAh పవర్ ను కలిగి 22 గంటల పాటు పనిచేస్తుంది.

జన రంజకమైన వార్తలు