• తాజా వార్తలు
  •  

రివ్యూ - నోకియా 7 ప్ల‌స్  

హెచ్ఎండీ గ్లోబ‌ల్ నేతృత్వంలోకి వెళ్లాక నోకియా బ్రాండ్ నేమ్‌తో లాస్ట్ ఇయ‌ర్ నుంచి మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్‌చేస్తోంది. ఇందులో భాగంగా నోకియా 7 ప్ల‌స్‌ను మార్కెట్లోకి తెచ్చింది.  25,999 రూపాయ‌ల ధ‌ర‌తో మార్కెట్లోకి వ‌చ్చిన నోకియా 7 ప్ల‌స్ కాంపిటీష‌న్‌కు త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌దా? అస‌లు ఈ ఫోన్ ఎలా ఉందో చూద్దాం ప‌దండి.
 

డిజైన్‌
నోకియా  7ప్ల‌స్‌లో ఆరు అంగుళాల‌18:9 డిస్‌ప్లే ఉంది.  దాదాపు బీజిల్‌లెస్ అన్న‌మాట‌. ఇప్ప‌టివ‌ర‌కు నోకియా ఈ సైజ్ డిస్‌ప్లే ఇవ్వ‌లేదు.ఇది ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌తో వ‌చ్చింది. ఈ ఫోన్‌కు ఉన్న క‌ర్వ్డ్ ఎడ్జ్‌లు గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్‌ను గుర్తుకుతెస్తాయి.  6000 సిరీస్ అల్యూమినియం బాడీ, బ్యాక్ సిరామిక్ కోటింగ్ చూడ‌డానికి లుక్ బాగుంది. స్ట్రాంగ్ ఉంద‌న్న ఫీలింగ్ కూడా క‌నిపిస్తుంది.  స్క్రీన్‌ చుట్టూ, ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌, కెమెరా చుట్టూ ఇచ్చిన కాప‌ర్ లైనింగ్ చూడ్డానికి స్టైలిష్ గా కనిపిస్తుంది. 3,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడంతో ఫోన్ చేతిలోకి తీసుకుంటే కాస్త బరువుగా అనిపిస్తుంది. ఫోన్ కింద భాగంలో  ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిప్‌లతోపాటు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ఉంది.  3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు. మెటాలిక్ బ‌ట‌న్స్ ఈజీగా క్లిక్ అవుతున్నాయి. రెండు హైబ్రీడ్ సిమ్‌ల‌కు స్లాట్ ఇచ్చింది.  మైక్రో ఎస్డీ కార్డు వాడుకోవాలంటే ఒక సిమ్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. 
 

కెమెరాలు:  జీసిస్ బ్రాండింగ్‌తో వ‌చ్చిన రెండు 12, 13 మెగాపిక్సెల్  కెమెరాలు బాక్‌సైడ్ ఉన్నాయి. కెమెరా లెన్స్ చుట్టూ ఉన్న కాప‌ర్ లైనింగ్ వ‌ల్ల లెన్స్ మీద గీత‌లు ప‌డ‌కుండా కాపాడుతుంది. డ్యూయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్‌.
 

స్పెసిఫికేష‌న్స్‌, సాఫ్ట్‌వేర్‌
లాస్ట్ ఇయ‌ర్ రిలీజ్ చేసిన ఫోన్ల‌లో హార్డ్‌వేర్ అంత బాగాలేద‌ని కంప్ల‌యింట్స్ రావ‌డంతో హెచ్ ఎండీ గ్లోబ‌ల్ ఈసారి కాస్త జాగ్ర‌త్త ప‌డింది.  నోకియా 7 ప్ల‌స్ ఇండియాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్ వాడిన తొలి స్మార్ట్‌ఫోన్ కావ‌డం విశేషంగా చెప్పుకోవాలి. దీనిలో ఆక్టాకోర్ సెట‌ప్ ఉంది. * ఆడ్రినో 512 గ్రాఫిక్స్ ప్రాసెస‌ర్ ఉంది

* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఇచ్చారు. 256 జీబీ వ‌ర‌కు ఎస్డీ కార్డుతో ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు.

* బ్లూటూత్ 5, వైఫై  802.11ac, జీపీఎ్‌, గ్లోనాస్‌, ఎన్ఎఫ్‌సీ క‌నెక్టివిటీ ఉంది.

* ప్రైమ‌రీ సిమ్ 4జీ VoLTE టెక్నాల‌జీని స‌పోర్ట్ చేస్తుంది. కానీ సెకండ్ సిమ్ 3జీ లేదా 2జీ నెట్‌వ‌ర్క్‌ల‌కే ప‌రిమితం.  ఇప్పుడు అన్ని ఫోన్లూ రెండు సిమ్‌లూ 4జీ క‌నెక్టివిటీతో ఉండేవి ఇస్తుండ‌గా ఇక్క‌డ ఒక‌దానికే పరిమితం చేయ‌డం మైన‌స్ పాయింట్ 

ప్ల‌స్‌పాయింట్స్‌

+  సాఫ్ట్‌వేర్ అప్‌గ్ర‌డేష‌న్‌

+ బ్యాట‌రీ బ్యాక‌ప్‌

+ హెవీ యాప్స్‌, గేమ్స్‌ను హ్యాండిల్ చేస్తుంది

+  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్

మైన‌స్ పాయింట్స్\

- 4జీ సిమ్ స్లాట్ ఒక‌టే ఉండ‌డం

-  నైట్ టైమ్ ఫోటోలను జూమ్ చేస్తే క్లారిటీ మిస్స‌వుతోంది.

-  ఈ ప్రైస్‌కు వొప్పో, వివో లాంటి కంపెనీలు 6జీబీ ర్యామ్ ఇస్తుంటే నోకియా 7 ప్ల‌స్‌లో 4జీబీ ర్యామ్ మాత్రమే ఇచ్చారు.

జన రంజకమైన వార్తలు