• తాజా వార్తలు
  •  

రివ్యూ- ప్ర‌త్య‌ర్థుల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేలా నోకియా 8

నోకియా.. ఈ పేరుకు ఒక చ‌రిత్ర ఉంది. దానికో ప్ర‌త్యేక‌త ఉంది. ఎన్నో ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తినా.. ఎన్ని కొత్త కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చినా.. సెల్‌ఫోన్ విప్ల‌వానికి నాంది ప‌లికింది మాత్రం నిస్సందేహంగా నోకియా అనే చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్ జ‌మానా మొద‌లు కాక మునుపు,  భార‌త సెల్‌ఫోన్ మార్కెట్ ఇంత పెద్ద‌ది కాక పూర్వం.. నోకియాది అతి పెద్ద మార్కెట్‌. ఎవ‌రి చేతిలో చూసినా నోకియా ఫోనే. ఎవ‌రి నోట విన్నా నోకియా గురించి. ఒక‌ప్పుడు నోకియాకు స‌ర్వీసు సెంట‌ర్లు దొరికేవి కానీ మిగ‌తా వాటికి వెతుక్కోవాల్సి వ‌చ్చేది. అయితే చానాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మార్కెట్‌ను ప‌ల‌క‌రించింది ఈ బ్రాండ్.  ఆ కంపెనీ నుంచి వ‌చ్చిన తాజా సిరీస్ నోకియా 8 కూడా మంచి హంగుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు పోటీ ఇచ్చేదిగానే ఉంది.

డిజైన్‌, ఫినిషింగ్ సూప‌ర్‌
నోకియా 8లో బాగా ఆక‌ర్షించేది.. ఆక‌ట్టుకునేది ఏంటంటే దీని డిజైన్ దీని ఫినిషింగ్‌. నోకియా 6తో పోలిస్తే నోకియా 8 ఫార్ బెట‌ర్‌. మంచి హ్యాండ్ గ్రిప్‌తో పాటు 5.3 ఇంచ్ స్క్రీన్‌, 6000 సిరీస్ అల్యుమినియం బాడీతో ఈ ఫోన్ మెరిసిపోతుంది. ల‌ష్ మెటల్ బ్లూ క‌ల‌ర్ దీనికి మ‌రింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ క్లాసీ ఫోన్‌లో మ‌రో ఆక‌ర్ష‌ణ దీని ఫినిషింగ్‌. చ‌క్క‌ని అల్యుమినియం బాడీతో దీని ఫినిషింగ్ అదిరిపోయింది. దీన్నిహోల్డ్ చేయ‌డం చాలా సౌక‌ర్య‌వంతం.  దీనిలో క్వాల్‌కాం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెస‌ర్‌ను ఉప‌యోగించారు. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఎల్‌టీఈ లాంటి టాప్ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌ను ఉన్న‌త శ్రేణిలో నిల‌బెడుతున్నాయి.  ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌కు త‌గ్గ‌ని ఫీచ‌ర్లు ఉన్న నోకియా 8లో లేటెస్ట్ టెక్నాల‌జీ వాడారు.

వెనిలా ఆండ్రాయిడ్ 7.1
ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో నౌగ‌ట్ 7.1 ఓఎస్‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే నోకియా 8 మ‌రో అడుగు ముందుకు వేసింది. ఆండ్రాయిడ్‌లో కొత్త ఓఎస్ వెర్ష‌న్ వెనిలా 7.1 వెర్ష‌న్‌ను ఈ నోకియా కొత్త మోడ‌ల్‌కు ఉప‌యోగించారు. గూగుల్ అసిస్టెంట్ దీనికున్న మ‌రో ప్ర‌త్యేక‌త‌.  5.3అంగుళాల డిస్‌ప్లేను  కొర్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రూపొందించారు. ఇది స్క్రాచ్ ఫ్రీ. దీనిలో ఉన్న మ‌రో యూనిక్ ఫీచ‌ర్ ఏంటంటే బోతీస్‌. రాబోయే త‌రంలో అతి పెద్ద సంచ‌ల‌నం కానుంద‌ని భావిస్తున్న బోతిస్ ఫీచ‌ర్‌ను ఈ ఫోన్‌లో ఉప‌యోగించారు. 13 మెగా పిక్స‌ల్ డ్యుయ‌ల్ కెమెరాలో ఇదో యూనిక్ ఫీచ‌ర్ . ఫొటోల‌ను, వీడియోల‌ను స్ల్పిట్ చేసి ఒకేసారి తీసుకోగ‌ల‌గ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ దీనిలో ఉన్న మ‌రో స్పెషాలిటి. ఛార్జింగ్‌కు నోకియా పెట్టింది పేరు. నోకియా 8 కూడా క‌చ్చితంగా ఛార్జింగ్ విష‌యంలో తిరుగు లేకుండా  ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

విజ్ఞానం బార్ విశేషాలు