• తాజా వార్తలు
  •  

వనప్లస్ 5, ఎంఐ మిక్స్ 2 వ‌ర్సెస్  నోకియా 8.. వీటిలో ఏదీ ఉత్త‌మం!

ఫోన్ల వార్ నడుస్తుంది ఇప్పుడు.  భార‌త్ వేదిక‌గా చైనా, కొరియా కంపెనీలు నేనంటే నేనంటూ వ‌రుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో గుర్తుంచుకునేవి...కొన‌ద‌గ్గ‌వి కొన్ని మాత్ర‌మే. ఆ జాబితాలోముందు వ‌రుస‌లో ఉండే ఫోన్ల‌లో వ‌న్‌ప్ల‌స్ 5, ఎంఐ మిక్స్  2, నోకియా 8 ఉంటాయి. మ‌రి మూడు ఫోన్ల‌లో ఏది ఉత్త‌మం? ఏ ఫోన్‌కు మిగిలిన ఫోన్‌ను డేమినేట్ చేసి ముందుకెళ్లే సామ‌ర్థ్యం ఉంది?


డిజైన్, డిస్‌ప్లే
డిజైన్‌, డిస్‌ప్లే  ఏ స్మార్ట్‌ఫోన్‌కైనా వినియోగ‌దారులు మొద‌ట చూస్తుంది ఇదే. వేలు పెట్టి ఫోన్ కొన్నా లుక్ బాగోక‌పోతే వేస్తే క‌దా.  కొత్త‌గా వ‌చ్చిన ఎంఐ మిక్స్ 2  డిజైన్ విష‌యంలో గొప్ప‌గా ఉంది. బెజెల్ లెస్ 5.99 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేతో ఈ పీస్ అదిరిపోయింది. అల్యుమినియం పూత‌తో కూడిన మెటల్ యూనిబాడీ దీని అందాన్ని పెంచుతోంది. మ‌రోవైపు వ‌న్‌ప్ల‌స్ 5 అయితే  5.5 అంగుళాల డిస్‌ప్లేతో పాటు మెట‌ల్ యూనిబాడీతో ఉంటే,  నోకియా మాత్రం స్పోర్ట్స్ యూనిబాడీ, 5.3 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో తయారైంది. డిజైన్‌, లుక్ విష‌యంలో మూడింట్లో ఎంఐ మిక్స్‌దే పైచేయి. 
 
హార్డ్‌వేర్‌
హార్డ్‌వేర్ విష‌యంలో మూడు ఫోన్లు నువ్వా నేనా అన్న‌ట్లు ఉన్నాయి. ఎంఐ మిక్స్ 2లో స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్,  6 ఎంబీ ర్యామ్ వాడితే, వ‌న్‌ప్ల‌స్ 5లో 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్ వాడారు. నోకియాలో 4జీబీ ర్యామ్ ఉప‌యోగించారు. ర్యామ్ విష‌యంలో నోకియా క‌న్నా వ‌న్‌ప్ల‌స్‌, మిక్స్‌2ల‌దే పైచేయిగా చెప్పొచ్చు. 

స్టోరేజ్‌
ఎంఐ మిక్స్‌2లో 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ ఉంది. వ‌న్‌ప్ల‌స్ 5లో  64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఉంది. ఇక నోకియా8లో మాత్రం 64 జీబీ స్టోరేజ్ ఆఫ‌ర్ చేస్తోంది. స్టోరేజ్ విష‌యంలో నోకియా, వ‌న్‌ప్ల‌స్‌, మిక్స్ 2లు స‌మంగా ఉన్నాయి. 

ఫెర్మార్‌మెన్స్‌
ఫెర్మార్‌మెన్స్‌లో ఎంఐ మిక్స్‌2 ఎక్కువ స్కోర్ చేస్తుంది. వ‌న్‌ప్ల‌స్ 5 కూడా ఫెర్మార్‌మెన్స్ విష‌యంలో మెరుగ్గానే ఉంది. నోకియా 8 మాత్రం పూర్తిగా ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది. 4 జీబీ ర్యామ్ ఉండ‌డం వ‌ల్లే ఫెర్మార్‌మెన్స్ విష‌యంలో మిగిలిన రెండు ఫోన్ల క‌న్నా వెనుకంజలో ఉంది. 

సాఫ్ట్‌వేర్‌
జియోమి ఎంఐ మిక్స్‌2లో లేటెస్ట్ ఎంఐయూఐ 9 ఇంట‌ర్‌ఫేస్ వాడారు. అంతేకాక ఆండ్రాయిడ్ 7 న‌గౌట్ ఓఎస్ ఉంది. నోకియా 8లోనూ ఆండ్రాయిడ్ న‌గౌట్   ఓఎస్ ఉప‌యోగించారు. త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్ ఓరియోకు మారే అవ‌కాశాలున్నాయి. ఇక వ‌న్‌ప్ల‌స్ 5లో ఆక్సిజ‌న్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉప‌యోగించారు. ఓఎస్ విష‌యంలో నోకియా 8తో అగ్ర‌స్థానం. 

కెమెరా, బ్యాట‌రీ, ధర
ఎంఐ మిక్స్ 2లో 12 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటే, వ‌న్ ప్ల‌స్‌లో 12 ఎంపీ రేర్ కెమెరా,  20 ఎంపీ టెలిఫొటో వైడ్ సెన్సార్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. నోకియా   8లో 13 ఎంపీ రేర్ సెన్సార్, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ విష‌యంలో వ‌న్‌ప్ల‌స్‌, నోకియా ముందుంలో ఉన్నాయి. మిక్స్ 2లో 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వ‌న్‌ప్ల‌స్‌లో 3300, నోకియాలో 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ వాడారు. ఈ విష‌యంలో అందరి అవ‌కాశాలు స‌మానం.  ధ‌ర వ‌న్‌ప్ల‌స్ 5 ఫోన్ల‌కు రూ.32 వేలు, 37 వేలుగా ఉంటే,  ఎంఐ ఫోన్‌కు రూ.37 వేలు, నోకియాకు 36 వేలుగా ఉంది. ధ‌ర‌, ఫీచ‌ర్లు, వెర్ష‌న్ అన్ని చూసుకుంటే ఎంఐ మిక్స్ 2ది  ఈ మూడింట్లో పైచేయిగా చెప్పొచ్చు.                                                                                                                     

విజ్ఞానం బార్ విశేషాలు