• తాజా వార్తలు
  •  

పేటీఎం ర‌హ‌స్య ప్ర‌యోగం.. విక‌టించిందా?

గ‌తేడాది న‌వంబ‌ర్ 8న కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన డీమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు)తో బాగుపడిన వాళ్లు ఎవరని లిస్ట్ తయారు చేస్తే అందులో ఫస్ట్ ఉండే పేరు పేటీఎంది. మనీ, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేటీఎం ఒక ఆల్టర్నేట్ మనీ అన్నంతగా పాపులరయిపోయింది.  పేటీఎం వ‌చ్చే ఐదేళ్ల‌లో సాధించాల‌నుకున్న క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌ను డీమానిటైజేష‌న్ త‌ర్వాత ఒక్క నెల‌లో సాధించేసింది.  తోపుడు బండి మీద పళ్లు అమ్ముకునేవాళ్ల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు అన్ని చోట్లా పేటీఎం యాక్సెప్టెడ్ హియర్ అని బోర్డులు వచ్చేశాయి. పేటీఎంకు ఇప్పుడు లక్ష‌లాది మంది క‌స్ట‌మ‌ర్లున్నారు.  పాల బూత్ నుంచి హోట‌ల్ బిల్ వ‌ర‌కు చాలా వాటికి పేటీఎంనే యూజ్ చేస్తున్నారు.   ఇవ‌న్నీ క‌లిసి పేటీఎం యాజ‌మాన్యానికి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేశాయా అనేలా ఈ మ‌ధ్య కాలంలో తీసుకున్న కొన్ని చ‌ర్య‌లు చూస్తుంటే అనిపిస్తుంది. పేటీఎం వాలెట్లో క్రెడిట్ కార్డ్‌తో మ‌నీ యాడ్ చేస్తుంటే అది ఆటోమేటిగ్గా గిఫ్ట్ వోచ‌ర్‌లోకి కన్వ‌ర్ట్ అవుతుండ‌డంతో క‌స్ట‌మ‌ర్లు చాలా ఆగ్ర‌హంగా ఉన్నారు. 
బిజినెస్ పెరిగింది..
బిజినెస్ పెర‌గ‌డంతో పేటీఎంలో బ‌ట్ట‌లు, దుస్తులు, ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి అమ్మేవిభాగాన్ని డివైడ్ చేసి పేటీఎం మాల్ అనే కొత్త సెక్ష‌న్ ప్రారంభించింది. పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ తీసుకుని పేటీఎం బ్యాంక్‌ను కూడా స్టార్ట్ చేసింది. పేటీఎం వాలెట్‌లో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్ ద్వారానే మ‌నీ యాడ్ చేసుకుని దాంతో ట్రాన్సాక్ష‌న్లు చేసుకుంటున్నారు.కావాల్సిన‌చోట దాన్ని వాడుకుంటున్నారు. వాస్త‌వానికి క్రెడిట్ కార్డ్ వాడినా, పేటీఎం వాడినా పెద్ద తేడా ఏమీ లేదు. అయితే చిన్న‌చిన్న వ్యాపారుల దగ్గ‌ర క్రెడిట్ కార్డ్ యూజ్ చేయ‌డానికి స్వైపింగ్ మిష‌న్లు లేక‌పోవ‌డం, వాళ్ల ద‌గ్గ‌ర బేసిక్ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఉన్నాపేటీఎంతో పేమెంట్ తీసుకోవడానికి అవ‌కాశం ఉంటుంది. దీంతో క‌స్ట‌మ‌ర్లు   చిన్న‌చిన్న అవ‌స‌రాల‌కు కూడా క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ల‌కుండా ఒక్క‌సారే 500, 1000 రూపాయ‌లో పేటీఎం వాలెట్‌లో యాడ్ చేసుకుని వాడుకుంటున్నారు.  అవ‌స‌ర‌మైతే కొంతమినిమం ఛార్జితో మీ వాలెట్లోని అమౌంట్‌ను మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు. అయ‌తే  నాలుగైదు రోజుల క్రితం ఇలా క్రెడిట్ కార్డ్‌లో నుంచి వాలెట్‌లోకి మ‌నీ  యాడ్ చేస్తుంటే ఆ మ‌నీ ఆటోమేటిగ్గా పేటీఎం గిఫ్ట్ వోచ‌ర్ల‌లోకి వెళ్లిపోయింది.అంటే దాన్ని పేటీఎం వాలెట్లో మాత్ర‌మే వాడుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కు గానీ ఆఖ‌రికి వేరే పేటీఎం క‌స్ట‌మ‌ర్‌కు గానీ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి కుదర‌దు. ఈ చ‌ర్య క‌రెక్ట్ కాద‌ని యూజ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా చెప్పా పెట్ట‌కుండా వాలెట్ మ‌నీని గిఫ్ట్ వోచ‌ర్‌గా మార్చ‌డం ఆర్‌బీఐ రూల్స్‌కు కూడా విరుద్ధం.      
జస్ట్ ప్ర‌యోగ‌మేన‌ట‌!
క‌స్ట‌మ‌ర్లు మండిప‌డ‌డంతో పేటీఎం వెంట‌నే దీన్నివెన‌క్కి తీసుకుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి వాలెట్‌లోకి మనీ లోడ్ చేసుకోవ‌చ్చు. అస‌లుఎంత మంది క్రెడిట్ కార్డ్‌ల ద్వారా వాలెట్లోకి మ‌నీ నింపుతున్నార‌నే చూద్దామ‌నే ఈ ప్ర‌యోగం చేప‌ట్టామ‌ని పేటీఎం క‌వ‌ర్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది.  క్రెడిట్ కార్డ్‌లో నుంచి వాలెట్ నింపి తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోకుండా ఆప‌డానికే పేటీఎం ఈ ప‌ని చేసింది.  గ‌తంలో క్రెడిట్ కార్డ్‌తో వాలెట్ నింపితే 2% ఫీజు అని మొద‌లుపెట్టి ఇలాగే బెడిసికొట్ట‌డంతో వెనక్కి తీసుకుంది. ఇప్పుడు కూడా మ‌ళ్లీ ప్ర‌యోగం చేసి చేతులు కాల్చుకుంది. క్రెడిట్ కార్డ్‌తో వాలెట్ నింపినా దాన్నిబ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్‌చేయాలంటే ఛార్జీలు, జీఎస్టీతో క‌లిసి 100కు 3రూపాయ‌ల వ‌ర‌కు పడుతుంది. ఇది 36% ఇంట‌రెస్ట్ రేట్‌తో స‌మానం. అవ‌స‌రానికి త‌మ క్రెడిట్ కార్డ్ బ్యాల‌న్స్‌ను అలా వాడుకుంటున్నాం..ఇందులో పేటీఎంకు వ‌చ్చిన నొప్పేంట‌న్న‌ది యూజ‌ర్ల ప్ర‌శ్న‌.మిగ‌తా వాలెట్లు  దీన్నిఅంగీకరిస్తున్న‌ప్పుడు పేటీఎం ఇలా చేయ‌డానికి కార‌ణం లక్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లున్నార‌నే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని కామెంట్ చేస్తున్నారు.