• తాజా వార్తలు
  •  

రివ్యూ-ఆక‌ట్టుకునే హంగుల‌తో శాంసంగ్ గెలాక్సీ నోట్ 8

శాంసంగ్ నుంచి ఏ కొత్త మొబైల్ వ‌చ్చినా వినియోగ‌దారులు దృష్టి అటువైపు మ‌ళ్లుతుంది. ఎందుకంటే మారుతున్న ప‌రిస్థితుల‌కు తగ్గ‌ట్టుగా అప్‌డేటెడ్‌గా ఫోన్ల‌ను మార్కెట్లోకి వ‌ద‌ల‌డంలో శాంసంగ్ ముందుంటుంది. ఈ కోవ‌లోకి చెందిందే గెలాక్సీ నోట్ 8. పెద్ద బ్యాట‌రీ, ఆకట్టుకునే స్క్రీన్‌తో పాటు ఎన్నో మరెన్నో ఆప్ష‌న్లు ఈ కొత్త శాంసంగ్ ఫోన్‌లో ఉన్నాయి. అయితే కొత్త‌గా వ‌చ్చిన గెలాక్సీ నోట్ 8లో ఉన్న ఫీచ‌ర్లు.. అంత‌కుముందు గెలాక్సీ  ఫోన్ల‌లో లేని ఫీచ‌ర్లు ఏమిటో చూద్దాం..

గెలాక్సీ నోట్ 7లా కాకుండా..
గెలాక్సీ నోట్ 7.. శాంసంగ్‌లో విజ‌యవంతం కాని ఒక మోడ‌ల్‌. ఈ మోడ‌ల్‌లో మంచి ఫీచ‌ర్లే ఉన్నా.. ఎందుకో ఆ జ‌నాల‌కు మాత్రం ఎక్క‌లేదు. ఈ మోడ‌ల్ ఫెయిల్ కావ‌డంతో కాస్త స‌మ‌యం తీసుకున్న శాంసంగ్.. మ‌రో మోడ‌ల్ ఫోన్‌తో బ‌రిలో దిగింది. గ‌తంలో విఫ‌ల‌మైన మోడ‌ల్‌లోని ఫీచ‌ర్లు రిపీట్ కాకుండా, త‌ప్పులు దిద్దుకుంటూ ఒక కొత్త మోడ‌ల్‌ను త‌యారు చేసింది శాంసంగ్. ఆ కొత్త మోడ‌లే శాంసంగ్ గెలాక్సీ నోట్ 8. వేగ‌వంత‌మైన ఫెర్మార్‌మెన్స్‌, మంచి డిజైన్‌, వాట‌ర్‌ఫ్రూఫ్‌, మంచి కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ఇలా చాలా ఆప్ష‌న్లు ఈ ఫోన్ సొంతం. 

ఫింగ‌ర్‌ ప్రింట్ స్కాన‌ర్‌
ఇప్పుడు అన్ని స్మార్ట్‌ఫోన్లు భ‌ద్ర‌తకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. మ‌న ఫోన్లో ఉన్న విలువైన డేటాను ఎవ‌రూ త‌స్క‌రించ‌కుండా.. గ‌ట్టి భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్నాయి. సాధారణ పాస్‌వ‌ర్డ్‌ల‌తో పాటు ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ఇదే కోవ‌కు చెందుతుంది. ఫింగ‌ర్ ప్రింట్  స్కాన‌ర్‌తో పాటు వీఆర్ స‌పోర్ట్  దీనిలో ఉన్న మ‌రో ఆప్ష‌న్‌. మీ జేబులో ఇమిడిపోయేలా స‌న్న‌గా ఉండ‌డ‌మే ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌. 6.3 అంగుళాల స్క్రీన్‌తో ఇది అదిరేలా క‌నిపిస్తుంది. 

ఐ ఫోన్ 7 ప్లస్ మాదిరిగానే.. 

 ఐఫోన్ 7 ప్లస్ లాగే ఇది కూడా ఆకారంలోనూ, ఫీచ‌ర్ల‌లోనూ ఆక‌ట్టుకుంటుంది.  ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌ను ప్ర‌త్యేకంగా మారుస్తుంది.  3500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఛార్జింగ్ ఇబ్బందులు కూడా ఉండ‌వు. మూమెంట్స్‌ను కాప్చ‌ర్ చేయ‌డంలో దీనిలో ఉన్న కెమెరా స్పెష‌ల్‌గా ప‌ని చేస్తుంది.  ఫోటోలు, వీడియోలు చాలా క్లియ‌ర్‌గా ఉంటాయి. ఇది డీఎస్ఎల్ఆర్‌తో తీసిన పిక్స్‌లాగే ఉంటాయి.

విజ్ఞానం బార్ విశేషాలు