• తాజా వార్తలు

రివ్యూ - రెడ్‌మీ 5 అన్నీ ఎక్కువే.. ధ‌ర త‌ప్ప‌

షియోమి.. రీసెంట్‌గా ఇండియాలో లాంచ్‌చేసిన రెడ్ మీ 5 ఫోన్ అద్దిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఎంఐ  ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.  దీనిలో ఎన్ని ప్ర‌త్యేక‌త‌లున్నా ధ‌ర మాత్రం త‌క్కువగా ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ ఫోన్ ఇంత‌కుముందు వ‌చ్చిన రెడ్‌మీ 5 ప్ల‌స్ ఫీచ‌ర్ల‌న్నింటితోనూ త‌యారైంది. రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్ల‌స్ (రెడ్‌మీ నోట్ 5)రెండూ కూడా బీజిల్ లెస్ డిస్‌ప్లేతోనే వచ్చాయి.రెడ్‌మీ నోట్ 5 ఫోన్‌10 వేల ధ‌ర‌తో స్టార్ట‌యితే రెడ్‌మీ 5..ఎనిమిది వేల ధ‌ర నుంచే అందుబాటులో ఉంది. రెడ్‌మీ 5 ఇండియాలో అతిచౌక‌యిన బీజిల్‌లెస్ ఫోన్ కూడా. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌తో న‌డిచే ఈ ఫోన్ ఫీచ‌ర్లు, ప్ర‌త్యేక‌త‌లేమిటో ఓ లుక్కేసేద్దాం ప‌దండి.
స్లిమ్‌, స్లీక్‌
రెడ్‌మీ 5 చూడ‌డానికి అచ్చం రెడ్‌మీ నోట్ 5లానే ఉంటుంది. అయితే సైజ్‌లో కాస్త చిన్న‌ది. చాలా స్లీక్ డిజైన్‌తో, ప్రీమియం లుక్‌తో క‌నిపిస్తుంది. ఆల్‌మోస్ట్ ఫుల్ మెట‌ల్ బాడీ, క‌ర్వ్‌డ్ 2.5డీ గ్లాస్ బాడీ  చూడ‌డానికి ఫోన్‌కు రిచ్ లుక్‌ను ఇస్తున్నాయి. ఈ ఫోన్ ఇయ‌ర్‌పీస్ (మ‌నం చెవి ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడుకునే పార్ట్‌)కు అద‌న‌పు వాట‌ర్‌ప్రూఫ్ లేయ‌ర్ ఉంది. దీంతో చెమ‌ట‌, దుమ్ము ఫోన్‌లో పోకుండా కంట్రోల్ చేస్తుంది. దీంతో కాల్ వాల్యూమ్ త‌గ్గిపోదు.

సూప‌ర్ ఫీచ‌ర్లు
* 7.7.మి.మీ.మందం
* 720x1440  పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో 282 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో 5.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* బీజిల్‌లెస్ స్క్రీన్ కావ‌డంతో ఫోన్‌చిన్న‌గా ఉన్నా స్క్రీన్ పెద్ద‌గా ఉంటుంది.
* ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్
* కొత్త‌గా వ‌చ్చిన ఎంఐ టీవీ 4 స్మార్ట్‌టీవీతోపాటు స్మార్ట్ ప్రొడ‌క్ట్స్‌ను కంట్రోల్ చేయ‌డానికి ఫోన్ కింది భాగంలో మోనో స్పీక‌ర్ అవుట్‌, ఐఆర్ బ్లాస్ట‌ర్ ఉన్నాయి.
అడ్వాన్స్డ్ ప్రాసెస‌ర్‌
1.8 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌తో ఇండియాలో అతి చౌక‌యిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5.  మెరుగైన బ్యాట‌రీ లైఫ్, థ‌ర్మ‌ల్ ఎఫిషియ‌న్సీ, ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్ ఈ ప్రాసెస‌ర్ ప్ల‌స్‌పాయింట్లు. వివో వీ7+ ఒక్క‌టే ప్ర‌స్తుతం ఇండియాలో ప్ర‌స్తుతం ఈ ప్రాసెస‌ర్‌తో న‌డుస్తున్న స్మార్ట్‌ఫోన్. దాని ధ‌ర 20వేలు. అంటే రెడ్‌మీ 5 త‌క్కువ ధ‌ర‌లోనే ఎంత అడ్వాన్స్డ్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిందో తెలుస్తుంది.
* 4జీబీ ర్యామ్‌
* 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండబుల్
* ఆండ్రాయిడ్ 7.1.2 నోగ‌ట్ బేస్డ్ MIUI 9 ఓఎస్‌
* 4జీ ఎల్టీఈ, వోల్ట్ క‌నెక్టివిటీ
*12 ఎంపీ ఫేస్ డిటెక్ష‌న్‌, ఆటో ఫోక‌స్‌, డ్యూయ‌ల్ ఎల్ఈడీ, డ్యూయ‌ల్ టోన్ ఫ్లాష్‌తో కూడిన రియ‌ర్ కెమెరా
* 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* 3,300 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర త‌క్కువే
ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్నా రెడ్‌మీ 5 ధ‌ర అంద‌రికీ అందుబాటులోనే ఉంది. 2జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో వ‌చ్చేఫోన్ 7,999 రూపాయ‌లు. 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో వ‌చ్చేఫోన్ 8,999 రూపాయ‌లు. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో వ‌చ్చేఫోన్ రూ. 10,999.  

జన రంజకమైన వార్తలు