• తాజా వార్తలు

రిమూవ‌బుల్ బ్యాట‌రీలు వ‌ర్సెస్ రీప్లేస‌బుల్ బ్యాట‌రీలు.. ఏవి బెస్ట్?

సెల్‌ఫోన్‌లో అత్యంత కీల‌క‌మైన కాంపోనెంట్స్‌లో బ్యాట‌రీ ఒక‌టి. ఫోన్ ఎంత సూప‌ర్ అయినా, కెమెరా ఎంత కేక పెట్టించినా, రామ్ ఓహో అనేలా ఉన్నా.. బ్యాట‌రీ బ్యాక‌ప్ బాగోలేక‌పోతే ఆ ఫోన్ మార్కెట్లో బ‌తక‌దు. అందుకే ఫోన్ కొనేట‌ప్పుడు బ్యాట‌రీ ఎంత ఎంఏహెచ్ కెపాసిటీతో వ‌చ్చింద‌ని క‌చ్చితంగా చూస్తారు. అంతేకాదు బ్యాట‌రీ రిమూవ‌బుల్ బ్యాట‌రీనా కాదా అనేది కూడా చూస్తారు.  తొలినాటి ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో బ్యాటరీ ఎవ‌రైనా రిమూవ్‌చేయ‌గ‌లిగేలా ఉండేది.  ఇప్ప‌టికీ కొన్ని కంపెనీలు దాన్ని మెయింటెయిన్ చేస్తున్నాయి. 
ఏంటి తేడా?
రిమూవ‌బుల్ బ్యాట‌రీ అంటే ఫోన్ బ్యాక్ క‌వ‌ర్ ఓపెన్ చేసి ఎవ‌రైనా బ‌య‌టికి తీయ‌గ‌లిగేలా ఉంటుంది. ఆండ్రాయిడ్  ఫోన్ల‌లో బ్యాట‌రీ ఎంఏహెచ్ ఎక్కువ లేని రోజుల్లో, ప‌వ‌ర్ బ్యాంక్‌లు, స్పీడ్ ఛార్జ‌ర్లు అందుబాటులో లేని రోజుల్లో  బాగా ఫోన్ వాడేవాళ్లు రెండో బ్యాట‌రీ కూడా మెయింటెయిన్ చేసేవారు. రెండింటినీ ఫుల్ ఛార్జింగ్ చేసి ఒక‌దానిలో ప‌వ‌ర్ అయిపోగానే దాన్ని తీసి రెండోది వేసి వాడుకునేవారు. ఇక రెండో ర‌కం రీప్లేస‌బుల్ బ్యాట‌రీస్. అంటే ఇప్పుడు వ‌స్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనూ, ఐఫోన్ల‌లోనూ ఉండే టైప్‌. దీన్ని రిమూవ్ చేయాలంటే బ్యాక్ క‌వ‌ర్ తీసి లోప‌ల విడిభాగాలు చాలా తీసి అప్పుడుగానీ బ్యాట‌రీని బ‌య‌టికి తీయలేం. ఇది టెక్నీషియ‌న్స్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు.
రీప్లేస‌బుల్ బ్యాట‌రీలే బెట‌ర్‌.. ఎందుకంటే?
ఐఫోన్ 7 ఐఫోన్ మోడ‌ల్స్ అన్నింటిలోనూ టాప్ మోడ‌ల్ అంటారు. ఇది చాలా కాంపాక్ట్‌గా సూప‌ర్ ఎఫిషియంట్‌గా ఉంటుంది. అలాగే శాంసంగ్‌, ఎల్జీ, గూగుల్ పిక్సెల్ లాంటి ఫోన్ల‌లోనూ రీప్లేస‌బుల్ బ్యాట‌రీలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ప్ర‌తి చిన్న‌గ్యాప్‌ను ఫిల్ చేస్తూ స్పేర్‌పార్ట్‌ల‌న్నీ కాంపాక్ట్‌గా అమ‌ర్చి ఉంటాయి. ఇలాంటి ఫోన్ల‌లో రిమూవబుల్ బ్యాట‌రీలు పెడితే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై అవుతుంది. దానికి తోడు ఇవి ప్రీమియం ఫోన్లు కావ‌డంతో త‌క్కువ స్పేస్‌లోనే ఎక్కువ ఫీచ‌ర్ల‌కు అవ‌కాశం క‌ల్పించాలి. అందుకేచాలా చిన్న స్పేర్‌పార్ట్స్ టైట్‌గా ఫిట్ చేస్తారు. అంతేకాదు ఈ ఫోన్ల‌లో రిమూవబుల్ బ్యాటరీ వాడితే చీటికీమాటికీ బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే  గ్లాస్ పార్టులు  దెబ్బతినడం, అల్యూమినియం ఫ్రేమ్స్ బెండ్ అవడం వంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ప్రీమియం ఫోన్లు కాబట్టి ప్లాస్టిక్, చీప్ ఫైబర్ వాడరు. 50 డాలర్లు (దాదాపు 3,500 రూపాయలు) ఎక్కువ ఖర్చు పెడితే మంచి క్వాలిటీతో ఉన్న రిమూవబుల్ బ్యాక్ కవర్ వస్తుంది. అయినా కేవలం బ్యాటరీని తరచూ రిమూవ్ చేసే అవసరం ఈ ఫోన్లలో ఉండదు కాబట్టి అనవసరంగా ఈ ఖర్చు ఎందుకని కంపెనీలు  దూరంగా ఉంటాయి. 
బ్యాటరీ కెపాసిటీ, అర్ధగంటలోనే దాదాపు 50 పర్సంట్ బ్యాటరీ ఫిల్ చేసే ఫాస్ట్ ఛార్జర్లు వచ్చాక ఇలా మాట్లాడితే రిమూవ్ చేసే అవసరం లేదు కాబట్టి రీప్లేసబుల్ బ్యాటరీలతో వస్తున్న ప్రస్తుత ఫోన్లే బెటర్.కాదూ రిమూవబుల్ బ్యాటరీ కావాలంటే మోటో ఈ4, ఎల్జీ వీ 20 లాంటి ఫోన్లు కొనుక్కోవచ్చు.
 

జన రంజకమైన వార్తలు