• తాజా వార్తలు
  •  

రివ్యూ - శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్‌-ఆండ్రాయిడ్ కి అత్యున్నత ఉదాహరణ ఈ ఫోన్

శాంసంగ్ ఏ కొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చినా వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ముందంజ‌లో ఉంటుంది. ముఖ్యంగా గెలాక్సీ సిరీస్‌లో వ‌చ్చిన దాదాపు అన్ని ఫోన్లు భార‌త మార్కెట్లో సంచ‌ల‌న‌మే. ప్ర‌తిసారీ ఒక కొత్త ఫీచ‌ర్‌తో క‌స్ట‌మ‌ర్ల దృష్టిలో ప‌డ‌డం శాంసంగ్ ప్ర‌త్యేక‌త‌. ఈ సంస్థ నుంచి వ‌చ్చిన న‌యా ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్ కూడా దీనికి మిన‌హాయింపు కాదు.  ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను మించిన  ఫీచ‌ర్లు దీనిలో ఉన్నాయ‌ని ఆ సంస్థ చెబుతుంది. మ‌రి శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ఏ విధంగా ఉత్త‌మ‌మైన‌దో చూద్దామా..

డిజైన్‌, డిస్‌ప్లే
శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్‌ డిజైన్‌, డిస్‌ప్లే ప‌రంగా ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. నిజానికి గ‌తంలో వ‌చ్చిన ఎస్‌8ను పోలిన డిజైన్‌, డిస్‌ప్లే ఉన్నా..  ఓవ‌రాల్ లుక్ ప‌రంగా చూసుకుంటే ఈ ఫోనే ఉత్త‌మంగా క‌నిపిస్తుంది. ముఖ్యంగా మెటాలిక్ సైడ్ ఫ్రేములుగా చాలా బాగున్నాయి. డ్యుయ‌ల్ ఒంపు ఉన్న మెర్జ్ దీనిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. ప్రిమియంగా బిల్డ్ చేసిన ఈ ఫోన్ మ‌న‌కు పట్టుకోవ‌డానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. అంతేకాదు చూడ‌టానికి అందంగానూ ఉంటుంది. సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేతో.. స్పోర్టింగ్ 18:9 యాస్పెక్ట్ రేషియోతో దీని లుక్ అదిరింది. స్పెల్ఫీ కెమెరా సెన్సార్‌, స్పీక‌ర్‌, ఇత‌ర సెన్సార్‌ల‌తో ఓవ‌రాల్‌గా చాలా హ‌డావుడిగా కూడా ఉంది. హైబ్రీడ్ స్లిమ్ స్లాట్ ఉన్న ఈ ఫోన్లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ఉంది. 

బిక్స్‌బే ఫీచ‌ర్‌
మిగిలిన ఫీచ‌ర్ల‌న్నీ ఒక ఎత్తైతే గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్‌లో బిక్స్‌బే ఆప్ష‌న్ మ‌రో ఎత్తు. దీనిలో శాంసంగ్ కంపెనీకి సొంత‌మైన గూగుల్ అసిస్టెంట్ లాంటి వెర్ష‌న్ ఉంది. దాని పేరే బిక్స్‌బే.  కోర్ ఫీచ‌ర్ల‌తో ఈ డిజిట‌ల్ అసిస్టెంట్ ఫీచ‌ర్ మిళిత‌మై ఉంది. లెఫ్ట్‌లో ఉన్న డెడికేటెడ్ బ‌ట‌న్‌ను యాక్టివేట్ చేయ‌డం ద్వారా మీరు ఈ బిక్స్‌బే ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. దీనిలో ఉన్న కెమెరా అబ్జెక్ట్ రిక‌గ‌నైజేష‌న్ టెక్నాల‌జీ ఉంది. అంతేకాదు రియ‌ల్‌టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స‌లేష‌న్ చేయ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త‌.  త్వ‌ర‌లోనే శాంసంగ్ బిక్స్‌బే 2.0 వెర్ష‌న్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో మ‌రింత మెరుగైన సేవ‌లు అంద‌నున్నాయి. 

ఏఆర్ ఎమోజీలు
ఏఆర్ ఎమోజీలు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్ మ‌రో ప్ర‌త్యేక‌త‌. ఐఫోన్ ఎక్స్ మాదిరిగానే శాంసంగ్ త‌న సొంత‌వైన ఏఆర్ ఎమోజీల‌ను త‌యారు చేసింది. దీన్ని ఉప‌యోగించ‌డం చాలా ఫ‌న్‌గా ఉంటుంది. మీరు వీటితో జీఐఎఫ్ క్రియేట్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు మీ ముఖ క‌వ‌ళిక‌ల‌ను ప్ర‌త‌బింబించేలా ఈ ఏఆర్ ఎమోజీలు ఉంటాయి. యూత్‌కు ఈ ఆప్ష‌న్ ప‌క్కా న‌చ్చి తీరుతుంది. ఇదే కాక ఆల్ట్రా స్లో మోష‌న్ వీడియో కూడా మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్. అయితే ఇది త‌క్కువ లైటింగ్ ఉన్న ప‌రిస్థితుల్లో అంత స‌మ‌ర్ధ‌వంతంగ ప‌ని చేయ‌క‌పోవడం ఒక్క‌టే కాస్త నిరాశ క‌లిగించే అంశం. కెమెరా విష‌యానికొస్తే 12 మెగా పిక్స‌ల్ సెన్సార్  దీనిలో ఉంది. డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్‌లో డ్యుయ‌ల్ ఆప్టిక‌ల్ స్ట‌బిలైజేష‌న్ ఆప్ష‌న్ ఉంది.  ఆండ్రాయిడ్ ఒరియో 8.0 సాఫ్ట్‌వేర్ వాడిన ఈ ఫోన్ క‌స్ట‌మ‌ర్ల‌కు పూర్తి సంతృప్తిని ఇస్తుంద‌ని ఆ సంస్థ చెబుతోంది.