• తాజా వార్తలు

సెండ్ ఎనీ వేర్ సెండ్ ఎనీ థింగ్ రివ్యూ

నేటి స్మార్ట్ యుగం లో ఫైల్ లను ట్రాన్స్ ఫర్ చేయడం అనేది ఒక నిత్య కృత్యం గా మారిపోయింది. మీరు ముచ్చటగా దిగే సెల్ఫీ ల దగ్గర నుండీ అతి ముఖ్యమైన సమాచారం వరకూ ఎప్పుడూ ఏదో ఒక సమాచారం ట్రాన్స్ ఫర్ అవుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ స్మార్ట్ ఫోన్ లో కొన్ని సెల్ఫీ లను దిగారు అనుకోండి. వాటిని ఏం చేస్తారు. షేర్ ఇట్ లేదా USB లను ఉపయోగించి మీ ఫ్రెండ్ యొక్క ఫోన్ కు లేదా కంప్యూటర్ కు వాటిని పంపిస్తారు. ఒకవేళ మీ ఫ్రెండ్ మీకు దూరంగా ఉంటే వాట్స్ అప్ లాంటి మాధ్యమాల ద్వారా పంపిస్తారు. అయితే మీరు పంపించే ఫైల్ లు వాట్స్ అప్ లాంటి చాటింగ్ యాప్ ల ద్వారా పంపలేనంత హెవీ గా ఉంటే?
ఇకపై ఈ సందేహం అవసరం లేదు. సెండ్ ఎనీ వేర్ అనే యాప్ వచ్చేసింది. ఈ యాప్ ను ఉపయోగించి ఏ ఫైల్ నైనా ఎక్కడికైనా పంపించవచ్చు. ఇది విండోస్, మాక్, ఆండ్రాయిడ్, మరియు ఐఒఎస్ లాంటి అన్ని ఆపరేటింగ్ సిస్టం లలోనూ పనిచేస్తుంది. దీనిద్వారా దగ్గర ఉన్న డివైస్ లతో పాటు దూరంగా ఉన్న డివైస్ లకు కూడా ఫైల్ లను పంపించవచ్చు.మీరు పంపే ఫైల్ లు క్లౌడ్ లో స్టోర్ అవ్వవు. ఈ ఫైల్ లు ఒక 6 అంకెల కోడ్ ద్వారా ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఈ కోడ్ కేవలం పది నిముషాలు మాత్రమే వ్యాలిడ్ గా ఉంటుంది. అంటే మీరు పంపే ఫైల్ లు ఎంతో సురక్షంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వివిధ రకాల ప్లాట్ ఫాం లపై ఈ సెండ్ ఎనీ వేర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
వెబ్ లో ఇది ఎలా పనిచేస్తుంది?
1. https://send-anywhere.com/ ను విజిట్ చేయండి.
2. యాడ్ ఫైల్స్ అనే దానిపై క్లిక్ చేసి మీరు పంపాలి అనుకున్న ఫైల్ లను సెలెక్ట్ చేసుకోవాలి.
3. మీరు ఫైల్ లను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ యొక్క వివరాలు మీకు కనిపిస్తాయి, సెండ్ పై క్లిక్ చేయాలి.
4. మీరు సెండ్ పై క్లిక్ చేసిన తర్వాత 6 అంకెల కీ మరియు QR కోడ్ మీకు కనిపిస్తుంది.
5. ఇప్పుడు అవతలి వ్యక్తీ సెండ్ ఎనీ వేర్ ను తన వెబ్ లోకానీ , ఆండ్రాయిడ్ లో కానీ ఓపెన్ చేసి ఫైల్ లను రిసీవ్ చేసుకోవాలి.
6. అక్కడ అతను మీరు ఇచ్చిన కీ ను ఇన్ పుట్ చేయవలసి ఉంటుంది. అలా చేసిన వెంటనే ఆ ఫైల్ డౌన్ లోడ్ చేయబడుతుంది.
7. అంతే ఇలా 1 Gb వరకూ ఏ ఫైల్ ను అయినా ఎక్కడికి అయినా సులభంగా పంపవచ్చు.
ఆండ్రాయిడ్ లో ఇది ఎలా పనిచేస్తుంది?
1. మొదటగా ఈ సెండ్ ఎనీ వేర్ ను మీ ఆండ్రాయిడ్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.
2. దానిని ఓపెన్ చేసి సెలెక్ట్ ఫైల్ పై క్లిక్ చేసి ఫైల్ లను సెలెక్ట్ చేసుకోవాలి.
3. సెలెక్ట్ చేసుకున్న ఫైల్ లపై సెండ్ అని క్లిక్ చేయాలి.
4. ఇప్పుడు మీకు 6 అంకెల కీ మరియు QR కోడ్ కనిపిస్తుంది.
5. మీరు ఎవరికైతే ఫైల్ లను పంపాలి అనుకుంటున్నారో వారికి ఈ కోడ్ ను పంపాలి.
6. అవతలి వ్యక్తి తన వెబ్ లో కానీ లేదా ఆండ్రాయిడ్ లో కానీ సెండ్ ఎనీ వేర్ ను ఓపెన్ చేసి రిసీవ్ పై క్లిక్ చేయాలి.
7. ఆ తర్వాత మీరు పంపిన కోడ్ ను ఇన్ పుట్ చేయాలి. కుడి వైపు ఉన్న డౌన్ లోడ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
8. వెంటనే మీరు పంపిన ఫైల్ డౌన్ లోడ్ చేయబడుతుంది.
ఇది ఐఒఎస్ లో ఎలా పనిచేస్తుంది?
1. ఆండ్రాయిడ్ లో ఇలా పని చేసిందో దాదాపుగా ఐఒఎస్ లో కూడా ఇది అలాగే పనిచేస్తుంది.
2. అయితే ఐ ఒఎస్ యూజర్ లు అప్లికేషను ను షేర్ చేసుకోవడం కుదరదు.
ఈ సెండ్ ఎనీ వేర్ యొక్క ప్రత్యేకతలు
1. ఇది అన్ని ఆపరేటింగ్ సిస్టం లనూ, అన్ని పరికరాలనూ సపోర్ట్ చేస్తుంది.
2. మీరు మీ ఫైల్ లను పది నిమిషాల కాల వ్యవధి మాత్రమే ఉండే 6 అంకెల కోడ్ ద్వారా పంపిస్తారు కాబట్టి మీ ఫైల్ చాలా సెక్యూర్ గా ఉంటాయి.
3. మీరు మెసెంజర్ ద్వారా కూడా దీనిని ఉపయోగించి ఫైల్ లను పంపవచ్చు. ఇది 48 గంటల వరకూ యాక్టివ్ గా ఉంటుంది.
4. ఇది సుమారు 140 దేశాలకు పైగా 10 మిలియన్ సార్లు డౌన్ లోడ్ చేయబడింది. నెలకు 2.5 మిలియన్ ల యూజర్ లను కలిగి ఉంది.
5. దీనికోసం మీరు ఏ విధమైన ఎకౌంటు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
6. ట్రాన్స్ ఫర్ స్పీడ్ అద్భుతంగా ఉంటుంది.

జన రంజకమైన వార్తలు