• తాజా వార్తలు
  •  

అన్ని టెల్కోల్లో రోజుకు 1జీబీ డేటా + అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌పై ఓ లుక్ ..

వాయిస్ కాల్స్‌కు ఓ రీఛార్జి.. డేటాకు మరో టారిఫ్‌, ఎస్ఎంస్‌లకు ఇంకోటి అంటూ వినియోగ‌దారుల నుంచి భారీగా సొమ్ము చేసుకున్న టెలికం కంపెనీల‌న్నీ జియో రాకతో దిగొచ్చాయి. జియో వాయిస్ కాల్స్‌, డేటా, మెసేజ్‌లు అన్నీ క‌లిపి బండిల్డ్ ప్యాకేజ్ గా ఇవ్వ‌డంతో యూజ‌ర్స్ బాగా ఎట్రాక్ట్ అయ్యారు. దీంతో మిగిలిన కంపెనీల‌కు ఇదే దారిలోకి రాక త‌ప్ప‌లేదు. ఇప్పుడు జియోతోపాటు ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడా ఫోన్‌, బీఎఓస్ ఎన్ఎల్  కూడా డేటా, వాయిస్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు అన్నీ క‌లిపి బండిల్ ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా రోజుకు 1జీబీ డేటా ఇవ్వ‌డం  అనేది ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. దీంతోపాటు వాయిస్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు  కూడా. 

రిల‌య‌న్స్ జియో
* 96 రూపాయ‌ల ప్లాన్‌:  జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్న ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున వారం రోజుల‌కు మొత్తం 7జీబీ 4జీ డేటా. అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఫ్రీ.
* 309 రూపాయ‌ల ప్లాన్‌:  జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్న ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 56 రోజుల‌కు మొత్తం 56జీబీ 4జీ డేటా. అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఫ్రీ.
* 399 రూపాయ‌ల ప్లాన్‌:  జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్న ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజుల‌కు మొత్తం 84 జీబీ 4జీ డేటా. అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఫ్రీ. 
పోస్ట్‌పెయిడ్  యూజ‌ర్స్‌కి
*309 రూపాయ‌ల ప్లాన్‌:  జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్న పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 60 రోజుల‌కు మొత్తం 60 జీబీ 4జీ డేటా. అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు.
* 399 రూపాయ‌ల ప్లాన్‌:  జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్నపోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 90  రోజుల‌కు మొత్తం 90 జీబీ 4జీ డేటా. అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఫ్రీ.


ఎయిర్‌టెల్ 
* 349 రూపాయ‌ల ప్లాన్‌:  ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 28 రోజుల‌కు మొత్తం 28 జీబీ  3జీ / 4జీ డేటా. అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్  ఫ్రీ
* 399 రూపాయ‌ల ప్లాన్‌: 4జీ కంపాట‌బులిటీ ఉన్న ఫోన్‌, 4జీ సిమ్ ఉన్న  ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజుల‌కు మొత్తం 84 జీబీ  4జీ డేటా. అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్  ఫ్రీ

వొడాఫోన్ 
348 రూపాయ‌ల ప్లాన్‌:  ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 28 రోజుల‌కు మొత్తం 28 జీబీ  3జీ / 4జీ డేటా. అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్  ఫ్రీ

ఐడియా
* 347 రూపాయ‌ల ప్లాన్‌:  ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 28 రోజుల‌కు మొత్తం 28 జీబీ  2జీ /3జీ / 4జీ డేటా. అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్  ఫ్రీ. 
* 357 రూపాయ‌ల రీఛార్జికి కూడా సేమ్ ఆఫ‌ర్ . అయితే  రోమింగ్ కాల్స్ కూడా ఫ్రీ . 

బీఎస్ఎన్ఎల్ 
429 రూపాయ‌ల ప్లాన్‌:  ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు రోజుకు 1జీబీ డేటా చొప్పున 90 రోజుల‌కు మొత్తం 90 జీబీ  2జీ /3జీ  డేటా. అన్ని నెట్‌వ‌ర్క్‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్  ఫ్రీ. 
అయితే ఈ ప్లాన్స్ స‌ర్కిల్స్‌ను బ‌ట్టి మార‌తాయి. జియో ప్లాన్స్ ఇండియా మొత్తం ఒక‌టే కాబ‌ట్టి ఇబ్బంది లేదు. బీఎస్ఎన్ఎల్ కూడా కేర‌ళ త‌ప్ప మిగిలిన  స‌ర్కిల్స్‌లో ఇదే ప్లాన్ న‌డుస్తుంది. 

విజ్ఞానం బార్ విశేషాలు