• తాజా వార్తలు
  •  

ఒప్పో ఎఫ్‌3 యాడ్‌ను.. విరాట్ కోహ్లీ వ‌చ్చినా బ‌తికించ‌లేక‌పోయాడు 

యాడ్ క్యాంపెయిన్‌తో సూప‌ర్ హిట్ అయిన ప్రొడ‌క్ట్స్‌ను చూశాం. కానీ కొన్ని యాడ్స్ ఎందుకు తీస్తారో, అస‌లు ఆ యాడ్‌లో ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో కూడా చెప్ప‌లేం.  పెద్ద క్రికెట‌ర్లు, ఫేమ‌స్ స్టార్ల‌ను పెట్టుకున్నా యాడ్ థీమ్‌లో క్లారిటీ లేక‌పోతే పేలిపోవ‌డం ఖాయం.  సెల్ఫీ కెమెరాల స్పెష‌లిస్ట్ అయిన ఒప్పో త‌న ఎఫ్‌3 స్మార్ట్‌ఫోన్ కోసం అలాంటిదే ఓ యాడ్ త‌యారుచేసింది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ ఏడాది వ‌ర‌స్ట్ టెక్ యాడ్స్ లిస్ట్‌లో ఏకంగా టాప్ ప్లేస్ కొట్టేసింది.  
వామ్మో ఏం యాడ్‌? 
దీపావ‌ళికి పెర్‌ఫెక్ట్ గిఫ్ట్ ఒప్పో ఎఫ్‌3 సెల్ఫీ ఎక్స్‌ప‌ర్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పాల‌న్న‌ది ఈ యాడ్ థీమ్‌. కానీ దాని టేకింగ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ధావ‌న్‌, రోహిత్‌, అశ్విన్ ఓ మ్యూజియంకి వెళ‌తారు. అక్క‌డ మిస్టీరియ‌స్‌గా ఉన్న ఓ అమ్మాయి శిల్పాన్ని ధావ‌న్ ఫొటో తీస్తే ఆ బొమ్మ ప్రాణం పోసుకుంటుంది.  అంద‌ర్నీ హ్యాపీగా ఉంచితేనే మిమ్మ‌ల్ని మ‌ళ్లీ మామూలుగా మారుస్తానంటూ మ‌న క్రికెట్ స్టార్ల‌ను ఏడెనిమిదేళ్ల పిల్ల‌ల్లా మార్చేస్తుంది. అక్క‌డి నుంచి వాళ్లు టైంలో వెన‌క్కి వెళ్లి ఓ రాజ్యంలో ప్ర‌జ‌ల‌ను సంతోష‌పెట్టి అక్క‌డ  ఓపెద్దాయ‌న ఇచ్చిన ఒప్పో ఎఫ్‌3 ఫోన్ తీసుకొచ్చి ఆ బొమ్మమాంత్రికురాలిని సెల్ఫీ తీసి సంతోష‌పెడ‌తారు. ఆమె ఖుషీ అయిపోయి వాళ్ల‌ను మామూలుగామార్చేస్తుంది. ఏడు నిముషాల ఈ యాడ్‌లో మాయ‌లు, మంత్రాలు, ఎమెష‌న్స్‌,డ్రామా అన్నీ ఉంటాయి. దీపావ‌ళికి ఒప్పో ఎఫ్‌3 ఫోన్ మంచి గిఫ్ట్ అని చెప్ప‌డానికి ఈ సోదంతా ఏంటి అని  ఈ యాడ్‌ను చూసి అంద‌రూ న‌వ్వుకున్నారు. పైగా ఏడు నిముషాల నిడివి.  ఎంత దారుణంగా ఉందంటే విరాట్ కోహ్లీ ఉన్నా కూడా దీన్ని బ‌తికించ‌లేక‌పోయాడ‌ని నెటిజ‌న్స్ కామెంట్లు చేశారు.
యూట్యూబ్‌లో Oppo F3: The Best Diwali Gift అని సెర్చ్ చేస్తే ఈ బీభ‌త్స‌మైన యాడ్ క‌నిపిస్తుంది. 
వ‌న్‌ప్ల‌స్ 3టీ యాడ్‌.. ఇంత వ‌ల్గ‌ర్‌గానా?
వ‌న్‌ప్ల‌స్ 3టీని చూడ‌గానే జ‌నం ఫ్లాట‌యిపోతార‌నే థీమ్‌తో వ‌చ్చిన యాడ్ ఇది. వ‌ల్గ‌ర్‌నెస్ హద్దులు దాటేసింది. ఆడా, మ‌గా తేడా లేకుండా ఆ ఫోన్‌ను ముద్దులు పెట్టేయ‌డం, నాకేయ‌డం, కొరికేయ‌డం చూస్తే జుగుప్స క‌లుగుతుంది. వ‌న్‌ప్ల‌స్ లాంటి పెద్ద కంపెనీ ఇలాంటి పిచ్చి యాడ్‌ను ఎలా ఒప్పుకుంద‌ని నెటిజ‌న్స్ నిల‌దీశారు. 
ఈ యాడ్ యూట్యూబ్‌లో చూడాలంటే OnePlus 3T: Who Do You Love?
జియోనీ సెల్ఫిస్తాన్ యాడ్ కూడా.. 
జియోనీ యాడ్‌లో హిందుస్థాన్ అంతా సెల్ఫీకి ఫిదా అయిందంటూ వెల్‌క‌మ్ టూ సెల్ఫిస్తాన్  అంటూ బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ చేసిన యాడ్ కూడా వ‌రస్ట్ టెక్ యాడ్ జాబితాలోకే వ‌చ్చింది. సెల్ఫీలో రకాల‌న్నీ పాట‌గ‌ట్టి పాడినా జ‌నం చూడ‌లేదు.  
యూ ట్యూబ్‌లో Gionee: Welcome to Alia’s Selfiestan With Gionee అని సెర్చ్ చేస్తే ఆ  వీడియో  వ‌స్తుంది. 

జన రంజకమైన వార్తలు