• తాజా వార్తలు

 రైల్ సార‌థి యాప్  వాడితే... గ‌వ‌ర్న‌మెంట్ యాప్స్ ఎందుకు త‌యారుచేయ‌దో చిటికెలో  చెప్పేయొచ్చు.. 

ప్రైవేట్ కంపెనీలు ఇన్ని వంద‌ల‌, వేల యాప్‌లు త‌యారు చేస్తుంటే 125 కోట్ల మంది పాపులేష‌న్ కోసం గ‌వ‌ర్న‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్లు ఎందుకు ఎక్కువ యాప్‌లు త‌యారుచేయ‌వు?  అనే క్వశ్చ‌న్ ఎవ‌రికైనా వ‌స్తే రైల్వే డిపార్ట్‌మెంట్ ఇటీవ‌ల రిలీజ్ చేసిన రైల్ సార‌థి (Rail Saarthi) యాప్‌ను వాడండి. దెబ్బ‌కు మీ డౌట్స‌న్నీ క్లియ‌ర్ అయిపోతాయి. రైల్వే సేవ‌ల‌న్నింటిని ఒకే ఫ్లాట్‌ఫారంపైకి తెస్తామంటూ ఇంట్ర‌డ్యూస్ చేసిన ఈ యాప్ ప‌ని తీరు చూస్తే గ‌వ‌ర్న‌మెంట్ డిపార్ట్‌మెంట్లు యాప్స్ రిలీజ్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది అనిపిస్తుంది. 
8 యాప్‌లు క‌లిపి ఒక‌టే చోట 
ఇండియ‌న్ రైల్వే స‌ర్వీసెస్‌ను అందుబాటులోకి తేవ‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కు  8 యాప్స్ ఉన్నాయి.  
* IRCTC Rail Connect: ట‌్రైన్ టికెట్ల బుకింగ్ యాప్‌. దీని ద్వారా రోజుకు ల‌క్ష మంది టికెట్స్ బుక్ చేసుకుంటారు. రోజుకు 9.65 కోట్ల ఆదాయం వ‌స్తుంది.  
* UTS:  జ‌న‌ర‌ల్ బోగీల్లో టికెట్ రిజ‌ర్వ్ చేసుకోవ‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ద్వారా రోజూ 14,400 టికెట్లు అమ్ముడుపోతాయి. రోజుకు 7 ల‌క్ష‌ల దాకా ఇన్‌కం వ‌స్తుంది.  
* విమానం టికెట్ల కోసం  IRCTC Air,  టూరిజం ప్యాకేజ్‌ల కోసం IRCTC Tourism, రైల్లో భోజ‌నం బుక్ చేసుకోవ‌డానికి IRCTC Food-On-Track, కోచ్‌ల క్లీనింగ్ ఇన్ఫో కోసం  Coach Mitra,  కంప్లెయింట్స్ మేనేజ్‌మెంట్ కోసం COMS, రియ‌ల్ టైం   పాసింజ‌ర్ ఎంక్వ‌యిరీ సిస్ట‌మ్ కోసం  
NTES యాప్‌లు ఉన్నాయి.  ఇన్ని యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలంటే త‌క్కువ కాస్ట్‌లో వ‌చ్చే లోఎండ్ ఫోన్ల‌లో క‌ష్టం. అందువ‌ల్ల  
వీట‌న్నింటిని ఇంటిగ్రేట్ చేసి అన్ని స‌ర్వీస్‌ల‌ను ఒకే యాప్ కిందికి తీసుకొస్తామ‌ని రైల్ సార‌థి యాప్‌ను డిజైన్ చేశారు.

రైల్ సార‌థి ఎలా ప‌ని చేస్తోంది? 
నిజానికి రైల్ సార‌థి.. గ‌తంలో ఉన్న యాప్ ను ఇంటిగ్రేట్ చేసి తీసుకొచ్చింది కాదు. ఇది ఆ 8 యాప్‌ల‌కు ఒక మెనూలా మాత్ర‌మే ప‌ని చేస్తుంది.   ఈ యాప్‌లో వెళ్లి రి జిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే  గూగుల్ ప్లే స్టోర్ నుంచి   UTS for Rail Saarthi,  IRCTC Rail Connect for Rail Saarthi యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ రీ డైరెక్ట్ చేస్తోంది. ఈ రెండూ కొత్త యాప్‌లు. అంటే రైల్ సార‌థి యాప్‌ను మ‌నం వాడుకోవాలంటే గ‌తంలో ఉన్న 8 యాప్‌ల‌కు తోడు ఈ మూడు యాప్‌లు కూడా ఉండాలి.  

మండిప‌డిన యూజ‌ర్లు  
దాదాపు 8 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఈ యాప్‌ను డిజైన్ చేశారని స‌మాచారం. కానీ స‌ర్వీస్‌ను సింప్లిఫై చేయ‌కుండా డివైస్ మీద‌, డేటా మీద మ‌రింత భారం ప‌డేలా త‌యార‌యింది. దీనిపై యూజ‌ర్లు మండిప‌డ్డారు. రైల్వే టెక్నిక‌ల్ టీం అస‌లు యాప్ అంటే ఏంటో తెలుసుకున్నాక దాన్ని త‌యారు చేయాల్సిందంటూ సెటైర్లు వేశారు.  కేవ‌లం రైల్వే స‌ర్వీసెస్, ఇన్ఫో కోసం ఎవ‌రైనా మొబైల్ మెమ‌రీని వేస్ట్ చేసుకుని ఇన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారా? అని ప్రశ్నించారు. వీట‌న్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక‌టే యాప్‌ను తీసుకొచ్చేలా డిజైన్ చేసిన ప‌నిని ఏదైనా బెస్ట్ కంపెనీకి అప్ప‌గించాల‌ని స‌జెస్ట్  కూడా చేశారు.  

జన రంజకమైన వార్తలు