స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీయడం చాలా మందికి సరదా. కొంతమందికి అదో పెద్ద ప్యాషన్. కాబట్టే ఒకప్పడు 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌కే అబ్బో అనుకున్నవారు ఇప్పడు 20 మెగాపిక్సెల్స్ దాటినా తృప్తిపడడం లేదు. డీఎస్ఎల్ ఆర్ కెమెరాతో పోటీపడే స్థాయిలో క్వాలిటీ ఇమేజెస్ ఇచ్చే సెన్సర్లు, టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు వచ్చేస్తున్నాయి. కెమెరాలు, లెన్స్‌లు, మొబైల్ డివైజస్ల్లో కెమెరాల క్వాలిటీని ఎసెస్ చేసే DxOMark వెబ్సైట్.. కెమెరా క్వాలిటీ పరంగా ఐదు అత్యుత్తమ సెల్ఫోన్లను ఎంపిక చేసింది.
1. HTC U11
ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఒకటైన హెచ్‌టీసీ యూ 11 కెమెరా క్వాలిటీ పరంగానే మొదటి స్థానంలో ఉంది. DxOMark ఈ ఫోన్ కెమెరాకు నూటికి 90 మార్కులు ఇచ్చింది. 12 ఎంపీ కెమెరాలో 1/2.55 ఇంచెస్ సెన్సార్‌తోపాటు f/1.75 లెన్స్ కూడా ఉన్న యూ 11 కెమెరా అద్భుతమైన ఫొటోలు ఇస్తుంది. ఔట్‌డోర్ సీన్స్‌ను వైబ్రంట్ కలర్స్‌తో పిక్చరైజ్ చేస్తుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్లాష్ ఎక్స్‌పోజర్‌తో మంచి డిటెయిల్డ్ పిక్చర్ ఇస్తుంది. నాయిస్ కూడా తక్కువ ఉంటుంది.
2. Google Pixel
గూగుల్ నుంచి వచ్చిన ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ కెమెరా పెర్ఫార్మెన్స్ విషయంలో లాస్ట్ ఇయర్ కూడా మంచి రేటింగ్ సాధించింది. DxOMark స్కోర్ నూటికి 89. 12.3 ఎంపీ కెమెరాకు ఉన్న సెన్సర్లు తక్కువ నాయిస్‌తో మంచి క్వాలిటీ ఇమేజెస్‌ను అందిస్తున్నాయి. లైటింగ్ లెవెల్ తక్కువగా ఉన్నా కూడా క్వాలిటీ ఇమేజస్ గూగుల్ పిక్సెల్ ఫోన్ ప్రత్యేకత. కాంట్రాస్ట్, వైట్ బ్యాలన్స్, ఫాస్ట్ ఆటోఫోకస్ ఇలా కెమెరాకు సంబంధించిన అన్ని క్వాలిటీల్లోనూ ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని DxOMark చెప్పింది.
3. HTC 10
ఈ కేటగిరీలో మూడో బెస్ట్ ఫోన్ ఇది. 12 ఎంపీ కెమెరాకు ఉన్నా ఆటోఫోకస్, టెక్స్చర్ ప్రిజర్వేషన్ ఫీచర్లు ఇమేజ్ క్వాలిటీని పెంచుతాయి. నోయిస్ రిడక్షన్ బాగా పని చేస్తోంది. లోలైటింగ్ లోనూ ఫొటో బాగా వచ్చేలా వైట్ బ్యాలన్స్ మెయింటెన్ చేస్తోంది. లో లైట్లో తీసిన వీడియోల్లో అక్కడక్కడా ప్యాచ్‌లు కనిపించినా చాలా సందర్భాల్లో కెమెరాకున్న ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఆటోఫోకస్ దాన్ని కవర్ చేస్తోంది. మొత్తంగా హెచ్‌టీసీ 10 కెమెరాకు DxOMark స్కోర్ నూటికి 88.
4. Samsung Galaxy S8
ఈ సంవత్సరం అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ ఎస్ 8 కూడా ఒకటి. సూపర్ డిజైన్, మంచి హార్డ్‌వేర్ సెటప్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు కొట్టేసిన గెలాక్సీ ఎస్ 8 కెమెరా క్వాలిటీలోనూ బాగుంది. DxOMark స్కోర్ నూటికి 88. ఎస్8కు ఉన్న కెమెరాకు అద్భుతమైన ఆటోఫోకస్, యాక్యురేట్ వూట్ బాలన్స్, ఎఫెక్టివ్ నాయిస్ రిడక్షన్ ప్లస్ పాయింట్లు. వీడియో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. లోలైటింగ్ విజువల్స్‌లో డిటెయిల్స్ (క్వాలిటీ) అంతగా లేకపోవడం, నాయిస్ ఉండడం తప్ప కెమెరాపరంగా మిగిలిన అన్ని ఫీచర్లూ బాగున్నాయి.
5. Sony Xperia XZ
40వేల లోపు ధర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీ విషయంలో మంచి పెర్ఫార్మెన్స ఇస్తోంది. DxOMark వెబ్సైట్ దీని కెమెరాకు ఇచ్చిన స్కోర్ 87. 23 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఈ ఫోన్‌కు హైలెట్. లో లైటింగ్ లోనూ గ్రేట్ ఎక్స్పోజర్, ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఆటోఫోకస్, మంచి వైట్ బ్యాలన్స్ దీనికి ప్లస్పాయింట్లు, వీడియో స్టెబిలైజేషన్ బాగుంది. ఇమేజ్ కార్నర్స్‌లో షార్ప్‌నెస్ లేకపోవడం, వీడియో కాప్చరింగ్లో చిన్న వైబ్రేషన్స్ కనిపించడం వంటి నెగిటివ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ కెమెరా పెర్ఫార్మెన్స్ బాఉగందని DxOMark చెప్పింది.