• తాజా వార్తలు
  •  

రివ్యూ - 2017లో టాప్ 5  టెక్ యాడ్స్ ఏంటో తెలుసా? 

కారం పొడి నుంచి కార్ల వ‌ర‌కు ఏ వ‌స్తువైనా అమ్మాలంటే ప్ర‌చార‌మే కీల‌కం. Neighbours envy.. Owners pride (పొరుగువారికి అసూయ‌.. య‌జ‌మానికి గ‌ర్వ‌కార‌ణం) అంటూ ఒనిడా టీవీ కోసం 30 ఏళ్ల క్రితం చేసిన యాడ్ ఇప్ప‌టికీ చాలామందికి గుర్తుంది. ఐ ల‌వ్ యూ ర‌స్నా అని న‌వ్వులు చిందింన చిన్న‌పాప ముఖాన్ని కూడా చాలామంది గుర్తు పెట్టుకున్నారు. ఇక ఫెవీక్విక్ యాడ్స్ అయితే ఎంత క్రియేటివిటీతో ఉంటాయో చెప్ప‌లేం. యాడ్‌ను బ‌ట్టి ప్రొడక్ట్‌ను గుర్తుప‌ట్టారంటే ఆ యాడ్ స‌క్సెస్‌ను కొల‌వడానికి  అంత‌కంటే పెద్ద స్కేల్ అవ‌స‌రం లేదు. అలాంటి యాడ్స్ టెక్ ప్రొడ‌క్ట్స్‌కూ ఉంటాయి. 2017లో అలా బాగా బెస్ట్‌ యాడ్స్ గురించి ఓ లుక్కేయండి.  
1. శాంసంగ్:  గేర్ ద‌ట్ గివ్స్ యూ వింగ్స్ (Samsung: Gear That Gives You Wings)
శాంసంగ్ వీఆర్ గేర్ యాడ్ ఈ లిస్ట్‌లో ఫ‌స్ట్ చెప్పుకోవాలి. ఎగ‌ర‌లేని అతిపెద్ద ప‌క్షి ఆస్ట్రిచ్ శాంసంగ్ వీఆర్ గేర్  పెట్టుకుని ఆకాశంలో ఎగిరిన‌ట్లు ఊహించుకుంటుంది. ప్ర‌య‌త్నించి ఫెయిల‌వుతుంది.  కానీ వీఆర్ గేర్‌లో ఆకాశం అందాన్ని చూసి ప‌ట్టుద‌ల‌తో మ‌ళ్లీ ట్రై చేసిస‌క్సెస్ అవుతుంది. మీ ఊహల్లో ఉన్న‌దాన్ని క‌ళ్ల‌ముందుకు తెస్తామ‌నే థీమ్‌తో త‌యారుచేసిన ఈ యాడ్ మంచి స‌క్సెస్ అయింది. 
2. ఎయిర్‌టెల్: ద‌ స్మార్ట్‌ఫోన్ నెట్‌వ‌ర్క్ (Airtel: The Smartphone Network)
ఇండియాలో అతిపెద్ద టెలికం నెట్‌వ‌ర్క్ అయిన ఎయిర్‌టెల్ త‌న స్మార్ట్‌ఫోన్ నెట్‌వ‌ర్క్ గురించి రూపొందించిన యాడ్ సెకండ్ బెస్ట్‌.  ముద్దుముద్దుగా ఉంటే చిన్న‌చిన్న పిల్ల‌లను మీకేం కావాల‌ని అడిగితే రాకెట్‌లా ఎగ‌రాల‌ని, బాడీగార్డ్ కావాల‌ని ర‌క‌ర‌కాల కోర్కెలు చెబుతారు. చిన్న‌పిల్ల‌ల‌కు కోరిక‌లున్న‌ట్లే సెల్‌ఫోన్ యూజ‌ర్లకు మంచి నెట్‌వ‌ర్క్‌, సూప‌ర్ స్పీడ్‌, ఆఫ‌ర్లు ఇవ‌న్నీ కావాల‌నుకుంటార‌ని, అవ‌న్నీ ఎయిర్‌టెల్ ద్వారా అందుతాయ‌ని చూపించే ఈ యాడ్ మంచి పేరు తెచ్చుకుంది. 
3. మోటో జెడ్‌2 ప్లే: అప్ అప్‌గ్రేడ్ (Moto Z2 Play: Up Upgrade)
మోటో జెడ్‌2లో వైఫ్‌తో ఉన్న వీడియో చూస్తుంటాడు ఓ వ్య‌క్తి. అత‌ని భార్య వ‌చ్చి ప‌ల‌క‌రిస్తే ఫోజ్ కొడ‌తాడు.  వైఫ్ వెళ్లి కొత్త మోటో జెడ్‌2 ప్లే ఫోన్ తీసుకొచ్చి అందులో ఉన్న ప్రొజెక్ట‌ర్ ద్వారా అదే వీడియోను పెద్ద‌గా లివింగ్ రూమ్ వాల్‌మీద వేసి అత‌ణ్ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంది.  అప్ అప్‌గ్రేడ్ అనే క్యాప్ష‌న్‌తో వ‌చ్చిన ఈ  అర నిముషం యాడ్ సింప్లీ సూప‌ర్బ్.
4.  యాపిల్ ఐఫోన్ 7 ప్ల‌స్‌: ద సిటీ (Apple iPhone 7 Plus: The City)
యాపిల్‌.. త‌న ఐఫోన్ 7 ప్ల‌స్ కెమెరాలో ఉన్న కెమెరా ష‌ట్ట‌ర్స్‌, పోర్ట్ర‌యిట్ మోడ్ గురించి వివ‌రించే యాడ్ ఇది. ఒక ప్రేమ జంట ఔటింగ్‌లో రక‌ర‌కాల మూమెంట్స్‌ను ఫొటోలు తీసుకుంటున్న తీరును చూపిస్తూ ఐఫోన్ 7 ప్ల‌స్ కెమెరా గురించి స‌బ్‌టైటిల్స్‌తో రొమాంటిక్ మ్యూజిక్‌తో యాడ్ క్రియేట్ చేసి శ‌భాష్ అనిపించుకున్నారు. 
5. గూగుల్ పిక్సెల్‌2 : ఏ డే అవుట్ విత్ ద లాడ్స్ (Google Pixel 2: A Day Out With The Lads)
గూగుల్ పిక్సెల్ 2 ఫోన్ యాడ్ ఇది. ముఖ్యంగా  అందులో ఉన్న గూగుల్ వాయిస్ అసిస్టెంట్ గురించి, ఫోన్ క్వాలిటీ గురించి చెప్పే ఈ  మూడు నిముషాల యాడ్ క్రికెట్ ల‌వ‌ర్స్ అంద‌ర్నీ క‌ట్టి ప‌డేస్తుంది. అండ‌ర్ 19 కోచ్‌గా ఉన్న లెజండ్ క్రికెట‌ర్ రాహుల్ ద్ర‌విడ్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్, మ‌యాంక్ అగ‌ర్వాల్ త‌దిత‌ర క్రికెట‌ర్లు  కోచింగ్ ఎగ్గొట్టి అవుటింగ్‌కు తీసుకెళ్ల‌డానికి అత‌ని కార్ కీస్ దాచేస్తారు. దారిలో జ‌రిగే ఫ‌న్నీ సీన్స్ అన్నింటితో ఈ యాడ్ గూగుల్ పిక్సెల్ 2 ఫోన్‌మీద ఆస‌క్తి పుట్టిస్తుంది. 

విజ్ఞానం బార్ విశేషాలు