• తాజా వార్తలు
  •  

ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌లో ఫేస్ ఐ.డి.కాక కొత్త‌గా ఏమున్నాయి? 

ప్రపంచ ప్ర‌ఖ్యాత ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం యాపిల్ కంపెనీ.. త‌న‌కు  అతిపెద్ద ఎసెట్ అయిన ఐ ఫోన్‌లో మ‌రో  మూడు కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేసింది.  సెప్టెంబ‌ర్ ఈవెంట్‌లో భాగంగా iPhone 8,  iPhone 8 Plusల‌ను యాపిల్ నిన్న రిలీజ్ చేసింది. దీంతోపాటు  తొలి ఐ ఫోన్ రిలీజై ప‌దేళ్లు పూర్తయిన అకేష‌న్‌ను పుర‌స్క‌రించుకుని  iPhone Xను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్న‌ట్లు అనౌన్స్ చేసింది.  యాపిల్ సీఈవో  టిమ్‌ కుక్ మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈవెంట్లో వీటిని ప్ర‌ద‌ర్శించారు.  
ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ 
ఐ ఫోన్ రెగ్యుల‌ర్ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్ మోడ‌ల్స్‌ను యాపిల్ రిలీజ్ చేసింది. సిల్వర్‌, గ్రే, రోజ్‌గోల్డ్  క‌ల‌ర్స్‌లో దొరుకుతుంది.  యాపిల్ ధ‌ర‌లో స‌గం కూడా లేని షియోమి, వ‌న్‌ప్ల‌స్ బోలెడు ఫీచ‌ర్ల‌తో ఫోన్లు తెస్తున్నాయి. శాంసంగ్ కూడా స్తుండ‌డంతో ఈసారి యాపిల్ కూడా వీటిపై దృష్టి పెట్టింది.  కెమెరా, డిజైన్ ఇంప్రూవ్‌మెంట్‌తోపాటు హార్డ్‌వేర్‌లోనూ మార్పులు చేసింది  
డిజైన్ ఇంప్రూవ్‌మెంట్ 
ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్ల‌స్‌ల‌ను డిజైన్‌ప‌రంగా కూడా డెవ‌ల‌ప్ చేశారు. రెండు మోడ‌ల్స్‌ను గ్లాస్‌, మెట‌ల్ బాడీతో త‌యారుచేశారు.   ఫ్రంట్‌, బ్యాక్ కూడా గ్లాస్ ఫ్రేమ్ ఉండ‌డంతో  ఫామ్ ఫ్యాక్ట‌ర్ డిజైన్‌తోనే వ‌చ్చినా  లుక్ బాగుంది.  సిల్వ‌ర్, స్పేస్ గ్రే, గోల్డ్ ఫినిష్ వంటి కొత్త క‌ల‌ర్ ఆప్ష‌న్స్ తీసుకొచ్చారు. 25% ఎక్కువ‌గా సౌండ్‌నిచ్చే స్పీక‌ర్స్ అమ‌ర్చారు. Qi  వైర్‌లెస్ ఇండ‌క్టివ్ ఛార్జింగ్ ఫీచ‌ర్ ను కొన‌సాగించారు. 
హార్డ్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ 
ఐఫోన్ 8, 8 ప్ల‌స్ మోడ‌ల్స్ రెండింటినీ A11 Bionic SoC hexa-core processorsతో తీర్చిదిద్దారు.  ఐఫోన్ 7, 7 ప్ల‌స్‌ల్లో ప్రాసెస‌ర్ క్వాడ్‌కోర్ మాత్ర‌మే. ఐఫోన్ 7తో కంపేర్ చేస్తే జీపీయూ కూడా 30% ఎక్కువ ఎఫిషియ‌న్సీతో ప‌ని చేస్తుంది.  వీటివ‌ల్ల వీడియో ఎన్‌కోడింగ్ లాంటి టాస్క్‌ల‌ను మ‌రింత ఫాస్ట్‌గా చేసుకోవ‌చ్చు.  

కెమెరా క్వాలిటీ పెంచారు 
ఐ ఫోన్‌లో కెమెరా ఎంత క్వాలిటీగా ఉన్నా మెగాపిక్సెల్స్ మాత్రం పెద్ద‌గా ఉండ‌వు. ఐ ఫోన్ 7 నుంచి ఈ ట్రెండ్‌ను యాపిల్ మార్చేసింది.  యూజ‌ర్ల ఫీలింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా యాపిల్ కెమెరా మీద కూడా బాగానే కాన్‌స‌న్‌ట్రేట్ చేసింది.  ఐఫోన్ 8లో 12 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ (రియ‌ర్‌) కెమెరాను పెట్టింది.  ఐఫోన్ 8 ప్ల‌స్‌లో 12 మెగాపిక్సెల్ డ్యూయ‌ల్ కెమెరాలు ఇవ్వ‌డం మ‌రో విశేషం.  ఈ కెమెరాల‌తో వీడియోల‌ను  సెక‌నుకు 240 ఫ్రేమ్స్ చొప్పున  1080 పిక్సెల్స్  వీడియో తీసుకోవ‌చ్చ‌ని యాపిల్ ప్ర‌క‌టించింది. ఐఫోన్ 8 ప్ల‌స్‌లో పోట్రెయిట్ మోడ్‌, పోట్రెయిట్ లైటింగ్ వంటి ఫీచ‌ర్లు తీసుకొచ్చింది.
 ఫ్రంట్ కెమెరా ఐఫోన్ 7లో ఉన్న‌ట్లే 7 మెగాపిక్సెల్ ఉంది. 
ఐఫోన్ 8,  8ప్ల‌స్  మోడ‌ల్స్‌ను  64జీబీ, 256 జీబీ ఇంట‌ర్న‌ల్  స్టోరేజ్‌ల‌తో  రెండు వేరియంట్లుగా రిలీజ్ చేయ‌బోతున్నారు.  ఐఫోన్ 8 64 జీబీ వేరియంట్ ధ‌ర 64వేల రూపాయ‌లు.   256 జీబీ వేరియంట్ ప్రైస్ 77వేలు. ఐఫోన్ 8 ప్ల‌స్ 64 జీబీ వేరియంట్ 73,000.. 256 జీబీ ధ‌ర 86వేలు.   ప్రీ బుకింగ్ చేసుకోవ‌చ్చు. సెప్టెంబ‌ర్ 29న ఇండియాలో రిలీజ్ చేస్తారు.   
 

విజ్ఞానం బార్ విశేషాలు