• తాజా వార్తలు

వ‌న్‌ప్ల‌స్ 5 తో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌లేక‌పోవ‌డానికి కారణం ఏమిటి ?


వ‌న్‌ప్ల‌స్ లో ఇప్ప‌టివ‌రకు వ‌చ్చిన ఫోన్ల‌తో కంపేర్ చేస్తే వ‌న్‌ప్లస్‌5  యూజ‌ర్ల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.  భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఆ  స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీనికితోడు ఒక‌టి రెండు టెక్నిక‌ల్ ఇష్యూస్ కూడా వ‌చ్చాయి. జెల్లీ స్క్రోలింగ్ ఎఫెక్ట్‌పై మొద‌ట్లోనే కొంత మంది యూజ‌ర్లు కంప్ల‌యింట్ చేశారు. ఇప్పుడు మ‌రో ప్రాబ్ల‌మ్‌. ఈసారి ఇది కాస్త పెద్ద‌దే. అమెరికాలో ఎమ‌ర్జన్సీ నెంబ‌ర్ అయిన 911 కు వ‌న్‌ప్ల‌స్ 5 నుంచి కాల్ చేస్తే కాల్ పోవ‌డం లేదు. అంతేకాదు ఆ త‌ర్వాత కొద్ది సెక‌న్ల‌కే ఫోన్ రీబూట్ అవుతోంది.   బ్రిట‌న్ లో అత్య‌వ‌స‌ర నెంబ‌ర్ 999కు ఫోన్ చేసినా ఇదే ప‌రిస్థితి.  మిగిలిన దేశాల్లో ఇలాంటి కంప్ల‌యింట్స్ రాలేదు.
ఇది సాఫ్ట్‌వేర్‌లో బగ్ వ‌ల్ల వ‌చ్చి ఉండొచ్చ‌ని వ‌న్‌ప్ల‌స్  అంచనా వేస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు పెద్ద సంఖ్య‌లో యూజ‌ర్లు దీని మీద కంప్ల‌యింట్ చేయ‌లేదని తెలుస్తోంది. దీనికి ఓ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వ‌స్తే స‌రిపోతుంద‌ని ఎక్స్‌ప‌ర్ట్‌లు చెబుతున్నారు.  ఈ క్రిటికల్ బ‌గ్‌ను క్లియ‌ర్ చేయ‌డానికి కంపెనీ త్వ‌రలోనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్  ఇచ్చే అవ‌కాశం ఉంది.  స్టాక్ డ‌య‌ల‌ర్ యాప్‌లో నుంచి కాకుండా గూగుల్ డయ‌ల‌ర్ నుంచి ఈ ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్లు డ‌య‌ల్ చేస్తే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని కొంత మంది ఎక్స్‌ప‌ర్ట్‌లు చెబుతున్నారు. 
అప్‌డేట్ ఇస్తున్నామ‌న్న వ‌న్‌ప్ల‌స్ 
దీన్ని క్లియ‌ర్ చేయ‌డానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇవ్వ‌డం ప్రారంభించామ‌ని వ‌న్‌ప్ల‌స్ అనౌన్స్ చేసింది. త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పింది. ఒక‌వేళ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నోటిఫికేష‌న్ రాక‌పోతే Settings > System Updates లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు