• తాజా వార్తలు

రివ్యూ - వైర్డ్ ఛార్జింగ్ వ‌ర్సెస్ వైర్‌లైస్ ఛార్జింగ్‌

ఐఫోన్ 8, 8 ప్ల‌స్ టెన్‌, లాంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ల స్పెసిఫికేష‌న్ల‌లో క‌చ్చితంగా వినిపించేది వైర్‌లైస్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌. దీనికోసం ఒక‌ డాక్ ఒక‌టి ఉంటుంది. ఇది ఫ్ల‌గ్‌కు క‌నెక్ట్ చేసి ఫోన్‌ను దానిమీద పెడితే చాలు బ్యాట‌రీ ఛార్జ్ అవుతుంది.  అయితే సాధార‌ణంగా వైర్‌తో చేసే ఛార్జింగ్‌తో పోల్చితే వైర్‌లైస్ మోడ్‌లో  ఛార్జింగ్ స్లోగా అవుతుంద‌నే వాద‌న ఉంది. అస‌లు ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్? 

ఫాస్ట్ ఛార్జింగ్ త‌ప్ప‌నిస‌రి
వైర్‌లైస్ ఛార్జింగ్‌, వైర్డ్ ఛార్జింగ్ ఇందులో ఏది స్పీడ్‌గా అవుతుందంటే అది డైరెక్ట్‌గా ఆన్స‌ర్ చేయ‌లేని ప్ర‌శ్నే. ఎందుకంటే ఫీచ‌ర్ ఫోన్లు ఉన్న‌ప్పుడు 800 ఎంఏహెచ్ లోపులోనే బ్యాటరీలు ఉండేవి. స్మార్ట్‌ఫోన్లు రావ‌డం, ర్యామ్‌, కెమెరా పిక్సెల్స్‌, డిస్‌ప్లే సైజ్‌, డెప్త్ ఇవ‌న్నీ పెరుగుతుండ‌డంతోబ్యాట‌రీ వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. అందుకే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌కు 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ అనేది కామ‌న్ అయిపోయింది. అయితే ఇంత బ్యాట‌రీ ఉన్నా పాత నోకియా ఫోన్ల‌లా రోజుల త‌ర‌బ‌డి బ్యాక‌ప్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అందుకే ఛార్జింగ్ కూడా ఫాస్ట్‌గా అయ్యే ఆప్ష‌న్ల‌ను కంపెనీలు తీసుకొస్తున్నాయి. 
ఫీచ‌ర్‌ను బ‌ట్టి ఛార్జింగ్ నాలుగు ర‌కాలు 
వైర్డ్ ఛార్జింగ్‌:  సెల్‌ఫోన్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్న ఛార్జింగ్ మోడ్ ఇది.   
ఫాస్ట్‌/  ర్యాపిడ్ / క‌్విక్‌/ ట‌ర్బో ఛార్జింగ్‌:  పేరు ఏదైనా గానీ రెగ్యుల‌ర్ వైర్డ్ ఛార్జ‌ర్ కంటే స్పీడ్‌గా ఛార్జింగ్ కావ‌డ‌మే దీని ల‌క్ష‌ణం. 3,000 ఎంఏహెచ్ పైన బ్యాట‌రీతో వ‌చ్చే ప్ర‌తి సెల్‌ఫోన్ ఇప్పుడు వీటిలో ఏదో ఒక టెక్నాల‌జీతో కూడిన ఛార్జ‌ర్‌ను ఇస్తుంది. 
వైర్‌లైస్ ఛార్జింగ్‌:  స్టాండ‌ర్డ్ ఛార్జింగ్ స్పీడ్ లో ఉంటుంది. కానీ వైర్‌లైస్.
ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌: ఇది వైర్‌లైస్ మోడ్‌లోనే ఫాస్ట్‌గా ఛార్జింగ్ అయ్యేది. బాగా కాస్ట్‌లీ ఫోన్ల‌లోనే ఉంటుంది.  
వైర్డ్ ఛార్జ‌రే బెట‌ర్ 
ఫాస్ట్ , ర్యాపిడ్‌, క్విక్ ఇలా ఏవైర్డ్ ఛార్జ‌ర్‌ను తీసుకున్నా వైర్‌లైస్ ఛార్జ‌ర్ల కంటే స్పీడ్‌గా ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంది. నేరుగా వైర్ కాంటాక్ట్ ఉండ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అయితే ముందే చెప్పిన‌ట్లు మీ ఫోన్‌, ఛార్జ‌ర్ కాంబినేష‌న్‌ను బ‌ట్టి ఫోన్ ఎంత స్పీడ్‌గా ఛార్జ్ అవుతుందనేది ఆధార‌ప‌డి ఉంటుంది. అంతే తప్ప వైర్‌లెస్‌, వైర్డ్ అనేది ముఖ్యం కాదంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. అయితే ఫాస్ట్ వైర్‌లైస్ ఛార్జ‌ర్లు స్పీడ్‌గా హీటెక్కుతాయి. దీన్ని చ‌ల్లార్చ‌డానికి ఇందులో ఉండే ఫ్యాన్లు ప‌ని చేస్తాయి కాబ‌ట్టి ఈ ఛార్జ‌ర్లు కొద్దిగా సౌండ్ చేస్తాయి. అందుకే నిపుణులు చెప్పేదేమిటంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీ ప‌ని చేసే వైర్డ్ ఛార్జ‌రే బెట‌ర్‌. 

జన రంజకమైన వార్తలు