• తాజా వార్తలు
  •  

ఈ రోజు రిలీజ్ అవుతున్న జియోమి ఎంఐఏ1 రివ్యూ ముందుగా మీ కోసం..

రోజుకో ఫోన్ బ‌రిలో దిగుతున్న రోజులివి. ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆకర్షించ‌డంలో ముందుంటున్నాయి. అలాంటి కోవ‌కు చెందిందే జియోమి ఎంఐ ఏ1. జియోమి సిరీస్‌లో వ‌స్తున్న మ‌రో సూప‌ర్ ఫోన్ ఇది.  ఎంఐ సిరీస్‌తో ఇప్ప‌టికే యూజ‌ర్ల‌లో త‌న‌దైన ముద్ర వేసిన జియోమి... ఇప్పుడు అదే మోడ‌ల్‌లో కొత్త వెర్ష‌న్‌ను తెర మీద‌కు తీసుకొచ్చింది. విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ జియోమి ఎంఐ ఏ1 మోడ‌ల్‌లో ఉన్న ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..

గూగుల్ ఆండ్రాయిడ్ వ‌న్‌తో..
గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఇనిషియేటివ్‌తో భార‌త్‌లో వ‌స్తున్న తొలి డ్యుయ‌ల్ కెమెరా డివైజ్ ఇది.  ఈ డివైజ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ చేస్తామ‌ని గూగుల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను కొత్త పంథాలోకి తీసుకెళ్ల‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని కూడా ఆ సంస్థ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో విడుద‌ల కాబోతున్న  జియోమి ఫోన్ మీదే అంద‌రి దృష్టి నిలిచింది. దీనిలో జియోమికి సొంత‌మైన ఎంఐయూఐ 8 ఇంట‌ర్‌ఫేస్ ఉప‌యోగించారు.5.5 అంగుళాల 2.5డీ డిస్‌ప్లేతో దీని లుక్ అదిరిపోయింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ దీనికున్న మ‌రో ప్ర‌త్యేక‌త‌. క‌ర్వ‌డ్ మెటల్ ఫ్రేమ్‌తో చూడ‌గానే ఆక‌ట్టుకోవ‌డం దీని స్పెషాలిటీ. కుడి చేతి వైపు మెటల్ వాల్యుమ్ రాక‌ర్‌, ప‌వ‌ర్ బ‌ట‌న్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ కార్డ్ ట్రే ఏర్పాటు చేశారు. యూఎస్‌బీ సి పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ డివైజ్‌లో ఉన్నాయి. 

కెమెరా అదుర్స్‌
ఆండ్రాయిడ్ వ‌న్ ఫ్లాట్‌ఫాం సాయంతో వ‌చ్చిన డ్యుయ‌ర్ కెమెరా ఈ ఫోన్‌లో అన్నిటిక‌న్న ప్ర‌త్యేకం. ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉన్న ఈ 12 మెగా పిక్స‌ల్ డ్యుయ‌ల్ కెమెరాతో పిక్చ‌ర్లు మ‌రింత క్వాలిటీగా వ‌స్తాయి.  ఈ విష‌యంలో వ‌న్‌ప్ల‌స్ 5కు ఇది ఏమాత్రం త‌గ్గ‌దు. ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ మ‌రో అద‌న‌పు ఆప్ష‌న్‌. ఆకారంలో కాస్త రెడ్‌మి నోట్ 4ను పోలి ఉండే ఎంఐ ఏ1... ప‌నితీరు విష‌యంలో మాత్రం అగ్ర‌శ్రేణి ఫోన్ల‌కు ఏమాత్రం త‌గ్గ‌దు. సాధార‌ణంగా ఆండ్రాయిడ్ కెమెరా యాప్‌లు డ్యుయ‌ల్ కెమెరాకు స‌పోర్ట్ చేయ‌వు. కానీ ఎంఐ కెమెరా ఈ విష‌యంలో మార్కులు కొట్టేసింది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌తో పాటు 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఈ ఫోన్‌ను ప్ర‌త్యేకంగా నిల‌బెడుతున్నాయి. దీని ధ‌ర రూ.15,999

విజ్ఞానం బార్ విశేషాలు