• తాజా వార్తలు

 రివ్యూ - జంబో డిస్‌ప్లేతో జియోమి ఎంఐ మిక్స్ 2

 2016లో జియోమి కంపెనీ త‌న కొత్త  మోడ‌ల్  ఎంఐ మిక్స్‌తో పెద్ద దుమార‌మే రేపింది. స్మార్ట్‌ఫోన్ల‌లో కాన్స‌ప్ట్ ఫోన్ అనే పేరు కూడా వ‌చ్చింది ఆ ఫోన్‌కు. అయితే ఆ త‌ర్వాత  ఆరంభంలో ఉన్న‌జోరును ఈ మోడ‌ల్ చూపించ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత మిగిలిన ఫోన్ల తాకిడిని త‌ట్టుకోలేక వెన‌క‌బ‌డిపోయింది ఈ ఫోన్‌. అయితే విరామం త‌ర్వాత గ‌తంలో కంటే మంచి ఫీచ‌ర్ల‌తో మ‌రోసారి మార్కెట్లోకి వ‌చ్చేసింది. అదే ఎంఐ మిక్స్ 2. మ‌రి గ‌తంలో కంటే మంచి ఫీచ‌ర్ల‌తో రంగంలోకి దిగిన ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు ఏంటో చూద్దామా.. 

6.4 అంగుళాల డిస్‌ప్లేతో..
ఎంఐ మిక్స్ 2లో అన్నిటికంటే ఆక‌ర్షించేది దీనిజంబోడిస్‌ప్లేనే. సాధార‌ణంగా ప్ర‌స్తుతం వ‌స్తున్న ఏ స్మార్ట్‌ఫోన్ అయినా 5.5 అంగుళాల‌కు మించి ఉండ‌ట్లేదు. చివ‌రికి ఐ ఫోన్లు కూడా 5.9 దాటి ముందుకు వెళ్ల‌ట్లేదు. అలాంటిది ఎంఐ మిక్స్ 2 మాత్రం ఏకంగా 6.4 అంగుళాల డిస్‌ప్లేతో సంచ‌న‌లం సృష్టిస్తోంది. ఇంత పెద్ద డిస్‌ప్లే ఉన్న తొలి ఫోన్ ఇదే.  లైట్ వెయిట్‌, అద్భుత‌మై డిజైన్‌తో అదిరిపోతోంది. కెమెరా విష‌యంలోనూ ఎంఐ మిక్స్ 2 ముందంజ‌లోనే ఉంది.  దీని వెనుక భాగం సిరామిక్‌తో మ‌ధ్య‌లో ఫ్రేమ్ అల్య‌మినియంతో త‌యారు అయింది. దీని ఫ్రేమ్ చుట్టూ ఉన్న బంగారు వర్ణం ఈ ఫోన్‌కు మ‌రింత  అందాన్ని తీసుకొచ్చింది.  స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌తో పాటు 6 జీబీ ర్యామ్ సామ‌ర్థ్యం ఈ ఫోన్ సొంతం . ఇదే కాక 128 జీబీ రోమ్ దీనిలో ఉంది.   

3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ..
బ్యాట‌రీ విష‌యంలోనూ జియోమి ఎంఐ మిక్స్ 2 మెరుగ్గానే ఉంది. దీన్ని 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీతో త‌యారు చేశారు.  క్వాల్‌కామ్ క్విక్ ఛార్జ్‌తో పాటు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి. ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ 802, వైఫై ఆప్ష‌న్లు ఉన్నాయి. ట్రావెల‌ర్స్ కోసం  ఇది మంచి ఫోన్‌.  ఫ్రంట్ కెమెరా 5 మెగా పిక్స‌ల్ ఉన్న ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 7.1.1  ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ దీన్ని ఉప‌యోగించారు.  దీని ధ‌ర రూ.36 వేలు.                                                                                                                                                                                                        

జన రంజకమైన వార్తలు