• తాజా వార్తలు

రివ్యూ - షియోమి ఎంఐ టీవీ 4..టీవీ మార్కెట్లో విధ్వంసక ఆవిష్కరణ కానుందా ?

షియోమి మ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఫోన్ త‌యారీ సంస్థే అని మ‌న‌కు తెలుసు. కానీ ఇది మ‌రో కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా త‌మ‌కు రోజు రోజుకు బ‌లం పెరుగుతున్న భార‌త మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ స్మార్ట్‌టీవీల‌ను రంగంలోకి దింప‌నుంది. వాటి పేరే షియోమి ఎంఐ టీవీ4. భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చాలా స్మార్ట్‌టీవీలు మార్కెట్లో ఉన్నాయి అయితే షియోమి విడుద‌ల చేసి ఎంఐటీవీ 4 మాత్రం స‌రికొత్త‌గా వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు సిద్ధ‌మైంది. సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని నిపుణులు చెబుతున్న ఆ టీవీ విశేషాలేంటో చూద్దామా...

ఐఫోన్ 7 క‌న్నా స‌న్న‌గా..
ప్ర‌స్తుతం వ‌స్తున్న ఫోన్ల‌లో స్లిమ్‌గా ఉండే ఫోన్ ఏదంటే ఐఫోనే మ‌న‌కు గుర్తుస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ లేటెస్ట్ మోడ‌ల్ మ‌న‌కు చాలా స్లిమ్‌గా క‌నిపిస్తుంది. అయితే ఐఫోన్ 7 మోడ‌ల్‌కు మించిన స‌న్న‌గా వ‌స్తుంతో షియోమి ఎంఐ టీవీ 4. అంటే దీని వెడ‌ల్పు జ‌స్ట్ 4.9 మిల్లీ మీట‌ర్లే!! విన‌డానికి చాలా విచిత్రంగా ఉన్నాఇది నిజం. ఇంత స‌న్న‌గా ఉండ‌డం వ‌ల్లే ప్ర‌స్తుత మార్కెట్లో ఇదో సంచ‌ల‌నం అవుతుంద‌ని నిపుణులు అంటున్నారు. శాంసంగ్‌, సోని, ఎల్జీ లాంటి దిగ్గ‌జ టీవీల‌కు దీటుగా వినియోగ‌దారుల‌ను ఇట్టే ఆక‌ర్షించేటట్టు ఉంటుందంట ఈ షియోమి టీవీ. 

రూ.39,999 ధ‌ర‌తో..
మిగిలిన స్మార్ట్‌టీవీల‌తో పోల్చుకుంటే షియోమి ఎంఐ టీవీ 4 ధ‌ర కూడా రీజ‌న‌బుల్‌గానే ఉంది. ఈ 4కే ఆల్ర్టా హెడ్‌డీ టీవీ ధ‌ర‌ను రూ.39,999గా నిర్ణ‌యించింది షియోమి. దీంతో శాంసంగ్, ఎల్జీ, సోనిల‌కు గ‌ట్టిపోటీ ఇవ్వాల‌నేది ఈ సంస్థ లక్ష్యం. సోని, శాంసంగ్ మాదిరిగానే దీని పొడ‌వు 55 అంగుళాలు ఉంటుంది.   ఇంత స్లిమ్ ఉండడం వ‌ల్ల రూమ్‌లో ఇది ఎక్క‌డైనా అమ‌రిపోతుంది. బ‌రువు ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల ఎక్క‌డికైనా తీసుకెళ్ల‌డం చాలా సుల‌భం. ఇంతేకాదు ధ‌ర విష‌యంలోనూ భారత మార్కెట్లో స‌ర‌ళంగా ఉండాల‌నేది ఆ సంస్థ వ్యూహం.  2జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌, 8 జీబీ ఫ్లాష్ స్టోరేజ్‌తో పాటు డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్‌, 8 వాట్స్ స్పీక‌ర్స్ లాంటి ఎన్నో ఆప్ష‌న్లు ఈ టీవీలో ఉన్నాయి.  అయితే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లాంటివి ప‌ని చేయ‌క‌పోవ‌డం లాంటి కొన్ని మైన‌స్ పాయింట్లు కూడా ఈ టీవీకి ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు