• తాజా వార్తలు

షియోమి రెడ్‌మి 4, షియోమి రెడ్‌మి 4 ఏ రెండింట్లో ఏదీ మీ ఛాయిస్‌?

భారత్‌లో క‌స్ట‌మ‌ర్ల నాడిని క‌నిపెట్టి వారి అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్టు ఫోన్ల‌ను త‌యారు చేస్తూ త‌క్కువ కాలంలో గుర్తింపు పొందింది షియోమి. ఈ చైనా ఫోన్ల త‌యారీ సంస్థ భార‌త్‌లో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వినియోగ‌దారులే ల‌క్ష్యంగా చేసుకుంది. అందుకే 2014లో ఎంఐ3 మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టి మంచి ఫ‌లితాలు సాధించింది. ముఖ్యంగా షియోమి త‌యారు చేసే బ‌డ్జెట్ ఫోన్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఆ కోవ‌కు చెందిన ఫోన్ల‌నే ఇటీవ‌ల షియోమి విడుద‌ల చేసింది అవే రెడ్ మి4, రెడ్‌మి 4ఏ. ఈ రెండు మోడ‌ల్స్ మంచి ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్ట‌కునేలా త‌యార‌య్యాయి. మ‌రి ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల‌లో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాల్సి వ‌స్తే ఏది మెరుగైంది? ఏ ఫోన్ తీసుకుంటే మంచిది? ఒక‌సారి ఈ రెండు బ‌డ్జెట్ ఫోన్లను పోల్చి చూస్తేనే ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంది.

ధ‌ర దాదాపు స‌మాన‌మే..
షియోమి నెల‌ల వ్య‌వ‌ధిలో ప్ర‌వేశ‌పెట్టిన రెడ్‌మీ 4 ,రెడ్ మీ 4 ఏ మోడ‌ల్స్ ధ‌ర దాదాపు స‌మాన‌మే. ఈ ఏడాది మార్చిలో మార్కెట్లోకి వ‌చ్చిన రెడ్‌మీ 4ఏ ధ‌ర రూ.5999 కాగా.. రెడ్ మీ 4 ధ‌ర మాత్రం రూ.6,999గా ఉంది. ఐతే స్పెసిఫికేష‌న్ల విష‌యంలో మాత్రం ఈ రెండింటికి కొంచెం వ్య‌త్యాసం ఉంది. రూపంతో పాటు గుణాల్లోనూ కాస్త తేడా ఉంది. కానీ వేయి రూపాయిల తేడాతో ఈ రెండు ల‌భ్యం అవుతుండ‌డం వినియోగ‌దారుల‌కు క‌లిసొచ్చే అంశం. ముఖ్యంగా డిజైన్, డిస్‌ప్లే విష‌యంలో ఈ రెండింటికి సారూప్య‌త ఉంది. రెడ్ మీ 4 మెటల్‌తో త‌యారు చేశారు. రెడ్‌మీ 4 ఏ కూడా దాదాపు మెట‌ల్ డిజైన్‌తోనే ఉంటుంది. డిస్‌ప్లే విష‌యానికి వ‌స్తే ఈ రెండు 5 అంగుళాల తెర‌తో త‌యారు అయిన‌వే. ఐతే రెడ్మీ 4 మాత్రం పై భాగంలో 2.5డీ క‌ర్వ‌డ్ గ్లాస్‌తో తయారైంది. రెడ్‌మీ 4 ఏలో ఈ స‌దుపాయం లేదు. ఓవ‌రాల్‌గా డిజైన్ విష‌యంలో రెడ్‌మీ 4, రెడ్‌మీ 4 ఏ క‌న్నా ఉన్న‌తంగా క‌నిసిస్తుంది. మ‌న ఈ రెండింటిని చేతుల్లోకి తీసుకుంటే రెడ్ 4 ఎక్కువ మార్కులు స్కోరు చేస్తుంది.

హార్డ్‌వేర్ భిన్నంగా
హార్డ్‌వేర్ విష‌యంలోనూ ఈ రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంది. రెడ్‌మీ 4 మోడ‌ల్‌ను ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 435చిప్ టెక్నాల‌జీతో త‌యారు చేస్తే.. రెడ్‌మీ 4 ఏ మోడ‌ల్‌ను క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 టెక్నాల‌జీతో రూపొందించారు. రెడ్‌మీ 4లో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంటే..రెడ్‌మీ 4ఏలోనూ ఇదే ఫీచ‌ర్లు ఉన్నాయి. రెడ్‌మీ 4లో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ రెండు ఫోన్ల‌కు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ని పెంచుకునే అవ‌కాశం ఉంది. హార్డ్‌వేర్ విష‌యంలో రెడ్‌మీ 4, రెడ్‌మీ 4ఏ క‌న్నా క‌చ్చితంగా మెరుగైందే. కెమెరా విష‌యానికొస్తే రెండింట్లో 13 ఎంపీ రేర్‌, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. సాఫ్ట్‌వేర్ విష‌యంలో రెడ్‌మీ 4, రెడ్‌మీ 4ఏ రెండింట్లో మార్ష్‌మెల్లో ఎంఐయూఐ 8 టెక్నాల‌జీ ఉప‌యోగించారు. రెడ్‌మీ 4లో 4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంటే.. 4ఏ మోడ‌ల్‌లో 3120 ఏంఏహెచ్ ఉంది. ప్రిమియం డిజైన్‌, మంచి బ్యాట‌రీ, స‌మ‌ర్థ‌మైన ప్రొసెస‌ర్ రెడ్‌మీ 4ను ఎంచుకోవ‌డం మేలు. బ‌డ్జెట్ ఆలోచిస్తే మాత్రం రెడ్‌మీ 4ఏ మీకు సూట్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు