• తాజా వార్తలు
  •  

రివ్యూ - జియోమి రెడ్ మి 5ఏ పై ఫస్ట్ ఇంప్రెషన్స్

జియోమి రెడ్ మి సిరీస్‌.. భార‌త్‌లో ఈ ఫోన్ సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా క‌దా. మ‌న దేశంలోనే ఎక్కువ అమ్ముడు పోయిన ఫోన్ల‌లో రెడ్‌మి కూడా ఒక‌టిగా నిలిచిందంటేనే వినియోగ‌దారులను ఈ ఫోన్ ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు.  ఇప్పుడు రెడ్‌మి, రెడ్‌మి నోట్ ఇలా చాలా  మోడ‌ల్స్ క‌స్ట‌మ‌ర్ల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు అదే కోవ‌లోనే మ‌రో ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చింది. మంచి బ్యాట‌రీ, అంత‌కుమించిన ప్రాసెస‌ర్‌.. చూడ‌గానే ఆక‌ట్ట‌కుకునే లుక్ క‌ల‌గ‌లిసిన  రెడ్ మి 5ఏ మీదే ఇప్పుడు అంద‌రి దృష్టి ఉంది. మ‌రి ఏంటో దీని ప్ర‌త్యేక‌త‌లు చూద్దాం..

దేశ్ కా స్మార్ట్‌ఫోన్‌
దేశ్ కా స్మార్ట్‌ఫోన్ నినాదంతో రెడ్ మి దూసుకుపోతోంది. రెడ్‌మి 5 కొత్త ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి వ‌చ్చింది. రెడ్ మి 4ఏ ఫోన్‌లో లేని ఫీచ‌ర్లు దీనిలో ఉన్నాయి. 2జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ఇప్ప‌టికే మార్కెట్లో  త‌న ముద్ర వేసింది.  రెండు వేరియంట్స్‌లో వ‌చ్చిన ఈ ఫోన్ ధ‌ర రూ.4999, రూ.6999గా జియోమి నిర్ణ‌యించింది. రూ.6999 ఫోన్లో 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ ఉంది. 

సూప‌ర్ డిప్‌స్లే, బ్యాట‌రీ
జియోమి రెడ్‌మి 5ఏలో 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. బ్లూ లైట్‌ను బ్లాక్ చేసి రీడింగ్ మోడ్ చేసే ఒక ఫీచ‌ర్ కూడా ఈ ఫోన్ సొంతం. దీనిలో క్వాడ్‌కోర్ 425 స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ ఉప‌యోగించారు. దీంతో ఫోన్ వేగం కూడా అద్భుతంగా ఉంటుంది. 16 లేదా 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో పాటు  మైక్రోకార్డ్ ద్వారా అద‌నంగా కూడా మ‌నం మెమరీని పెంచుకోవ‌చ్చు. 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఈ ఫోన్ మ‌రింత ప్ర‌త్యేకంగా మారింది. వీడియో ప్లే బ్యాక్‌తో ఇది ఎనిమిది రోజుల 7 గంట‌ల పాటు ఈ ఫోన్ నిలుస్తుంద‌ని జియోమి చెబుతోంది.

కెమెరా అదుర్స్
జియోమి రెడ్‌మి 5ఏలో ఉన్న 13 మెగా పిక్సల్ ప్రైమ‌రీ కెమెరా దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. ఫొటోలు, వీడియోల క్వాలిటీ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. 5 మెగా పిక్స‌ల్ సెన్సార్‌తో పాటు స్మార్ట్‌, ప్రొ  బ్యూటిఫై కెమెరా మోడ్‌తో మీ ఫొటోలు మ‌రింత అందంగా క‌నిపిస్తాయి. 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, డ్యుయ‌ల్ సిమ్‌, బ్లూటూత్‌, జీపీఎస్ లాంటి ఆప్ష‌న్లు అద‌నంగా ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు