• తాజా వార్తలు

అన్ని టెల్కో లుఇస్తున్న రూ 349/- ల ప్లాన్ లపై ఒక రివ్యూ

భారత టెలికాం మార్కెట్ లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న సంగతి మనకు తెలిసినదే.  ఈ పోటీలో భాగంగా ఎలాగైనా భారత టెలికాం మార్కెట్ లో సింహభాగాన్ని ఆక్రమించుకోవాలి అనే ఉద్దేశంతో దేశం లో ఉన్న టెలికాం కంపెనీలన్నీ ఆకర్షణీయమైన ధరలలో తమ యొక్క ఆఫర్ లను మరియు ప్లాన్ లను ప్రకటించేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL, ఎయిర్ టెల్ మరియు జియో ఈ మూడూ కూడా రూ 349/- ల విలువతో ఆకర్షణీయమైన ప్లాన్ ను అందిస్తున్నాయి. ఈ మూడింటిలో ఏది ఉత్తమం? అనే విషయం పై ఒక విశ్లేషణ ఈ వ్యాసం

ఎయిర్ టెల్

రూ 349/- ల ప్లాన్ లో భాగంగా ఎయిర్ టెల్ తన యూజర్ లకు రోజుకి 2.5 GB డేటా ను అందిస్తుంది. దీనితో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, ఉచిత లోకల్ మరియు STD కాలింగ్, రోజుకి 100 SMS లు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

BSNL

BSNL తన రూ 349/- ప్లాన్ ను దిల్ ఖోల్ కే బోల్ గా నామకరణం చేసింది. ఎయిర్ టెల్ తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. దీని వ్యాలిడిటీ 54 రోజులు ఉంటుంది. రోజుకి 1 GB డాటా లభిస్తుంది. వీటితో పాటు అన్ లిమిటెడ్ లోకల్ మరియు STD కాలింగ్, రోజుకి 100 SMS లు ఉచితంగా లభిస్తాయి.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో యొక్క రూ 349/- ల ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 70 రోజులు ఉంటుంది.రోజుకి 1.5 GB డేటా లభిస్తుంది. దీనితో పాటు ఉచిత లోకల్ మరియు అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది. వివిధ రకాల జియో యాప్ లను ఉచితంగా సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు