• తాజా వార్తలు
  •  

40 GB కంటే ఎక్కువ డేటా ఇస్తున్న ప్లాన్ లలో ఏది బెస్ట్?

ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ లు ప్రీ పెయిడ్ విభాగం లోనే గాక పోస్ట్ పెయిడ్ లోనూ ధరల విషయం లో రిలయన్స్ జియో తో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. రోజుకి 1 GB కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్రీ పెయిడ్ ప్లాన్ లను రూ 500/- ల లోపే తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. పోస్ట్ పెయిడ్ విషయం లో కూడా వీటి మధ్య డేటా విభాగం లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యం లో 40 GB అంతకంటే ఎక్కువ డేటా ఇస్తున్న పోస్ట్ పెయిడ్ ప్లాన్ ల గురించి ఒక స వివర సమాచారాన్ని ఈ రోజు ఆర్టికల్ లో ఇస్తున్నాం.

ఎయిర్ టెల్

ఫిబ్రవరి లో తీసుకురాబడిన ఈ రూ 499/- ల ప్లాన్ లో 40 GB డేటా తో పాటు అన్ లిమిటెడ్ లోకల్, రోమింగ్ మరియు STD కాల్స్ లభిస్తాయి. మిగిలిపోయిన డేటా ను తర్వాతి నెలకు ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా ఇందులో ఉంది. వింక్ టీవీ. వింక్ మూవీస్ లకు ఫ్రీ యాక్సెస్ తో పాటు ఇన్ ఫినిటి పోస్ట్ పెయిడ్ ప్లాన్ తీసుకున్న వారికీ ఒక సంవత్సరం పాటు ఉచిత అమజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. రూ 499/- లు ఆ పై ఉన్న ప్లాన్ లు అన్నింటిలోనూ ఒక సంవత్సరం పాటు అమజాన్ ప్రైమ్ ఆప్షన్ లభిస్తుంది.

రూ 799/- ల ప్లాన్ లో నెలకు 60 GB డేటా లభిస్తుంది. దీనితో పాటు పైన చెప్పుకున్న బెనిఫిట్స్ అన్నీ లభిస్తాయి. రూ 1199/- ల ప్లాన్ లో నెలకు 90 GB డేటా లభిస్తుంది. మిగతావన్నీ పై మాదిరిగానే లభిస్తాయి. జియో లో మాదిరిగా ఎయిర్ టెల్ లో లభించే డేటా కు రోజువారీ లిమిట్ ఏదీ ఉండదు.

వోడాఫోన్

వోడాఫోన్ కూడా ఎయిర్ టెల్ మాదిరిగా రూ 499/- ల ప్లాన్ ను కలిగిఉంది. ఇందులో భాగంగా నెలకు 40 GB డేటా లభిస్తుంది. మిగిలి పోయిన డేటా ను క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా ఉంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోమింగ్,STD కామరియు లోకల్ కాల్స్ మరియు రోజుకి 100 SMS లభిస్తాయి.వోడాఫోన్ ప్లే యాప్ కు ఒక సంవత్సరం పాటు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. రూ 699/- ప్లాన్ తో నెలకు 50 GB డేటా అలాగే రూ 999/-వ ల ప్లాన్ తో నెలకు 75 GB డేటా లభిస్తాయి. మిగతా బెనిఫిట్స్ అన్నీ పై మాదిరిగానే ఉంటాయి. రూ 999/- ల ప్లాన్ లో అదనంగా నెట్ ఫ్లిక్స్ కు రెండు నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఇక రూ 1299/- ల ప్లాన్ విషయానికొస్తే ఇందులో నెలకు 100 GB డేటా లభిస్తుంది. ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకునే వారికీ ఎక్కువ డేటా అవసరం కాబట్టి వారికి ఈ ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో అదనంగా US, కెనడా,చైనా,సింగపూర్,థాయిలాండ్ మరియు మలేషియా లకు 100 ఇంటర్నేషనల్ మినిట్స్ ఉచితంగా లభిస్తాయి.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో యొక్క రూ 509/- ల ప్లాన్ లో నెలకు 60 GB డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ కోసం  రూ 600/- ల సెక్యూరిటీ డిపాజిట్ కట్టవలసి ఉంటుంది. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి. రోజుకి 2 GB డేటా లిమిట్ ఉంటుంది. రూ 799/- ల ప్లాన్ లో 90 GB డేటా లభిస్తుంది. రూ 950/- ల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. రోజువారీ FUP లిమిట్ 3 GB ఉంటుంది.రూ 999/- ల ప్లాన్ కోసం రూ 1150/- ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇందులో నెలకు 60 GB డేటా లభిస్తుంది. ఏ విధమైన FUP లిమిట్ ఉండదు. రూ 409/- లో కూడా FUP లేని డేటా వస్తుంది కానీ కేవలం 20 GB మాత్రమే లభిస్తుంది.