• తాజా వార్తలు
  •  

బ‌డ్జెట్ డ్యూయ‌ల్ కెమెరాల యుద్ధంలో గెలిచేదెవ‌రు? 

కెమెరా మెగాపిక్సెల్ ఒక‌ప్పుడు సెల్‌ఫోన్‌కు పెద్ద స్పెసిఫికేష‌న్‌, త‌ర్వాత ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వ‌చ్చింది.. ఇప్పుడు డ్యూయ‌ల్ కెమెరాల వంతు.. వీటిలోనూ మ‌ళ్లీ బ‌డ్జెట్ రేంజ్‌లో రావాలి. ఇదీ ప్ర‌స్తుతం సెల్‌ఫోన్ మార్కెట్లో న‌డుస్తున్న వార్‌.  దీనిలో పోటీప‌డుతున్న‌దెవ‌రు?  గెలిచేదెవ‌రు?  

ప్ర‌స్తుతం రియ‌ర్ సైడ్‌లో డ్యూయ‌ల్ కెమెరాలున్న ఫోన్ల‌కు మార్కెట్లో డిమాండ్ ఉంది. దీంతో కంపెనీలు ఈ ఫీచ‌ర్‌ను బ‌డ్జెట్ రేంజ్‌లోకి కూడా తీసుకొచ్చాయి. 15వేల రూపాయ‌ల్లో డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ఉన్న ఫోన్లు చాలా వ‌చ్చాయి.  వీటిలో ఫ్రంట్ కెమెరాలు, డిస్‌ప్లే, ర్యామ్‌, రామ్ కూడా బాగున్నాయి.

లెనోవో కే8 నోట్ 
లెనోవో నుండి బ‌డ్జెట్ రేంజ్‌లో వ‌చ్చిన తొలి డ్యూయ‌ల్ కెమెరా ఫోన్ ఇది. దీనికి సెల్ఫీ కోసం 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతోపాటు బ్యాక్‌సైడ్ 13 ఎంపీ, 5 ఎంపీ లెన్స్‌ల‌తో డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ఉంది. f1.2 aperture వ‌ర‌కు ఫొటోలు తీసుకోవ‌చ్చు. 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, డెకా కోర్ ప్రాసెస‌ర్‌, 3 /4 జీబీ ర్యామ్  32/ 64 జీబీ స్టోరేజ్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఆండ్రాయిడ్ 7.1 స్టాక్ వెర్ష‌న్ ఆండ్రాయిడ్ దీనిలో ఇత‌ర స్పెసిఫికేన్లు. ప్రైస్‌: 12,999నుంచి  

లెనోవో కే8 ప్ల‌స్  
దీనిలోనూ కెమెరా సెట‌ప్ సేమ్ కే 8 నోట్‌లానే ఉంటుంది. అయితే డిస్‌ప్లే, ర్యామ్ వంటి విష‌యాల్లో ఇది కొద్దిగా తక్కువ‌. 5.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టా కోర్ హీలియో పీ 25 ప్రాసెస‌ర్‌, 3  జీబీ ర్యామ్  32 జీబీ స్టోరేజ్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఆండ్రాయిడ్ 7.1 స్టాక్ వెర్ష‌న్ ఆండ్రాయిడ్ ఉన్నాయి. ప్రైస్‌: 10,999 

కూల్‌పాడ్ కూల్ 1  
కూల్‌పాడ్ కూల్ 1లో రియ‌ర్‌సైడ్ రెండు 13 ఎంపీ కెమెరాలున్నాయి.  f2.ఏ ఆప‌ర్చ్చూర్‌, పీడీఏఎఫ్‌, డ్యూయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ తో మంచి ఫొటోలు వ‌స్తాయి.  హువావే పీ9, హాన‌ర్ 8, ఎంఐ5 ఎస్‌ల్లో ఇదే సెట‌ప్ ఉన్నా వాటి ధ‌ర 13వేల వ‌ర‌కు ఉంది.  5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,  స్నాప్‌డ్రాగ‌న్‌ 652 ప్రాసెస‌ర్‌,  4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 4,060 ఎంఏహెచ్ బ్యాట‌రీ  ఉన్నాయి.
ప్రైస్‌: 8,999  
 షియోమి ఎంఐ ఏ1  
  దీనిలో రియ‌ర్‌సైడ్ రెండు 12 ఎంపీ కెమెరాలున్నాయి.  2 ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, పోట్ర‌యిట్ మోడ్ ఫీచ‌ర్లు ఇచ్చారు.  ఒక‌టి f2.2 ఆప‌ర్చ్చూర్‌తో వైడ్ యాంగిల్ ఫొటోల‌కు, మ‌రొక‌టి f2.6ఆప‌ర్చ్చూర్‌తో టెలిఫొటోస్ ఫీచ‌ర్‌తోనూ ఉన్నాయి.  5.5 ఇంచెస్ డిస్‌ప్లే,   4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్‌, 3,080 ఎంఏహెచ్ బ్యాట‌రీ  ఉన్నాయి. ప్రైస్‌: 14,999  

హాన‌ర్ 6ఎక్స్  
 ఈ సంవ‌త్స‌రం డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్‌తో వ‌చ్చిన ఫ‌స్ట్ బ‌డ్జెట్ ఫోన్ ఇదే.  దీనిలో రియ‌ర్‌సైడ్ రెండు 12 ఎంపీ, 2ఎంపీ కెమెరాలున్నాయి. కెమెరా ఇంట‌ర్‌ఫేస్‌తో  f0.95 నుంచి f16 ఆప‌ర్చ్యూర్‌తో పొటోలు తీయొచ్చు.  లైట్ పెయింట్‌, క‌ల‌ర్ స్ప్లాష్‌లాంటి ఎఫెక్ట్‌లు కూడా ఇంట‌ర్‌ఫేస్‌తో ఇచ్చారు.  5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,   ఆక్టాకోర్ కైరిన్ 655 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 3,340 ఎంఏహెచ్ బ్యాట‌రీ  ఉన్నాయి. ప్రైస్‌: 9,999  

జోపో స్పీడ్ ఎక్స్ 

ఇవి కాక 11,999 రూపాయ‌ల‌కు దొరికే జోపో స్పీడ్ ఎక్స్‌లోనూ  13 ఎంపీ, 2 ఎంపీ రియ‌ర్ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ఉంది. బొకే మోడ్‌, బ్యాక్గ్రౌండ్‌ను బ్ల‌ర్ చేసే ఆప్ష‌న్ ఉన్న ఈ ఫోన్‌లో 5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీడిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.  
హాన‌ర్ 8 

హాన‌ర్ 8లో 12 ఎంపీ డ్యూయల్ కెమెరా సెట‌ప్ ఉంది. హువావే 9 వంటి ఎక్స్‌పెన్సివ్ ఫోన్ల‌లో వాడే కెమెరా సెట‌ప్ ఉండ‌డంతో దీని ధ‌ర 29 వేల‌కుపైగా ఉండేది. ఇప్పుడు బాగా త‌గ్గి 15వేల‌లోపే వ‌చ్చింది. ఐఆర్ బ్లాస్ట‌ర్‌, ఫింగ‌ర్  ప్రింట్ స్కాన‌ర్‌తో క్లిక్ చేసే ఫీచ‌ర్లు ఉన్నాయి. 
 

జన రంజకమైన వార్తలు