• తాజా వార్తలు
  •  

MS ఆఫీస్ డెస్క్ టాప్ vs వెబ్ vs మొబైల్ యాప్స్

వివిధ రకాల ఆఫీస్ ప్రోగ్రాం లను ఉపయోగించడానికి మైక్రో సాఫ్ట్ అనేక రకాల వెర్షన్ లను అందిస్తుంది. డెస్క్ టాప్ యాప్ లు, మొబైల్ యాప్ లు, ఆన్ లైన్ వెబ్ బ్రౌజర్ లు వీటికి ఉదాహరణలు. డెస్క్ టాప్ వెర్షన్ ల తో పోలిస్తే ఆన్ లైన్ వెబ్ మరియు మొబైల్ యాప్ వెర్షన్ లు అంత సమర్థవంతమైనవి కానప్పటికీ వేటికుండే ఉపయోగం వాటికి ఉంటుంది. మనలో కొంతమందికి ఈ మూడింటి తోనూ అవసరం ఉంటుంది. వీటిలో ఏవి ఉత్తమమైనవి? వేటిని వాడాలి ? తదితర విషయాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

మైక్రో సాఫ్ట్ ఆఫీస్ యొక్క వివిధ రకాల వెర్షన్ లు              

మైక్రో సాఫ్ట్ ఆఫర్ చేసే సర్వీస్ లు చాలా తక్కువగానూ కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ గానూ ఉంటాయి. MS ఆఫీస్ దీనికి మినహాయింపేమీ కాదు. మనకు ఫుల్ డెస్క్ టాప్ వెర్షన్ కావాలి అంటే కొనడం గానీ లేదా సబ్ స్క్రిప్షన్ చేసుకోవడం గానీ చేయాలి. సబ్ స్క్రిప్షన్ చేసుకుంటే ఐ ఫోనే, ఐ పాడ్, ఆండ్రాయిడ్ మరియు క్రోమ్ బుక్స్ లలో ఉండే మొబైల్ యాప్  లకు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఇది కాక మీ బ్రౌజర్ నుండి ఆన్ లైన్ వెర్షన్ ను కూడా ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు.

ఆఫీస్ 365 డెస్క్ టాప్ ( ఆఫీస్ 2016 )            

ఆఫీస్ యొక్క డెస్క్ టాప్ వెర్షన్ అనేది మనం చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే. ఇది ఒక ఫుల్ ఫీచర్డ్ వెర్షన్. దీనిద్వారా ఈ క్రింది డెస్క్ టాప్ యాప్ లను మనం మన విండోస్ PC లో కానీ మాక్ లో కానీ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

ఆఫీస్ 2016 : ఇది ఎప్పటినుండో వస్తున్న ఒక సాంప్రదాయ యాప్. ముందు కొంత మొత్తం చెల్లించి లైసెన్స్ పొంది మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవడమే.

ఆఫీస్ 365 : ఇది ఒక సరికొత్త సబ్ స్క్రిప్షన్ మోడల్. మీరు నెలకు లేదా సంవత్సరానికి  ఒకసారి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు సబ్ స్క్రిప్షన్ లో ఉన్నంత కాలం మీకు దీనియొక్క లేటెస్ట్ వెర్షన్ ఎప్పటికప్పుడు అప్ డేట్ రూపంలో అందించబడుతుంది. ఇది మాత్రమే గాక పెద్ద మొత్తం లో ఉండే వన్ డ్రైవ్ స్టోరేజ్, నెలవారీ స్కైప్ నిముషాలు, ఆఫీస్ యాప్ యొక్క మొబైల్ యాప్ వెర్షన్ లు మీకు సబ్ స్క్రిప్షన్ తో పాటు ఉచితంగా లభిస్తాయి.

ఆఫీస్ 365 మొబైల్ యాప్స్  ( ఐ ఫోన్, ఆండ్రాయిడ్ అండ్ క్రోమ్ బుక్స్ )

ఆఫీస్ 365 మొబైల్ యాప్స్ లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్ నోట్ మరియు అవుట్ లుక్ ల వెర్షన్ లు ఐఒఎస్ మరియు ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం లకోసం  ఉంటాయి.చాలావరకూ ఆండ్రాయిడ్ యాప్స్ ను మీరు క్రోమ్ బుక్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడానికి ముందుగా  పెయిడ్ ఆఫీస్ 365 సబ్ స్క్రిప్షన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.ఇది మీకు డెస్క్ టాప్ మరియు మొబైల్ యాప్స్ రెండింటికీ యాక్సెస్ ను కల్పిస్తుంది. డెస్క్ టాప్ వెర్షన్ లతో పోలిస్తే మొబైల్ యాప్ లు పరిమిత స్థాయిలో ఫీచర్ లను కలిగి ఉంటాయి. కానీ చూడడానికి రెండూ ఒకేలా ఉంటాయి.ఈ మొబైల్ యాప్స్ మనకు ఆఫ్ లైన్ యాక్సెస్ ను కూడా కల్పిస్తాయి. అంటే ఇంటర్ నెట్ లేకున్నా సరే మనం డాక్యుమెంట్ లను చూడవచ్చు మరియు ఎడిట్ చేసుకోవచ్చు.

ఆఫీస్ 365 ఆన్ లైన్

మీ వెబ్ బ్రౌజర్ ద్వారా డాక్యుమెంట్ లను చూడడం మరియు ఎడిట్ చేయడం లాంటి ఫీచర్ లను ఈ ఆఫీస్ 365 ఆన్ లైన్ కల్పిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న యాప్ లన్నీ ఇక్కడ కూడా అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ యాప్ లను ఉపయోగించాలి అంటే ఏ విధమైన సబ్ స్క్రిప్షన్ తీసుకోవలసిన అవసరం లేదు. మొబైల్ యాప్ లలో ఉండే ఫీచర్ లన్నీ ఇంచుమించు గా ఇందులో కూడా ఉంటాయి. తేడా ఏంటంటే ఇది ఆఫ్ లైన్ యాక్సెస్ ఆఫర్ చేయదు. డాక్యుమెంట్ లను చూడాలన్నా, ఎడిట్ చేయలన్నాఖచ్చితంగా ఇంటర్ నెట్ కు కనెక్ట్ అవ్వాల్సిందే.

ఈ మూడు వెర్షన్ లు కూడా వన్ డ్రైవ్ తో విస్తారమైన ఇంటిగ్రేషన్ ను అందిస్తాయి. కాబట్టి వివిధ రకాల ఫ్లాట్ ఫాం లను ఉపయోగించేటపుడు డాక్యుమెంట్ లను ట్రాక్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది.

వీటి మధ్య ప్రధాన తేడాలు ఏమిటి ?            

మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే నాన్ డెస్క్ టాప్ వెర్షన్ లు ( మొబైల్ యాప్స్ మరియు వెబ్ ) ఫుల్ డెస్క్ టాప్ వెర్షన్ కు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మీకు కేవలం బేసిక్ ఫీచర్ లు మాత్రమే అవసరం అయితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే కొత్త డాక్యుమెంట్ లను క్రియేట్ చేయాలంటే మాత్రం వీటిలో సాధ్యం కాదు. ఉదాహరణకు

వర్డ్ : ఇక్కడ మనం కాప్షన్ లు, సైటేషన్ లు, టేబుల్ అఫ్ కాంటెంట్ లాంటి వాటిని క్రియేట్ చేసుకోలేము, స్టైల్స్ అప్లై చేసుకోలేము.అడ్వాన్స్డ్ రివ్యూ, ప్రూఫింగ్, పేజి లే అవుట్ ల లాంటివాటికి నాన్ డెస్క్ టాప్ వెర్షన్ లలో యాక్సెస్ ఉండదు.

ఎక్సెల్ : ఇక్కడ కూడా పివోట్ టేబుల్స్ లాంటి వాటిని క్రియేట్ చేసుకోలేము.

వన్ నోట్ : ఎంబెడెడ్ ఫైల్ ఎడిటింగ్ , ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ లాంటి వాటిని ఇక్కడ చేయలేము.

పవర్ పాయింట్ : నాన్ డెస్క్ టాప్ వెర్షన్ లలో కస్టం యానిమేషన్ క్రియేట్ చేయడం, హెడర్ మరియు ఫుటర్ లను ఉపయోగించడం లాంటివి ఇక్కడ చేయలేము.

ఇవి మాత్రమే కాక డెస్క్ టాప్ వెర్షన్ ఉన్న అనేక రకాల ఫీచర్  లను  మనం నాన్ డెస్క్ టాప్ వెర్షన్ లలో ఉపయోగించలేము.

మరి వీటిలో మనం ఏ వెర్షన్ ను ఉపయోగించాలి?             

పైన చెప్పుకున్న మూడు వెర్షన్ లలో ఏది ఉపయోగించాలి అనేది పూర్తిగా మన యొక్క అవసరం పై ఆధారపడి ఉంటుంది.మనకు ఫుల్ డెస్క్ టాప్ వెర్షన్ కావాలి అనుకుంటే ఆఫీస్ 2016 కానీ సబ్ స్క్రిప్షన్ బేస్డ్ ఆఫీస్ 365 ను కానీ ఎంచుకోవాలి. అయితే మొబైల్ యాప్ లు కూడా వాడాలి అనుకుంటే ఆఫీస్ 365 ను సబ్ స్క్రైబ్ చేసుకోవడమే ఉత్తమం. ఇక ఆఫీస్ 365 ఆన్ లైన్ మరియు మొబైల్ యాప్ ల విషయానికొస్తే కేవలం బేసిక్ ఫీచర్ లు మాత్రమే కావాలి అనుకున్నపుడు వీటికి మించిన ఆప్షన్ లేదు. అంతకంటే ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఫుల్ డెస్క్ టాప్ వెర్షన్ ను తీసుకోవలసిందే.

మీరు ఇప్పటికే ఆఫీస్ 365 సబ్ స్క్రిప్షన్ ను కలిగి ఉన్నట్లయితే మొబైల్ యాప్ లను వాడడం మొదలు పెట్టండి. ఎందుకంటే  ఇవి ఆఫ్ లైన్ లో యాక్సెస్ ను కల్పిస్తాయి. వీటిని మీరు ఆండ్రాయిడ్, ఐ ఫోన్, ఐ పాడ్ మరియు క్రోమ్ బుక్ లలో కూడా వాడవచ్చు. ఒకవేళ ఈ సబ్ స్క్రిప్షన్ మీ దగ్గర లేకపోయినట్లయితే ఆఫ్ లైన్ యాక్సెస్ గురించి బాధ పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఫ్రీ ఆన్ లైన్ యాప్ ను ఉపయోగించుకోవచ్చు.

విజ్ఞానం బార్ విశేషాలు