• తాజా వార్తలు
  •  

రూ15 వేల‌కే విండోస్ 10 ఐబాల్ కాంప్‌బుక్ ల్యాప్‌టాప్‌

మంచి లాప్‌టాప్ కొనాలంటే రూ.25 వేలు పెట్టాల్సిందే. మంచి ఫీచ‌ర్లు ఉండి..బ్రాండెడ్ ల్యాప్‌టాప్ అయితే ఇక చెప్ప‌క్క‌ర్లేదు. రూ.40 వేలకు త‌క్కువ ఉండ‌దు.  ఈ నేప‌థ్యంలో మంచి ఫీచ‌ర్ల‌తో పాటు అందుబాటు ధ‌ర‌తో విండోస్  ఒక కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది.  రూ.15  వేల ధ‌ర‌కే విండోస్ 10 ఐ బాల్  కాంప్‌బ్యాక్  మార్వెల్  ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వ‌చ్చింది. పెద్ద స్క్రీన్‌, ఫుల్‌సైజ్  కీబోర్డ్‌తో ఈ  కొత్త ల్యాప్‌టాప్‌ను ఆక‌ట్టుకునేలా త‌యారు చేశారు.

32జీబీ సామ‌ర్థ్యం
మంచి ధ‌ర‌తో పాటు రీజ‌న‌బుల్  మెమ‌రీ  ఈ ల్యాప్‌టాప్ సొంతం.  14 అంగుళాల సైజుతో ఉండే ఈ డివైజ్ చూడ‌టానికి కూడా ఆక‌ట్టుకునేలా ఉంటుంది. అన్నిటిక‌న్నా మించి 32 జీబీ సామర్థ్యం దీనిలో ఉంది.  ఇది బేసిక్‌గా ల్యాప్‌టాప్‌ను ఉప‌యోగించే వాళ్ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.  ట్యాబ్‌లు వాడ‌డం క‌న్నా దీన్ని ఉప‌యోగించ‌డం ఉత్త‌మం.  బ్లూ, గ్రే ప్లాస్టిక్  రంగుల‌తో వ‌చ్చిన ఈ ల్యాప్‌టాప్ చూడ‌గానే ఆక‌ట్టుకుంటుంది.  లిడ్ మీద ఐ బాల్ లోగో ఉంటుంది. ఫ్యాన్ అవ‌స‌రం లేని త‌క్కువ ప‌వ‌ర్ సీపీయూ దీనిలోవాడారు.   

1.41 కేజీ బ‌రువుతో..
ఈ ఐబాల్ ల్యాప్‌టాప్   బరువు కూడా త‌క్కువే. 1.41 కేజీతో లైట్‌వెయిట్‌గా త‌యారైంది. అందుకే  ఈ ల్యాప్ టాప్ మీద ఎలాంటి బ‌రువైన వ‌స్తువులు ఉంచ‌కూడ‌దు. అలాచేస్తే ఈ డివైజ్ పాడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. 14 అంగుళాల స్క్రీన్ చుట్టూ  ప్లాస్టిక్‌తో చేసిన హ్యాండీ గ్రిప్ ఉంటుంది.   దీని వ‌ల్ల తెర‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదు. స్క్రీన్ బెజెల్ మ‌రియు కీబోర్డు డెక్‌ల‌ను గ్రే ప్లాస్టిక్‌తో త‌యారు చేశారు. ఐబాల్ ట్రేడ్ మార్క్ రెడ్ ఐ కీ త‌ప్పించి.. మిగిలిన కీస్ అన్నిబ్లాక్ క‌ల‌ర్‌లో ఉంటాయి.