• తాజా వార్తలు
  •  

రివ్యూ - త‌క్కువ ధ‌ర‌లో సూప‌ర్ క్వాలిటీతో ఎంఐ ఇయ‌ర్ ఫోన్స్  

ఏదైనా ఒక ప్రొడ‌క్ట్‌ను వాడ‌డం మొద‌లుపెట్ట‌గానే వావ్ అనిపించిందంటే చాలు.. ఆ ప్రొడ‌క్ట్ స‌క్సెస్ అయినట్లే. టెక్నాల‌జీ క్ష‌ణ‌క్ష‌ణానికి మారిపోతున్న ప‌రిస్థితుల్లో అలా ఒక ప్రొడ‌క్ట్ గురించి అద్భుతం అని అనుకోవ‌డం చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో జ‌రుగుతోంది. అయితే షియోమీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఎంఐ ఇయ‌ర్‌ఫోన్స్ మాత్రం చూడ‌గానే బాగుంద‌నిపిస్తున్నాయి. వాడ‌గానే ఇంప్రెస్ చేస్తున్నాయి. ధ‌ర కూడా త‌క్కువ కావ‌డం దీనికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్‌. 
మంచి ఫీచ‌ర్లు
ఎంఐ ఇయ‌ర్ ఫోన్స్ మంచి క్వాలిటీ సౌండ్ ఇస్తున్నాయి.వాల్యూం ఎంత పెంచినా ఆడియో క్వాలిటీ మిస్స‌వ‌కుండా అవుట్‌పుట్ ఇస్తే అది మంచి ఇయ‌ర్‌ఫోన్ కింద లెక్క‌. ఆ ర‌కంగా చూస్తే ఎంఐ ఇయ‌ర్ ఫోన్స్‌కు మంచి మార్కులే వేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ వాల్యూమ్‌లోకూడా డిటెయిల్స్ కోల్పోకుండా ఆడియోను ఇస్తోంది. బాస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. చాలా ట్రాక్‌ల్లో బాస్ లెవెల్స్‌లో ఎక్కువ హెచ్చుతగ్గులు వ‌స్తుంటాయి. వాట‌న్నింటినీ కూడా బాగా క‌వ‌ర్ చేస్తోంది. పాట‌లు వినేట‌ప్పుడు అందులో సింగ‌ర్ గొంతును, బ్యాక్‌గ్రౌండ్‌లో వ‌చ్చే మ్యూజిక్‌ను వేరుచేసి వినిపించ‌గ‌లిగితే మంచి హెడ్‌సెట్ అని చెబుతారు. ఆ విధంగా చూసినా ఎంఐ ఇయ‌ర్ ఫోన్స్ స‌క్సెస్ అయింది. 

* మీరు ఏ ప‌నిలో ఉన్నా ఇయ‌ర్ ఫోన్స్ చెవిలో నుంచి జారిపోకుండా గ్రిప్ ఉండేలా ఎర్గాన‌మిక్ క‌ర్వ్స్‌తో వ‌చ్చింది.అందువ‌ల్ల ఎక్కువ సేపు ఇయ‌ర్‌ఫోన్స్‌ను చెవిలో ఉంచుకోగ‌లుగుతాం. అయితే చెమ‌ట‌ప‌ట్ట‌కుండా స్వెట్ ప్రూఫ్ లేక‌పోవ‌డం కొంత మైన‌స్‌.

* ఇయ‌ర్ ఫోన్స్ ఎవ‌రికైనా ఫిట్ అయ్యేలా మూడు సైజ్‌ల్లో ఇయ‌ర్ బ‌డ్స్ ఇచ్చారు.

* ఇయ‌ర్‌ఫోన్ చోర్డ్ స‌గానికి పైగా ఫైబ‌ర్‌తో ఇచ్చారు. సాధారణంగా వెయ్యి, 1500 రూపాయ‌ల్లోపు ఇయ‌ర్‌ఫోన్స్‌లో దీనికి ప్లాస్టిక్‌వాడ‌తారు. 

* కాల్ మాట్లాడుకోవ‌డానికి మైక్ ఉంది. మ్యూట్‌, కాల్ డిక్ల‌యిన్ వంటివి చేసుకోవ‌డానికి మైక్ ద‌గ్గ‌రే షార్ట్ కట్స్ ఉన్నాయి. అయితే ఇవి ఐవోఎస్ డివైస్‌ల‌కు ప‌ని చేయ‌వు.

* బరువు కూడా చాలా త‌క్కువ‌. మొత్తం 14 గ్రాములే.

* స్లీక్ డిజైన్‌, మెటాలిక్ ఫినిష్‌తో చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా, కాస్ట్‌లీగా ఉంది. 

ధ‌ర రూ.699 
ఇన్నిప్ర‌త్యేక‌త‌లున్న ఎంఐ ఇయ‌ర్‌ఫోన్స్ ధ‌ర రూ.699. ప్రీమియం మెటీరియ‌ల్స్ వాడినా ధ‌ర తక్కువ‌గా ఉండ‌డం దీనికి అడ్వాంటేజ్‌. బ్లాక్‌, సిల్వ‌ర్ క‌ల‌ర్స్‌లో దొరుకుతుంది.