• తాజా వార్తలు
  •  

రివ్యూ - డేటా సేవింగ్ యాప్స్ - గూగుల్ డేటాలీ vs సామ్సంగ్ మాక్స్ – ఏది బెస్ట్

ప్రస్తుత స్మార్ట్ యుగం లో స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరిగిపోయింది అనే మాట మనం ఎప్పుడూ చెప్పుకునేదే! అయితే పెరిగిన స్మార్ట్ ఫోన్ ల వినియోగం తో పాటు మరొక ప్రధాన సమస్య కూడా పెరిగింది. అదే డేటా. ప్రతీ చిన్న విషయానికీ యాప్ లు వచ్చేయడం తో మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకునే యాప్ ల సంఖ్య కూడా పెరిగిపోయింది. దానితోపాటే స్టోరేజ్ సమస్య కూడా. ఇన్ని యాప్ లకు సరిపడా స్టోరేజ్ మన ఫోన్ లలో ఉండడం లేదు. చాలా యాప్ లు అనవసరంగా మన ఫోన్ లో ఉంటూ ఎక్కువ స్టోరేజ్ ను ఆక్రమిస్తాయి. అయితే వాటిని మనం అంతగా గమనించలేము. అయితే ఇలాంటి సమస్యకు పరిష్కారం వచ్చేసింది. అదే డేటా సేవింగ్ యాప్స్. 2014 లోనే ఓపెరా ఈ తరహా యాప్ ను విడుదల చేయగా తాజాగా గూగుల్ కూడా డేటాలీ పేరుతో మరొక డేటా సేవింగ్ యాప్ ను కలిగి ఉన్నది. దీనికి పోటీగా అన్నట్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం అయిన సామ్సంగ్ కూడా తన డేటా సేవింగ్ యాప్ ను విడుదల చేసింది. అదే మాక్స్. ఈ రెండింటిలో ఏది ఉత్తమం? వీటి విశిష్టతలు ఏవి? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

గూగుల్ తో పోలిస్తే దీనికి ఉన్న ప్రధాన అనుకూలత ఏమిటంటే గూగుల్ బ్యాక్ గ్రౌండ్ లో డేటా ను సేవ్ చేస్తే  ఈ మాక్స్ అనే యాప్ ఫోర్ గ్రౌండ్ లో కూడా డేటా ను సేవ్ చేస్తుంది. ఇది కేవలం ఇండియన్ యూజర్ లకోసం మాత్రమే లాంచ్ చేయబడింది. ఇది ప్లే స్టోర్ లో ఉచితంగానే లభిస్తుంది. అయితే కేవలం సామ్సంగ్ యూజర్ లు మాత్రమే దీనిని డౌన్ లోడ్ చేసుకోగలరు. గాలక్సీ A మరియు గాలక్సీ J సిరీస్ ఫోన్ లలో ఇది ముందే లోడ్ చేయబడి ఉంటుంది. గూగుల్ యొక్క డేటా లీ యాప్ తో పోలిస్తే మరింత పవర్ ఫుల్ మరియు ఎఫెక్టివ్ డేటా సేవింగ్ టూల్ లను కలిగి ఉంటుంది. ఓపెరా మాక్స్ యాప్ ప్రేరణతో లాంచ్ చేయబడిన ఈ యాప్ ఎక్కువ డేటా ను వినియోగించే యాప్ లను గుర్తించడమే గాక వాటిని ఆఫ్ మోడ్ లో కూడా ఉంచుతుంది.

డేటా సేవింగ్ మోడ్ విషయం లో మాత్రం ఇది గూగుల్ డేటా లీ ని పోలి ఉంటుంది. అంటే డేటా లీ ఎలా అయితే ఎక్కువ డేటా ని వినియోగించే యాప్ లను గుర్తిస్తుందో ఇది కూడా అలాగే గుర్తిస్తుంది. డేటా లీ లో అవసరం లేనపుడు అంటే ఈ యాప్ లు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నపుడు బ్లాక్ చేసే వీలుంటుంది. ఇందులో అయితే అది ఆటోమాటిక్ గా ఉంటుంది. దీనియొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఫోర్ గ్రౌండ్ లో ఉండే యాప్ ల డేటా వినియోగాన్ని కూడా మినిమైజ్ చేస్తుంది. ఇందులో ఉండే డేటా సేవింగ్ మోడ్ ఇమేజ్ లనూ,వీడియో లనూ, ఆడియో ఫైల్ లనూ మరియు వెబ్ పేజి లనూ రియల్ టైం లో కంప్రెస్ చేస్తుంది. ఇది అన్ని వీడియో మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లతోనూ పనిచేస్తుంది. అంటే హై రిసోల్యూషణ్ ఇమేజ్ లతో కూడిన వీడియో లు ఇంతకుముందు కంటే మరింత వేగంగా లోడ్ అవుతాయన్నమాట!

ఈ డేటా ను కంప్రెస్ చేయడానికి సామ్సంగ్ మాక్స్ మీ డివైస్ ను ఒక VPN ( వర్చ్యువల్ ప్రైవేటు నెట్ వర్క్ ) కు కనెక్ట్ చేసి డేటా ను ఆయా సర్వర్ లకు పంపుతుంది. మీ డేటా అక్కడ కంప్రెస్ చేయబడి తిరిగి మీ డివైస్ లకు పంపబడుతుంది. ఇలా మీ డివైస్ VPN కనెక్ట్ అవడం వలన మరింత సెక్యూర్ గా మారుతుంది. తద్వారా పబ్లిక్ వైఫై లేదా వేరే ఇతర ఓపెన్ నెట్ వర్క్ లకు కనెక్ట్ అయినపుడు కూడా మీ డేటా సురక్షితంగా ఉంటుంది. మీ ఐడెంటిటీ ని కూడా ఇది రహస్యంగా ఉంచుతుంది.

దీనికి ఉన్న ఏకైక ప్రతికూలత ఏమిటంటే ఇది కేవలం సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లలో మాత్రమే పనిచేస్తుంది. అదే గూగుల్ యొక్క డేటా లీ అయితే అన్ని ఆండ్రాయిడ్ డివైస్ లలోనూ పనిచేస్తుంది.