• తాజా వార్తలు
  •  

బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ లు ఏవి?

గత దశాబ్దం క్రితం తో పోలిస్తే మన యొక్క జీవన విధానాల లోనూ, జీవనప్రమాణాల లోనూ గణనీయమైన మార్పు వచ్చింది. దీనంతటికీ కారణం స్మార్ట్ ఫోన్ అనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం. ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలలో పెరిగిన యాప్ ల విస్తృతి తో ప్రతీ చిన్న విషయానికీ స్మార్ట్ ఫోన్ పై ఆధారపడే పరిస్థితి వచ్చింది. క్రమంగా మన దైనందిన జీవితం లో ఒక భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ లు మారిపోయాయి. ఇవి మానవ జీవన విధానాలను మరింత సరళతరం చేసాయి. ప్రొద్దున్నే లేచి మన ఫోన్ ను చెక్ చేసుకోవడం ఒక నిత్యకృత్యం గా మారిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. మరి మనం ఇంతలా స్మార్ట్ ఫోన్ పై ఆధారపడుతున్నాం కదా! మరి మనకు కావలసిన పనులన్నీ చేయడానికి స్మార్ట్ ఫోన్ లు దేనిపై ఎక్కువగా ఆధార పడతాయో తెలుసా? అవును మీరు ఊహించింది నిజమే. బ్యాటరీ. స్మార్ట్ ఫోన్ తన పనులన్నీ చేయాలి అంటే దానికి చక్కటి బ్యాటరీ కూడా అవసరమే. బ్యాటరీ ఒక్కటే అవసరం అని కాదు కానీ బ్యాటరీ లేకపోతే స్మార్ట్ ఫోన్ తన పని ఎంత చేసినా ఉపయోగం ఉండదని భావించవచ్చు. ఈ నేపథ్యం లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉన్న స్మార్ట్ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో మా పాఠకుల కోసం ఇవ్వడం జరుగుతుంది.

వీటికి ప్రామాణికత ఏమిటి?

ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ బ్యాటరీ పవర్ ఉన్న ఫోన్ లను తీసుకుని వాటిలో ఉన్న సిమ్ కార్డు లను తీసివేయడం జరిగింది.వీటన్నింటినీ ఒకే గిగా బిట్ వై ఫై కు కనెక్ట్ చేసి ప్రతీ ఫోన్ లో పూర్తి ఛార్జింగ్ అయిపోయేవరకూ యూ ట్యూబ్ వీడియో లను ప్లే చేయడం జరిగింది. ఇలా చేసినపుడు ఏ ఫోన్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను ఇచ్చిందో ఇక్కడ ఇస్తున్నాం.

స్మార్ట్ ఫోన్                                                                    రన్ టైం

హువాయి మేట్ 10 ప్రో                                          11 గంటల 22 నిమిషాలు

సామ్సంగ్ నోట్ 8                                                 11 గంటల 8 నిమిషాలు

LG V30                                                         10 గంటల 58 నిమిషాలు

వన్ ప్లస్ 5T                                                      10 గంటల 54 నిమిషాలు

గూగుల్ పిక్సెల్ 2 XL                                            9 గంటల 12 నిముషాలు

ఐ ఫోన్ X                                                         9 గంటల 10 నిమిషాలు

essential ఫోన్                                                  8 గంటల 14 నిమిషాలు

 ఈ పద్దతిలో ఫోన్ యొక్క బ్యాటరీ ని చెక్ చేయడం సరైన పద్ధతేనా? కాదా? అనే వాదనను పక్కన పెడితే ఇది కూడా ఒక చక్కని ప్రామాణికత గా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్నపుడు బ్యాటరీ ఎలా ఉంటుంది? అని ప్రాథమికంగా ప్రశ్నించుకుంటున్న ఈ రోజుల్లో ఈ పై సమాచారం మీకు తప్పకుండా ఉపయోగపడగలదని భావిస్తున్నాము.