• తాజా వార్తలు
  •  

స‌రా భాగోతంలో ఇరుక్కున్నారా?  విముక్తి పొందండి ఇలా..

స‌రా  (Sarahah)  సోషల్ మీడియాను గత వారం పదిరోజులుగా షేక్ చేస్తున్న యాప్.  సంచనాలు రేపుతున్న ఈ యాప్  అంతే స్థాయిలో విమర్శ‌ల‌ను కూడా  ఎదుర్కొంటోంది.  Sarahah యాప్ మెసేజ్‌లు సెండింగ్‌, రిసీవింగ్‌కు ఉద్దేశించిన యాప్‌.   మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుంటే దాన్ని చూసి మీకు ఎవ‌రైనా ఫీడ్ బ్యాక్ పంపించే యూనిక్ ఫీచ‌ర్ తో వ‌చ్చిన  Sarahah యాప్ టోట‌ల్‌గా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌.  మెయిల్ ఐడీ, సోష‌ల్ మీడియా అకౌంట్ మాదిరిగానే Sarahah ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఎవ‌రైనా చూడొచ్చు. అంతేకాదు వారు క‌నీసం లాగిన్ కూడా కాకుండా మీ ప్రొఫైల్ చూడ‌డ‌మే కాదు మీకు మెసేజ్ కూడా పంప‌వ‌చ్చు.  వాళ్లు లాగిన్ చేస్తే వాళ్ల మెసేజ్‌లను మీరు ట్యాగ్ చేసుకోగ‌లుగుతారు. మీ ప్రొఫైల్‌ను బేస్ చేసుకుని అవ‌త‌లి వ్య‌క్తి మీకు కామెంట్స్ పంపింవ‌చ్చు.  

ఏమిటి స‌మ‌స్య‌?

హానెస్ట్‌గా ఉండే ఒపీనియన్స్‌ను తీసుకోవడం, క‌న్‌స్ట్ర‌క్టివ్ క్రిటిసిజ‌మ్ ఈ యాప్ టార్గెట్స్‌. అయితే ముసుగు తొడుక్కుంటే మ‌నుషుల నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్న‌ట్లు Sarahah యాప్ కూడా దుర‌హంకారంతో కూడిన విమ‌ర్శ‌ల‌కు వేదిక అవుతోంది.  చాలా మంది త‌మ‌లోని సాడిస్ట్ ల‌క్ష‌ణాల‌ను బ‌య‌ట‌పెట్టుకునేలా ఈ  ప్రొఫైల్స్ పెట్టుకునేవాళ్ల‌ను ట్రాల్ చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో స‌రా ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకున్న‌వారిని హెరాస్ చేయ‌డానికి ఈ యాప్ ప‌నికొస్తుంది. అలా ఈ యాప్ దుర్వినియోగం అవుతోంది. ఇత‌రుల‌ను కించ‌ప‌ర‌చ‌డానికి, నాస్టీ కామెంట్స్‌తో వారి ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ‌తీయ‌డానికి ఈ యాప్‌ను చాలా మంది ఉప‌యోగిస్తుండ‌డం దుర‌దృష్ట‌క‌రం. వ‌ల్గ‌ర్‌, ఎబ్యూసివ్ మెసేజ్‌ల‌తో చాలా మంది ఈ యాప్ ఉప‌యోగిస్తున్న‌వారిని వేధిస్తున్నారు.  Ask FM,  YikYak అనే యాప్స్ గ‌తంలో ఇలాంటి సైబ‌ర్ వేధింపుల‌కు వేదిక‌య్యాయి. ఇప్ప‌డు  Sarahah కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తోంది.   

 

 Sarahah  అకౌంట్‌ను డిలీట్ చేయ‌డం ఎలా? 

 దుర‌దృష్ట‌మేమిటంటే ఎవ‌రైనా మిమ్మ‌ల్ని Sarahah ప్రొఫైల్ చూసి వేధిస్తున్న‌ట్లు తెలిసినా మీ Sarahah అకౌంట్‌ను డిలీట్ చేయ‌డానికి యాప్ లో ఆప్ష‌న్ లేదు. అయితే మీ అకౌంట్‌ను రిమూవ్ చేయ‌డానికి ఓ మార్గం ఉంది.  అదెలాగో స్టెప్ బై స్టెప్ ఇక్క‌డ తెలుసుకోండి.

1.  Sarahah  అఫీషియ‌ల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి . \

2. సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్క‌డ  లెఫ్ట్‌సైడ్‌లో మీకు ‘Options’  క‌నిపిస్తాయి. 

3. ఆప్ష‌న్స్‌లోకి వెళ్లి  ‘Personal Information’  ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోండి.  ‘Password’ అని క‌నిపిస్తుంది. దీనిలోనే మీకు  Remove Account ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

4  Remove Account ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.  ఇప్పుడు  Sarahah మీ అకౌంట్‌ను రిమూవ్ చేయాల‌నుకుంటున్నారా అని క‌న్ఫ‌ర్మేష‌న్ అడుగుతుంది. 

5.  ‘Yes’ అనేదానిపై క్లిక్ చేస్తే మీ అకైంట్ రిమూవ్ అవుతుంది. అయితే ఒక‌సారి మీ అకౌంట్ రిమూవ్ చేస్తే మీ పాత మెసేజ్‌ల‌న్నీ ఎరేజ్ అవుతాయి. 

Sarahah ఏమంటోంది?  

ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన  Tawfiq మాట్లాడుతూ  Sarahah  ఈ ఇష్యూస్‌ను సీరియ‌స్‌గా తీసుకుంద‌ని చెప్పారు. అందుకే చాలా సేఫ్టీ మెజ‌ర్స్ తీసుకుంద‌ని, యూజ‌ర్స్‌ను బ్లాక్ చేయ‌డం,  new word filters తో వేధింపుల‌ను అడ్డుకోవ‌డానికి ఏర్పాట్లు చేస్తుంద‌న్నారు. 

 

జన రంజకమైన వార్తలు