• తాజా వార్తలు

సోష‌ల్ నెట్‌వర్క్స్‌లో అస‌లు పోస్ట్ చేయ‌కూడ‌ని 11 విష‌యాలు ఏమిటో తెలుసా?

పండ‌గ‌, పుట్టిన రోజు, వెకేష‌న్.. అకేష‌న్ ఏదైనా  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్ట‌ర్‌లాంటి సోష‌ల్ సైట్ల‌లో పంచుకోవడం ఇప్పుడు అంద‌రికీ అల‌వాట‌యిపోయింది. కానీ ఇందులో కొన్ని ఇబ్బందులున్నాయి. అస‌లు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో మీరు పోస్ట్ చేయ‌కూడ‌నివి ముఖ్యంగా 11 అంశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
1.మీరు ఎక్క‌డికి వెళుతున్నారో చెప్పొద్దు
గోయింగ్ టూ కేర‌ళ‌,  ఎంజాయింగ్ ఎ లాట్ ఎట్ ఊటీ.. ఇలాంటి పోస్ట్‌లు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ లాంటి సోష‌ల్ సైట్ల‌లో పెట్ట‌డం మంచిది కాదు.ఎందుకంటే ఫేస్‌బుక్‌లో ఆ పోస్ట్‌ను ఎవ‌రైనా చూడొచ్చు.అందులో దొంగుల‌, దోపిడీలుచేసేవాళ్లు కూడా ఉండొచ్చు.  ఇలాంటి పోస్టుల‌తో  మీరు ఇంట్లో లేరని వాళ్ల‌కు క్లూ ఇచ్చినట్లు అవుతుందని పోలీసులు కూడా హెచ్చ‌రిస్తున్నారు. 
2. ఈ-మెయిల్ ఐడీ ఇవ్వ‌కండి
మీరు అఫీషియ‌ల్‌గా, బ్యాంక్ అకౌంట్లకు, మీ ఇత‌ర ప‌ర్స‌న‌ల్ అవ‌స‌రాల‌కు వాడుకునే ఈ-మెయిల్ ఐడీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దీనిలో షేర్‌చేయ‌కండి. అలాంటి అవ‌స‌ర‌మే వ‌స్తే వేరే మెయిల్ ఐడీ క్రియేట్ చేసి పోస్ట్ చేసుకోండి.
3. ఫోన్ నెంబ‌ర్ వ‌ద్దే వ‌ద్దు
సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో మీ ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌డం సెక్యూరిటీ ప‌రంగా స‌మ‌స్య మాత్ర‌మే కాదు.. హెడేక్ కూడా. మీ ఫోన్ నెంబ‌ర్‌ను ఈ సైట్లు అడిగినా స్కిప్ చేయండి. ఎందుకంటే బ్యాంకింగ్ అకౌంట్ల‌న్నీ మొబైల్ ఓటీపీతో ముడిప‌డి ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మీ మొబైల్ నెంబ‌ర్‌ను ఫేస్‌బుక్ వంటి వాటిలో పోస్ట్ చేయ‌డ‌మంటే అప‌రిచితుల‌కు అందేలా చేయ‌డ‌మే. HTTPSతో ప్రోటోకాల్‌తో స్టార్ట‌యిన వెబ్‌సైట్లు, అవీ ప‌ర్స‌న‌ల్ డేటాను ప్రొటెక్ట్ చేస్తామ‌ని క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చిన సైట్ల‌కే మీ మొబైల్ నెంబ‌ర్ ఇవ్వండి. 
4.ఒరిజిన‌ల్ అడ్ర‌స్ ఇవ్వ‌ద్దు
మీ అడ్ర‌స్‌ను అప‌రిచిత వ్య‌క్తుల‌కు కూడా చెప్ప‌రు క‌దా. మ‌రి అలాంట‌ప్పుడు సోష‌ల్ సైట్ల‌లో ఎందుకు పెట్టాలి? అస‌లు ఇంట‌ర్నెట్‌లోనే మీ ఒరిజిన‌ల్ అడ్ర‌స్ పెట్టొద్దు. ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొంటే అది మీకు చేరాల్సిన అవ‌స‌రం ఉంటే త‌ప్ప ఇంట‌ర్నెట్లో ఎప్పుడూ మీ అడ్ర‌స్ పెట్ట‌నే వ‌ద్దు. 
 5.లొకేష‌న్‌
మీరున్న ఎగ్జాక్ట్ లొకేష‌న్ కూడా చెప్పొద్దు. అలాంటివి ఎవ‌రైనా ఫ్రెండ్‌కు షేర్‌చేయాల‌నుకుంటే వాళ్ల మొబైల్‌కు వాట్సాప్ పెట్టండి. అంతేగానీ సోష‌ల్ సైట్ల‌లో చేస్తే మీ సెక్యూరిటీ చిక్కుల్లో ప‌డిన‌ట్లే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో లొకేష‌న్ ఆఫ్ చేయండి. లేక‌పోతే అవి మీ లొకేష‌న్‌ను ట్రేస్ అవుట్ చేస్తాయి.  ముఖ్యంగా లేడీస్ ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.
6. చిన్న‌పిల్ల‌లఫొటోలు
మా అమ్మాయి బర్త్‌డే. మా అబ్బాయికి క్లాస్‌లో కాంపిటీష‌న్లో ప్రైజ్ వ‌చ్చింది అని ఫేస్బుక్‌లో పోస్ట్ చేస్తున్నారా? అలాంటివి త‌గ్గించండి. నిజంగా ఫ్రెండ్స్‌తో పంచుకోవాల‌నుకుంటే షేర్‌చేసేట‌ప్పుడు ప్రైవ‌సీ సెట్టింగ్స్‌లో మీకు కావ‌ల్సిన వ్య‌క్తుల‌ను సెలెక్ట్ చేసుకుని వారికి మాత్ర‌మే షేర్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే చిన్న‌పిల్ల‌ల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్న రోజుల్లో మ‌న పిల్ల‌ల గురించి మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా.
7. ప‌ని చేసేచోట జ‌రిగే వివాదాలు, అక్క‌డి ఇబ్బందుల గురించి సోష‌ల్ సైట్స్‌లో షేర్‌చేయ‌కండి. కంపెనీలు మీ సోష‌ల్ ప్రొఫైల్‌ను రెగ్యుల‌ర్‌గా వాచ్‌చేస్తుంటాయి. అలాంటి పోస్ట్‌లు, ట్వీట్లు ఉంటే మీ మీద యాక్ష‌న్ తీసుకోవడానికి వాళ్ల‌కు అవకాశం ఇచ్చిన‌ట్లు అవుతారు.
8. వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌లు 
వాట్సాప్‌, టెలిగ్రామ్ వంటి వాటిలో జ‌రిగే ప‌ర్స‌న‌ల్ చాటింగ్స్‌ను, ఈ మెయిల్ చాట్స్‌ను సోష‌ల్ సైట్స్‌లో పెట్ట‌డం క‌రెక్ట్ కాదు.ఎందుకంటే దీనివల్ల లీగ‌ల్‌గా కాంప్లికేష‌న్స్ వ‌స్తే మీరూ ఇరుక్కునే ప్ర‌మాద‌ముంది.
9 ఫ్రెండ్స్ ఫోటోలు కూడా వ‌ద్దు
మీరు ఫ్రెండ్స్‌తో పార్టీల‌కు, ప‌బ్‌ల‌కో, ఫంక్ష‌న్ల‌కో వెళ్లిన ఫోటోలు, బైక్ రైడింగ్‌లు, ట్రెక్కింగ్‌లు చేస్తున్న‌వి వాళ్ల‌కు చెప్ప‌కుండా సోష‌ల్ మీడియాలో పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ల‌కుదాని వ‌ల్ల ఇబ్బందులు రావ‌చ్చు.ముఖ్యంగా మీ గుంపులో అమ్మాయిలు ఉన్న‌ప్పుడు మ‌రింత జాగ్ర‌త్త‌.
10. ప్రైవేట్ డాక్యుమెంట్స్‌
మీ ఫ‌స్ట్ వ‌ర్క్ కాంట్రాక్ట్‌, ఫ‌స్ట్ ప్లే స్లిప్‌, అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్.. కొత్త క్రెడిట్‌కార్డ్ ఇలాంటివి ఉత్సాహంగా ఫేస్‌బుక్‌లో, ట్విట్ట‌ర్లో షేర్ చేసుస్తున్నారా. అయితే అలాంటివి వెంట‌నే ఆపేయండి. ఇలాంటివి కాన్ఫిడెన్షియ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్‌గా మీకు జాబ్ ఇచ్చిన కంపెనీలు ట్రీట్ చేస్తాయి. వాటిని మీరు సోష‌ల్ సైట్ల‌లో పంచుకుంటుంటే రేపు కంపెనీ సీక్రెట్స్ కూడా ఇలా రివీల్ చేస్తారేమోనని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భ‌విష్య‌త్తులో మీకు పెద్ద ప‌దవులిచ్చే అవ‌కాశాల్నిప‌క్క‌న‌పెట్టేస్తాయి. అదీకాక‌పోయినా మీ పే స్లిప్‌నుఎవ‌రైనా డౌన్‌లోడ్ చేసుకుని దానిలో మీ పేరు బ‌దులు వాళ్ల పేరు అటాచ్ చేసి దుర్వినియోగం చేయొచ్చు కూడా.
11. అస‌భ్యంగా ఉన్న ఫొటోలు
మీరు ఫ్రెండ్స్ క‌లిసి పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, మందు కొడుతున్న ఫోటోలు పెట్టొద్దు. కొన్ని ఫోటోలు మీ ఫ్రెండ్స్‌ను ఆటప‌ట్టించ‌డానికి తీస్తారు. అందులో ఒక్కోసారి అస‌భ్యంగా ఉన్న‌వి కూడా ఉండొచ్చు. అలాంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ పోస్ట్ చేయ‌కండి.

జన రంజకమైన వార్తలు