• తాజా వార్తలు
  •  

సెల్ఫీ తీసుకునేట‌ప్పుడు చేయ‌కూడ‌ని ప‌నులు

సెల్ఫీ... ఇది మ‌న జీవితంలో భాగ‌మైపోయింది. ఏ ప‌ని చేస్తున్నా.. ఎక్క‌డికి వెళుతున్నా.. సెల్ఫీ తీసుకోవ‌డం అల‌వాటుగా మారిపోయింది. ముఖ్యంగా యూత్ సెల్ఫీ ఒక మానియాలాగా మారిపోయింది. ప్ర‌తి చిన్న విష‌యానికి సెల్ఫీ తీసుకోవ‌డానికి వారు బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఒక‌ప్పుడు ఏదైనా సంద‌ర్భం ఉంటే మాత్ర‌మే ఫోన్‌తో ఫొటోలు తీసుకునేవాళ్లు... ఇప్పుడు సంద‌ర్భం ఉన్నా.. లేక‌పోయినా సెల్ఫీ మ‌స్ట్‌గా మారిపోయింది. సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌డానికి, స్టేటస్‌లు పెట్ట‌డానికి సెల్ఫీలు త‌ప్ప‌ని స‌రైపోయాయి. మ‌రి సెల్ఫీ తీసుకునేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అంతేకాదు సెల్ఫీ క్లిక్ చేసే ముందు చేయ‌కూడ‌ని కొన్ని ప‌నులు ఏంటంటే..

కార‌ణం లేకుండా సెల్ఫీ వ‌ద్దు
కొత్త ఫోన్ అనే మోజుతో చాలామంది సెల్ఫీలు తీసుకుంటుంటారు. అయితే చాలామంది కొన్నాళ్ల‌కు  ఆ ప‌ని చేయ‌డం మానేస్తారు. కానీ కొంత‌మంది మాత్రం కొత్తా.. పాతా ఇలా ఏం ఉండ‌దు.. సెల్ఫీలు తీసుకుంటూనే ఉంటారు. కానీ ఇలా కార‌ణం లేకుండా సెల్ఫీలు తీయ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదు. సెల్ఫీ తీసుకోవాలంటే క‌చ్చితంగా ఒక రీజ‌న్ ఉంటే మంచింది. ఎందుకంటే ఎవ‌రికైనా చూపించేట‌ప్ప‌డు ఆ సంద‌ర్భాన్ని చెబుతూ చూపిస్తే ఎదుటివారికి కూడా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. లేక‌పోతే కామెంట్స్ కోసం సెల్ఫీలు తీసుకున్న‌ట్లు అవుతుంది.

న‌వ్వండి హాయిగా
సెల్ఫీలు తీసుకునేట‌ప్పుడు చాలామంది కృత్రిమంగా నవ్వుతారు. వారు మ‌న‌స్పూర్తిగా న‌వ్వ‌ట్లేద‌ని ఆ ఫొటో చూసే వారికి అర్థ‌మైపోతుంది. అందుకే సెల్ఫీ అనే కాదు ఏ ఫొటో తీసుకున్నా హాయిగా న‌వ్వాలి. ఏదో బ‌ల‌వంతంగా ఫొటో తీసుకుంటున్న‌ట్లు ఉండ‌కూడ‌దు. మ‌న ఫొటో చూడ‌గానే ఎదుటివారికి ఆహ్లాదంగా అనిపించాలి.  మ‌నం ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న‌ట్లు క‌నిపించాలి. 

నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించొద్దు
సెల్ఫీలు తీసుకోవ‌డం అంద‌రికి స‌ర‌దానే. కానీ ఇది శ్రుతి మించ‌కూడ‌దు. పులులు, సింహాల‌తో సెల్ఫీలు తీసుకుని క‌ట‌క‌టాల పాలైన వాళ్లు ఉన్నారు. ఎందుకంటే వాటిని హింసిస్తూ ఫొటోలు తీసుకోవ‌డం చాలా త‌ప్పు. ఒక‌త‌నైతే జూకి వెళ్లి తాబేలు ఎక్కి ఫొటో దిగి జైలు పాల‌య్యాడు. అంతేకాదు రోడ్డు మీద సెల్ఫీలు తీసుకోవ‌డం కూడా చాలా డేంజ‌ర్‌. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు సెల్ఫీలు తీసుకోకూడ‌దు. కొంత‌మంది రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌గానే ఫోన్ బ‌య‌ట‌కు తీసి ఫొటోలు తీస్తుంటారు ఇలాంటివి మీకే కాదు ప‌క్క‌వాళ్ల‌కు కూడా న‌ష్టం.

ప‌క్క‌వాళ్ల‌ను ఇబ్బంది పెట్టొద్దు
సెల్ఫీ దిగుదాం రండి.. అంటూ ప‌క్క‌వాళ్ల‌ను ఇబ్బందిపెట్టొద్దు. కొంత‌మంది పిల్ల‌ల‌ను బాగా ఫోర్స్ చేస్తుంటారు. కొంతమంది త‌మ‌కు తెలియ‌ని వాళ్ల‌తో కూడా ఫొటోల‌కు రెడీ అవుతారు. ఎవ‌రినైనా మ‌నం ఫొటో దిగేముందు ప‌ర్మిష‌న్ తీసుకోవాలి. మీ పిల్ల‌లైనా స‌రే.. వాళ్ల‌కు ఇష్టం లేకుండా ఈ బ‌ల‌వంతంగా ఫొటో తీస్తే అవి స‌హ‌జంగా రావు.

జన రంజకమైన వార్తలు