• తాజా వార్తలు
  •  

    యూట్యూబ్ ఎందుకిలా సతాయిస్తోంది..

    యూట్యూబ్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఎంటర్టైన్మెంట్ పర్పజ్ లోనే కాకుండా వార్తల కోసం.. ట్యుటోరియల్స్ కోసం... ఎన్నో రంగాల్లో ట్రబుల్ షూటింగ్ కోసం కూడా యూట్యూబ్ పై ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ కాసేపు ఆగిపోతే కంగారు పడేవారు కోకొల్లలు. అలాంటివారందరినీ కంగారు పెడితే యూట్యూబ్ ఇటీవల తరచూ ఆగిపోతోంది. నిన్న సాయంత్రం కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయితే... యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ మాత్రం సమస్యను క్లియర్ చేసిందే కానీ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
    నిన్న సాయంత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల యూట్యూబ్ సైట్ ఓపెన్ కాలేదు. యూట్యూబ్‌ను ఓపెన్ చేస్తే 500 internal server error అనే మెసేజ్ వచ్చింది. చాలామంది యూట్యూబ్ అకౌంట్లు ఓపెన్ కాకపోవడంలో అప్ లోడ్ చేయడం కూడా కాలేదు. డెస్క్‌టాప్ లో మాత్ర‌మే కాదు, మొబైల్‌లో యూట్యూబ్‌ను ఓపెన్ చేసిన యూజ‌ర్లూ ఇబ్బంది పడ్డారు. 
    ప్రస్తుతం సమస్య క్లియర్ అయినప్పటికీ తరచూ ఇలాంటి అవాంతరాలు ఎదురవడంపై చర్చ జరుగుతోంది. పైగా ఆన్ లైన్ చానళ్ల పేరిట రోజంతా ఏదో ఒకటి అప్ లోడ్ చేసేవారు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆదాయ మార్గంగా మలచుకున్నవారు కూడా యూట్యూబ్ కు తరచూ అంతరాయం ఏర్పడితే తమ కంటెంట్ కు వ్యూస్ తగ్గి తమ ఆదాయం తగ్గుతుందని అంటున్నారు.

జన రంజకమైన వార్తలు