• తాజా వార్తలు
  •  

సెల్ఫీ ప్రియుల కోసం 7 సింపుల్ టిప్స్ ఇవే!

సెల్ఫీ.. మ‌న రోజు వారీ జీవితంతో  పెన‌వేసుకున్న పేరిది. స్మార్ట్‌ఫోన్ల విప్ల‌వం వ‌చ్చాక హిందుస్తాన్ కాస్త సెల్ఫీస్తాన్ అయిపోయింది. ముఖ్యంగా యూత్ ఈ సెల్ఫీ లంటే  ప‌డి చస్తోంది. నిజంగా సెల్ఫీలు తీసుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తూ కాళ్లు చేతులే కాదు ప్రాణాలు పోగొట్టుకున్న‌వాళ్లు  కూడా ఉన్నారు. మ‌రి మ‌న‌కు అంద‌మైన సెల్ఫీలు కావాలంటే.. సుర‌క్షితంగా ఆక‌ట్టుకునే సెల్ఫీలు తీసుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటంటే..

యాంగిల్స్‌
సెల్ఫీ తీసుకోవ‌డంలో యాంగిల్ కీలకం. మీ ఫేస్‌కు త‌గ్గ యాంగిల్‌లో  సెల్ఫీ తీసుకుంటేనే అది అందంగా క‌నిపిస్తుంది.  ఇదేమి పెద్ద చిట్కా కాదు.  మీ ఫేస్‌ను కొంచెంసేపు అద్దంలో గ‌మ‌నించండి. మీకు కొన్ని క్ష‌ణాల్లోనే మీకు సెల్ఫీకి  త‌గ్గ కోణం దొరికేస్తుంది. మీరు కెమెరాను ఎప్పుడు ఫేస్ చేసినా..అద్దంలో దొరికిన యాంగిల్‌ను రిపీట్ చేస్తే చాలు.

స‌రైన లైటింగ్
ఏ ఫొటోకైనా లైటింగ్ చాలా కీల‌కం. ఎక్కువ‌గా లైట్ ఉన్నా.. లేదా త‌క్కువ లైటింగ్ ఉన్నా మీ ఫొటో స‌రిగా  రాదు. మీకు మంచి సెల్ఫీ లేదా ఫొటో కావాలంటే స‌రిప‌డినంత లైటింగ్ మాత్ర‌మే ఉండాలి. ఉద‌యం వేళ‌ల్లో మీ కిటికీ ద‌గ్గ‌ర్లో  నిల‌బ‌డితే చాలు. నేరుగా సూర్య‌కాంతి మీద ప‌డిలా ఫొటో దిగ‌డం కూడా స‌రైంది కాదు. సెల్ఫీ ఫ్లాష్ కూడా అవ‌స‌ర‌మైతేనే ఉప‌యోగించాలి.

యాక్టివిటీని  హైలైట్ చేయ‌డం
సెల్ఫీ ఎందుకు తీసుకుంటాం. ఏదైనా మ‌నం చేసే ప‌ని తెలియాల‌నో లేదా ఏదైనా  ప‌ర్యాట‌క ప్రాంతం గురించి చెప్పాల‌నే ఉద్దేశంతోనే క‌దా! అందుకే మీరు చేసే ప‌ని లేదా.. మీరు ఫొటో దిగుతున్న ప్రాంతాన్నిక్లియ‌ర్‌గా క‌నిపించేలా సెల్ఫీ దిగ‌డం చాలా ముఖ్యం.  మీతో పాటు ఆ యాక్టివిటీకి కూడా స‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.

ఫ్రేమింగ్ ముఖ్యం
మ‌నం ఫొటో  తీసుకునేట‌ప్పుడు ఒక ఫ్రేమ్ లాంటిది క‌నిపిస్తుంది. కానీ చాలామంది దాని గురించి ప‌ట్టించుకోరు. ఆ ఫ్రేమ్ స‌రిగ్గా వాడుకుంటేనే ఫొటో ఫ‌ర్‌ఫెక్ట్‌గా వ‌స్తుంది. ఈ వ‌ర్టిక‌ల్‌, హారిజాంట‌ల్ లైన్స్ మ‌ధ్యలోనే మీ ఫేస్ వ‌చ్చేలా చూసుకోవాలి. మీ ఫ్రంట్ కెమెరాతో ఫొటో తీసుకునేట‌ప్పుడు పొట్రాయిట్ మోడ్‌లో తీసుకుంటే ఇంకా మంచిది.

మంచి పోజ్ ఇస్తేనే..
ఏంటోయ్ ఆ పోజు అంటారు.. ఎవ‌రినైనా! కానీ ఏ ఫొటోకైనా పోజే చాలా ముఖ్యంగా. పోజ్ ఎంత బాగుంటే ఫొటో అంత‌గా అదిరిపోద్ది. ఇష్టం వ‌చ్చినట్లు పోజులు పెట్ట‌కుంటే.. అందంగా స్ట‌యిలిష్‌గా పోజులు పెడితే ఫొటోలు గొప్ప‌గా వ‌స్తాయి. వీలైనంత ఎక్కువ‌గా ఫొటోల్లో   మీ ముఖం స‌ర‌దాగా ఉండేట‌ట్లు చూసుకోవాలి.
 
మ‌రీ ఎక్కువ ప్ర‌య‌త్నించొద్దు
ఫొటో అన‌గానే చాలా మంది బిగుసుకుపోతారు. కానీ ఎంత స‌హ‌జంగా ఉంటే ఫొటో అంత అందంగా వ‌స్తుంది. ఫొటో బాగా రావాల‌ని మ‌రీ ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకుంటే ఫొటోలు కూడా అంత బాగా రావు.  చిరున‌వ్వుతోనే ఎంత అద్భుత‌మైన  ఫొటోలు వ‌స్తాయి. మీ కంఫ‌ర్ట‌బులిటినీ బ‌ట్టి ఫొటో ఉండాలి అంతే కానీ కృత్రిమంగా ఉండ‌కూడ‌దు.

మంచి కెమెరా ఎంచుకోవాలి
ఫొటోలు మంచిగా రావాలంటే కెమెరా మంచిగా ఉండ‌డం చాలా కీలకం. ఇప్పుడు సెల్ఫీ స్పెష‌లిస్టు కెమెరాలు ఉన్న ఫోన్లు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.  చాలా ఫోన్ల‌లో రేర్ కెమెరా బాగుండి ఫ్రంట్ కెమెరా బాగుండ‌డ‌ట్లేదు. కానీ ఫ్రంట్ కెమెరా మంచి రిజ‌ల్యూష‌న్ ఉన్న ఫోన్‌నే ఫొటోల కోసం ఎంచుకోండి.

జన రంజకమైన వార్తలు