• తాజా వార్తలు

ఎనీటైం.. వాట్సాప్ కు పోటీగా అమెజాన్ తీసుకొస్తున్న మెసేంజర్ యాప్ ఇదే

వాట్సాప్ లేని స్మార్టు ఫోన్ ఉండదు కదా... దానికి పోటీగా ఎన్ని మెసేంజర్ యాప్స్ వచ్చినా కూడా వాట్సాప్ కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వాట్సాప్ కు పోటీగా మరో మెసేంజర్ యాప్ రానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. వివిధ మెసేంజర్ యాప్ లు, ఈకామర్స్ యాప్ లు వాడుతున్న లక్షలాది మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని వారు కోరుకున్న ఫీచర్లు ఉండేలా దీన్ని రూపొందిస్తోంది.
    అమెజాన్ తన మెసేంజర్ యాప్‌ను Anytime పేరిట విడుదల చేయనుంది. వాట్సాప్‌లోలాగే ఇందులో కూడా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, చాటింగ్, ఫొటోలు, వీడియోల షేరింగ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు వంటి ఫీచర్లన్నీ ఉంటాయని సమాచారం.  ఎనీటైం యాప్ ద్వారా కేవలం ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఫీచర్లే కాదు, ఇతర సేవలను ఉపయోగించుకోవచ్చు. 
    ఇందులో షాపింగ్ కూడా మిక్స్ చేస్తోంది అమెజాన్. చాటింగ్ నుంచే డైరెక్టుగా ఆన్‌లైన్ షాపింగ్ కు మారే వీలు కల్పిస్తోంది. అక్కడే ఆర్డర్లు ఇవ్వవచ్చు. టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్ ఈ యాప్‌ను టెస్టు చేస్తోంది.
 

జన రంజకమైన వార్తలు