• తాజా వార్తలు
  •  

బిల్‌గేట్స్ ఐఫోన్ వాడ‌రు.. ఎందుకో తెలుసా? 

ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఏం ఫోన్ వాడ‌తారో తెలుసా?  యాపిల్ ఐ ఫోన్ మాత్రం కాదు. మ‌న‌లో చాలా మందిలాగే ఆయ‌న కూడా ఆండ్రాయిడ్ ఫోనే వాడ‌తార‌ట‌. ఆ విష‌యాన్నే బిల్‌గేట్సే స్వ‌యంగా చెప్పారు.  బిల్‌గేట్స్‌.. మైక్రోసాఫ్ట్ అధినేతగా ప్ర‌పంచ కుబేరుల్లో ఆయ‌న‌ది రెండో స్థానం.  దాన‌ధ‌ర్మాల్లోనూ మంచి పేరున్న బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఫోనే వాడేవారు. ఇప్పుడు ఆ ఫోన్ ఆగిపోవ‌డంతో ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నార‌ట‌. అదీ మైక్రోసాఫ్ట్ ఫీచ‌ర్లు ఎక్కువ ఉండే ఫోన్ వాడుతున్నాన‌ని గేట్సే చెప్పారు. స్కైప్‌,  టీమ్స్‌, ఎంఎస్ వర్డ్‌, అవుట్‌లుక్ మెయిల్ యాప్ వంటివి ఎక్కువ‌గా వాడే బిల్‌గేట్స్ వాటిని ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే వాడ‌డం ఈజీ అని డిసైడ‌వడం గొప్ప‌విష‌యం. దీన్నిబ‌ట్టి చూస్తే ఆయ‌న గెలాక్సీ ఎస్ 8+ లేదా అలాంటి శాంసంగ్ ఫోన్ ఏదైనా వాడుతుండొచ్చ‌ని అంచ‌నా. 

వాళ్లింట్లో ఎవ‌రూ వాడ‌రు
బిల్‌గేట్సే కాదు ఆయ‌న ఇంట్లో ఎవ‌రూ ఐఫోన్ వాడ‌ర‌ట‌. ఈ విష‌యాన్నీ గేట్సే చెప్పారు.  ఐఫోనే కాదు యాపిల్ ప్రొడ‌క్ట్స్ ఏవీ వాళ్లింట్లో వాడ‌రు.  బిల్‌గేట్స్ అంటే అనుకోవ‌చ్చు ఆయ‌న పిల్ల‌లు కూడా ఐఫోన్, ఐ పాడ్‌లాంటి యాపిల్ ప్రొడ‌క్ట్‌లేవీ వాడ‌క‌పోవ‌డం విశేష‌మే మ‌రి. 
యాపిల్ అంటే ఎందుకంత దూరం? 
బిల్‌గేట్స్ లాంటి అప‌ర కోటీశ్వ‌రులు ఐఫోన్ వాడ‌తార‌నేది అంద‌రి ఊహ‌. కానీ గేట్స్ ఆండ్రాయిడ్ ఫోనే వాడుతున్నాన‌ని చెప్పారు. ఐఫోన్ ఎందుకు వాడ‌డంలేదంటే ప్ర‌త్యేకంగా కార‌ణ‌మేమీ లేదు కానీ నాకే కాదు మా ఇంట్లో ఎవ‌రికీ యాపిల్ ప్రొడ‌క్ట్స్ అంటే ఇష్టం లేద‌ని చెప్పారు. అయితే యాపిల్ ప్రొడ‌క్ట్స్‌.. ముఖ్యంగా ఐ ఫోన్  ప్ర‌గ‌తిని, యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ చ‌నిపోయాక కూడా ఆ ఫోన్ త‌న లెగ‌సీని కోల్పోకుండా కంటిన్యూ కావ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఓ  ఇంట‌ర్వ్యూలో గేట్స్ ఎప్రిషియేట్ చేయ‌డం మ‌రో ట్విస్ట్.

జన రంజకమైన వార్తలు