• తాజా వార్తలు
  •  

సెల్ఫీలు తీయ‌డం ఓ మెంట‌ల్ డిజార్డ‌ర్‌గా ప్ర‌క‌టించిన సైంటిస్ట్‌లు

రోజుకో సెల్ఫీ తీసి అప్‌లోడ్ చేయ‌క‌పోతే కుర్ర‌కారుకు మ‌న‌సు కుద‌రు ఉండ‌దు. గుడి, బ‌డీ తేడాలేదు. పండ‌గ‌, ప‌బ్బం అక్క‌ర్లేదు. సందు చిక్కితే సెల్ఫీ లాగించేయ‌డ‌మే. కానీ ఇది మీరు ఊహిస్తున్నంత స‌ర‌దా కాదు.. అస‌లు ఇది ఓ మాన‌సిక స‌మ‌స్య అని సైంటిస్ట్‌లు తేల్చేశారు. యూకేలోని నాటింగ్‌హాం ట్రెంట్ యూనివ‌ర్సిటీ, మ‌రో మేనేజ్‌మెంట్ స్కూల్‌తో క‌లిసి ఈ రీసెర్చి చేసింది. ఇండియన్ సైంటిస్ట్‌లు కూడా ఉన్న ఓ సైంటిస్ట్‌ల బృందం దీనిమీద డిటెయిల్డ్ స్ట‌డీ చేసి ఓ రిపోర్ట్ కూడా ఇచ్చింది.   2016లో సెల్ఫీ తీసుకుంటుండ‌గా అత్య‌ధికంగా ఇండియాలోనే మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అందుకే ఈ రీసెర్చ్‌కు ఇండియానే మెయిన్ ఫ్లాట్‌ఫాంగా తీసుకున్నారు.  
పిచ్చి 3 స్టేజ్‌లు 
సెల్ఫీస్ బిహేవియ‌ర్ స్కేల్‌ను కూడా సైంటిస్ట్‌లు త‌యారు చేశారు.  దీని ప్ర‌కారం సెల్ఫీ పిచ్చిని మూడు ర‌కాలుగా డివైడ్ చేశారు. 
స్టేజ్ 1 - బోర్డ‌ర్ లైన్ : ఇందులో వ్యక్తి రోజుకు  క‌నీసం మూడు సెల్ఫీలు తీసుకుంటాడు. కానీ వాటిని ట్విట్ట‌ర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్ లాంటి ఎలాంటి సోష‌ల్ మీడియాలోనూ పోస్ట్ చేయ‌డు. 
స్టేజ్ 2 - ఎక్యూట్ సెల్ఫీస్‌ :ఇందులో కూడా క‌నీసం మూడు సెల్ఫీలు తీసుకునే బ్యాచ్ ఉంటారు. అయితే వీరు వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తారు. 
స్టేజ్ 3 - క్రోనిక్ సెల్ఫీస్ :ఈ ప‌ర్స‌న్స్ రోజుకు ఎన్ని సెల్ఫీలు తీసుకుంటారో లెక్కేలేదు. వాటిలో ఎట్‌లీస్ట్ ఆరు సెల్ఫీల‌న‌యినా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌క‌పోతే వారికి మ‌న‌సు కుదురుండ‌దు.  
ఇవీ కార‌ణాలు
* సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవ‌డానికి
* అటెన్ష‌న్ వాళ్ల‌వైపు తిప్పుకోవ‌డానికి
* వాళ్ల మూడ్‌ను ఇంప్రూవ్ చేసుకోవ‌డానికి
* త‌మ చుట్టూ ఉన్న ఎన్విరాన్‌మెంట్‌తో క‌నెక్ట్ అయిన దృశ్యాన్ని జ్ఞాప‌కంగా ఉంచుకోవ‌డానికి
* త‌మ చుట్టూ సోష‌ల్ మీడియాలో గుర్తింపు కోసం
* సోష‌ల్‌గా పోటీలో ఉండ‌డానికి  సెల్ఫీలు తీసుకుంటార‌ని గుర్తించారు.  అయితే సెల్ఫీలు మాన‌సిక ఆనందం కోసం తీసుకుంటార‌ని, అదేమీ స‌మ‌స్య కాద‌ని కూడా కొన్ని రీసెర్చ్‌లు జ‌రిగాయి. 
మ‌రోవైపు యూపీలో సీఎం ఆదిత్య‌నాథ్ ల‌క్నోలోని కాళిదాస్ మార్గ్‌లో ఉన్న త‌న నివాసం, ఆ చుట్ట‌ప‌క్క‌ల ఎవ‌రైనా సెల్ఫీ తీసుకుంటే పెనాల్టీ విధిస్తామ‌ని ఆర్డ‌ర్ ఇచ్చారు. అవ‌స‌ర‌మైతే ఏడాది వ‌ర‌కు జైలుశిక్ష కూడా విధిస్తార‌ట‌.  
  

జన రంజకమైన వార్తలు