• తాజా వార్తలు
  •  

ఫేస్ బుక్ లో అబద్దాలు, ఫేక్ న్యూస్ ను పసిగట్టడం ఎలా?

ఫేక్ న్యూస్ నూ మరియు అబద్దాలనూ ఫేస్ బుక్ లో వైరల్ గా వ్యాప్తి చేయడం ఈ మధ్య ఎక్కువ అయింది. కంప్యూటర్ విజ్ఞానం పాఠకులు ఈ పోకడలను గమనించే ఉంటారు. డీ మానిటైజేషన్ తదనంతర నేపథ్యం లో అనేక ఫేక్ న్యూస్ ఫేస్ బుక్ లో షికార్లు చేయడం, జయలలిత మృతి , జల్లికట్టు నేపథ్యం, యూపీ ఎలక్షన్ లు ఇలా ఏ నేపథ్యం చూసుకున్నా అసలు వార్తల కంటే ఈ ఫేక్ న్యూసే ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇలా వ్యాప్తి చేసేవారిని పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. అది వేరే సంగతి, మరి వినియోగదారుడు అసలు ఏది ఫేక్ న్యూసో ఏది అసలైన వార్తో తెలుసుకునేదేలా? ఫేస్ న్యూస్ లో ఫేక్ న్యూస్ ను గుర్తించడానికి కంప్యూటర్ విజ్ఞానం సమగ్ర సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో ఇస్తుంది. చూడండి.

సోర్స్ ను చెక్ చేయండి:- ఏదైనా వార్త ఫేస్ బుక్ లో మీకు కనిపించినపుడు అసలు అది ఎక్కడనుండి వచ్చిందో గమనించండి. కొన్నిమోసపూరిత  సైట్ లు తమ అడ్వర్టైజింగ్ రెవెన్యూ ను పెంచుకోవడానికి  మీ దృష్టి మరలుస్తూ ఈ ఫేక్ న్యూస్ ను మీ ఫేస్ బుక్ అకౌంట్ లలో పబ్లిష్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సైట్ ల పట్ల చాలా జాగ్రత్త గా ఉండాలి. ఉదాహరణకు సైట్ అడ్రెస్ లో com.co అని ఉన్న సైట్ లను నమ్మడానికి అవకాశం లేదు. ఇలాంటి సైట్ లు ఫేక్ న్యూస్ ను పబ్లిష్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అది మాత్రమే గాక వెబ్ సైట్ యొక్క అబౌట్ పేజి లో దాని యొక్క కాంటాక్ట్ లు, ఇతర వివరాలు మరియు ఫోటో లను గమనిస్తే కూడా వాటి అసలు స్వరూపం బయటపడుతుంది. వీటిని గమనించినపుడు మీకు ఏదైనా అనుమానం వచ్చింది అంటే అది ఖచ్చితంగా స్పూఫ్ సైట్ గా పరిగణించవచ్చు.

గ్రామర్ మరియు ఎమోషన్ లు :-  ఇది మరొక ముఖ్యమైన అంశం. తరచుగా క్యాపిటల్ లెటర్ ( పెద్ద అక్షరాలను ) లను గమనిస్తున్నారా? భావోద్వేగానికి చెందిన అంశాలు ఎక్కువ గమనిస్తున్నారా? దానిని పెద్దగా చదివితే మీకు విషయం తెలుస్తుందా? టీవీ చానల్ లో వచ్చే వార్తల మాదిరిగా కనిపిస్తున్నాయా? పదాలు బాగా ఆవేశం గానూ, ఎమోషనల్ గానూ అనిపిస్తున్నాయా? అయితే అనుమానం లేదు. ఇవి ఖచ్చితంగా ఫేక్ న్యూసే.

మిగతా కవరేజ్ ను గమనించండి:-  మీరు చూస్తున్న వార్త నిజంగా ఆసక్తి కరంగానూ, వాస్తవం గానూ అనిపిస్తే దానిని గుడ్డిగా నమ్మేయవద్దు. ఆ వార్తకు సంబంధించి మిగతా సోర్స్ లు ఎలాంటి కవరేజ్ ను ఇస్తున్నాయో గమనించండి. అలా ఏదీ ఇవ్వకుండా కేవలం మీ ఫేస్ బుక్ లో మాత్రమే ఆ న్యూస్ ఉంటే దానిని ఖచ్చితంగా ఫేక్ న్యూస్ గా పరిగణించవచ్చు.

గూగుల్ చేయండి:- అనేకరకాల న్యూస్ లు మనకు ఫేస్ బుక్ లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ న్యూస్ లో ఉన్న పదాలకు సంబంధించి గూగుల్ లో వెదికితే వాటిలో ఉన్న వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. తద్వారా అది నిజమైన వార్తా? లేక నకిలీదా అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.

ఫేస్ బుక్ లో జాగ్రత్త గా ఉండండి:- ఫేస్ బుక్ యూజర్ లు ఒక్కోసారి కొన్ని ఆర్టికల్ లను కనీసం చదవకుండా షేర్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. షేర్ చేసేముందు దాని లింక్ పై క్లిక్ చేసి అది ఎలాంటి వార్తో గమనించండి. ఎవరో ఒకరు షేర్ చేసిన వార్త మీకు ఫేక్ గా అనిపిస్తే అక్కడ మీ కామెంట్ ను పోస్ట్ చేయవచ్చు లేదా ఫేస్ బుక్ కు రిపోర్ట్ చేయవచ్చు. పైన కుడి భాగం లో ఉండే గ్రే యారో పై క్లిక్ చేయడం ద్వారా రిపోర్ట్ థిస్ పోస్ట్ అని వస్తుంది. తద్వారా సదరు పోస్ట్ ను ఫేస్ బుక్ కు రిపోర్ట్ చేయవచ్చు.

      చూశారు కదా! ఇకపై ఫేస్ బుక్ లో వచ్చే ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మవద్దు. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా పై మార్గాలను ఉపయోగించి వాటిని గుర్తించి బ్లాక్ చేయడమో లేక ఫేస్ బుక్ కు రిపోర్ట్ చేయడమో చేయండి.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు