• తాజా వార్తలు

ఫ్లాక్ టీమ్ మెసెంజర్ – ఓ మంచి ఫేక్ న్యూస్ డిటెక్టర్

ఇంటర్ నెట్ లో అప్పుడప్పుడూ ఏదో ఒక ఫేక్ న్యూస్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి ఈ న్యూస్ ను మనం నిజం అని నమ్మేస్తూ ఉంటాము, ఒక్కోసారి ఎవడురా బాబు ఈ న్యూస్ క్రియేట్ చేసేది అని తిట్టుకుంటూ ఉంటాము. అయితే ఇంటర్ నెట్ లో ఇలాంటి ఫేక్ న్యూస్ హల్ చల్ చేయకుండా దానిని గుర్తించి ఒక సర్వీస్ ను ఫ్లాక్ టీం మెసెంజర్ వారు లాంచ్ చేశారు.ఈ ఫేక్ న్యూస్ డిటెక్టర్ అనే సర్వీస్ యూజర్ లు తమ మెసేజింగ్ యాప్ లపై ఫేక్ న్యూస్ యొక్క ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఫ్లాక్ యొక్క ఈ FND సర్వీస్ ఇంటర్ నెట్ లో తప్పుదోవ పట్టించే వార్తలను గుర్తించి తమ ప్లాట్ ఫాం పై దానిని చెక్ చేసి యూజర్ లకు వీటి గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అధీకృతం అయిన నిర్ణయాలు అత్యంత నమ్మకమైన సమాచారం పై ఆధారపడి ఉంటాయి. అయితే ఉద్యోగులకు అసలు ఇలాంటి ఫేక్ న్యూస్ ను చదవడానికి సమయం ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్నే. అయినప్పటికీ వీటియొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. యూజర్ లు తమకు అనుమానం వచ్చిన యుఆర్ఎల్ లను ఈ ఫ్లాక్ చాట్ బాక్స్ లలో పేస్ట్ చేస్తే మిగతా పని ఇది చూసుకుంటుంది. ఈ FND ఈ యుఆర్ఎల్ లను తన వద్ద ఉన్న 600 కంటే ఎక్కువ ఉన్న ఫేక్ న్యూస్ రిఫరెన్స్ లతో పోల్చి చూసుకుంటుంది. ఒకవేళ ఆ సమాచారం ఏ మాత్రం అనుమానాస్పదం గా కనిపించినా సరే ఇది యూజర్ లకు ఒక విజిబుల్ ఐకాన్ మరియు ఎరుపు రంగు బార్ ద్వారా అది నకిలీ న్యూస్ అని సమాచారం ఇస్తుంది. ఈ ఐకాన్ మరియు రెడ్ బార్ యుఆర్ఎల్ కు కుడివైపు కనిపిస్తాయి. యూజర్ లు కావాలనుకుంటే ఆ సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు