• తాజా వార్తలు

రెండు నెల‌లు వాడ‌క‌పోతే గూగుల్ మ‌న ఆండ్రాయిడ్ డేటాను డిలీట్ చేస్తుందా?


మ‌న ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో డేటాను స్టోర్ చేసుకోవ‌డానికి సేఫ్‌, చీఫ్ ప్లేస్ ఏంట‌ని ఎప్పుడైనా ఆలోచించారా? అది గూగుల్ డ్రైవ్ మాత్ర‌మే. జీ మెయిల్ అకౌంట్ ఉంటే చాలు 15 జీబీ వ‌ర‌కు డేటాను దానిలో సేవ్ చేసుకుని ఎక్క‌డి నుంచైనా మెయిల్ లాగే యాక్సెస్ చేసుకోవ‌చ్చు.  అయితే ఆ డేటా ఎప్ప‌టికీ అలాగే ఉంటుంద‌ని ధీమాగా ఉంటున్నారా? అయితే జాగ్ర‌త్త‌ప‌డండి.  ఎందుకంటే మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను రెండు నెల‌లుగా యూజ్ చేయ‌క‌పోతే మాత్రం ఈ డేటాను  గూగుల్ డిలీట్ చేసేస్తుంది. 
రిక‌వ‌రీ కూడా చేయ‌లేం
ఆండ్రాయిడ్ పోలీస్ లో టాంగిల్ బుక్ అనే పేరుతో ఓ యూజ‌ర్ ఈ విష‌యం చెప్పారు.  త‌న నెక్స‌స్ 6పీ  ఫోన్‌లో నుంచి డ్రైవ్ లోకి సేవ్ చేసిన డేటా పోయింద‌ని అత‌ను చెప్పారు. 50 యాప్స్‌, వైఫై పాస్‌వ‌ర్డ్‌లు, ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ వంటివ‌న్నీ ఈ బ్యాక‌ప్ నుంచి డిలీట్ అయిపోయాయి. అంతేకాదు ఇలా డిలీట్ అయిపోయిన డేటాను తిరిగి రిక‌వ‌ర్ కూడా చేయ‌లేం. అంతేకాదు 100 జీబీ స్టోరేజ్ కోసం పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్నా కూడా ఇదే ప‌రిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఇలా డిలీట్ చేసేట‌ప్పుడు యూజ‌ర్‌ను గూగుల్ అల‌ర్ట్ కూడా చేయ‌దు.  అయితే రెండు వారాల‌పాటు ఆండ్రాయిడ్ డివైస్‌ను వాడ‌క‌పోతే మీ డేటా ఎక్స్‌పైర్ అయిపోతుంద‌ని చూపిస్తుంది. ఎక్స్‌పైరీకి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేస్తుంది. 
 

జన రంజకమైన వార్తలు