• తాజా వార్తలు
  •  

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో త‌ప్పుల్ని బ‌య‌ట‌పెట్టి రివార్డులు పొందిన నైనిటాల్ టీచర్

ఉత్త‌రాఖండ్‌కు చెందిన వికాస్ సింగ్ బిస్త్ అనే 27 ఏళ్ల టీచ‌ర్ సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌గా కూడా ప‌ని చేస్తున్నాడు.  ఆయ‌న గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఇంట్రికేట్ వెబ్‌సైట్ సిస్టంలో ఓ బ‌గ్‌ను గుర్తించాడు. దీన్ని గూగుల్ టీం  ఓకే చేసింది. ఆ మిస్టేక్‌ను రెక్టిఫై చేసింది. అంతేకాదు గూగుల్ వ‌ల్న‌ర‌బులిటీ రివార్డ్ ప్రోగ్రాం కింద హాల్ ఆఫ్ ఫేమ్‌లో 322వ ర్యాంక్‌ను బిస్త్‌కు ఇచ్చింది.  దీంతో అత‌నికి భారీగా రివార్డు కూడా ద‌క్కింది.  కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో ప‌నిచేసేవారికి గూగుల్ నుంచి ఇలాంటి గుర్తింపు రావ‌డం చాలా పెద్ద అచీవ్‌మెంట్ కింద లెక్క‌. 
ఎలా ప‌ట్టుకున్నారు? 
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో  kaggel.com వెబ్‌సైట్‌లో  ఓ బ‌గ్‌ను వికాస్ గుర్తించారు.  ఈ బ‌గ్ వెబ్‌సైట్‌ను పెద్ద‌గా ఎఫెక్ట్ చేయ‌దు కానీ సెర్చ్, ఫంక్ష‌నింగ్ వంటి వాటిని ఆల్ట‌రేష‌న్ చేసి టెక్నిక‌ల్ ఎర్ర‌ర్స్ చూపిస్తుంది.  దీన్ని క‌నిపెట్టిన వికాస్ ఈ  మిస్టేక్‌ను గూగుల్ సెక్యూరిటీ సైట్‌కు పంపించాడు.  గూగుల్ దీన్ని వెంట‌నే రెక్టిఫై చేయ‌డంతోపాటు వికాస్‌కు రివార్డ్, అవార్డ్ కూడా ప్ర‌క‌టించింది. ఉత్త‌రాఖండ్ నుంచి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో బ‌గ్ గుర్తించిన తొలి వ్య‌క్తిగా కూడా వికాస్ రికార్డ్ సృష్టించాడు.  
చాలా క్రేజ్ 
గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లు, ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ సైట్లు..ఇలా పెద్ద పెద్ద సైట్లు, సెర్చ్ ఇంజిన్లు కూడా బ‌గ్‌ను గుర్తించి ఎవ‌రైనా చెబితే వారికి ల‌క్ష‌ల్లో బ‌హుమ‌తులిస్తుంటాయి. దీనికోసం ఎథిక‌ల్ హ్యాకింగ్ కోర్సులు చేసి మ‌రీ సెర్చ్ ఇంజిన్‌ను వ‌డ‌పోసే వాళ్లు చాలా మందే ఉన్నారు. టెక్నాల‌జీలో పండిపోయిన వారికి ఇదో హాబీయే కాదు మంచి మ‌నీ ఎర్నింగ్ రూట్ కూడా. మీకూ అంత క‌మాండ్ ఉంటే ట్రై చేయండి మ‌రి..  

జన రంజకమైన వార్తలు