• తాజా వార్తలు
  •  

ఎఫ్‌బీ మెసెంజ‌ర్‌లో వ‌చ్చిన కొత్త మార్పులు గ‌మ‌నించారా?

ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఎఫ్‌బీ మెసెంజ‌ర్ ఉండ‌డం చాలా కామ‌న్. సుల‌భంగా చాట్ చేయ‌డానికి ఎఫ్‌బీ మెసెంజ‌ర్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రతిసారి ఫేస్‌బుక్ ఓపెన్ చేయ‌న‌వ‌స‌రం లేకుండా మెసెంజ‌ర్ ఉంటే చాలు మ‌నం చాట్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 1.2 బిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఎఫ్‌బీ మెసెంజ‌ర్‌కు ఉన్నారు.  అయితే ఈ మెసెంజ‌ర్‌లో ఎన్నో కొత్త ఆప్షన్లు ఉన్నాయి.  అవేంటో చూద్దాం..

షేర్ యువ‌ర్ డే
స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాగే ఫేస్‌బుక్ స్టోరీస్ ఆప్ష‌న్‌ను కాపీ చేసేసింది. దీంతో పాటు మెసెంజ‌ర్ డే అనే కొత్త ఆప్ష‌న్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది.  ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యాప్స్‌లో ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ కాంటాక్ట్స్ ఆధారంగా ఈ మెసెంజ‌ర్ ప‌ని చేస్తుంది. మీకు సంబంధించిన ఓన్ డేను యాడ్ చేసుకోవాలంటే.. కెమెరా ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి.

యూజ్ ఇన్ చాట్ రియాక్ష‌న్స్‌
వ్య‌క్తిగ‌త ఫేస్‌బుక్ పోస్ట్‌ల‌కు లైక్‌, ల‌వ్‌, హాహా, సాడ్‌, ఆంగ్రీ ఎమోజీల‌ను ఎలా సెట్ చేయాలో తెలుసా? ఒకే తెలుసుంతే.. మ‌రి మెసెంజ‌ర్‌లో కూడా ఇవ‌న్నీ ఎలా చేయ‌చ్చో తెలుసా? అయితే ఎఫ్‌బీ ఎమోజీల‌తో పోలిస్తే మెసెంజ‌ర్ ఎమోజీలు కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటాయి. మీరు ఏదైనా ఐకాన్‌ను సెల‌క్ట్ చేసిన‌ప్పుడు దాని రియాక్ష‌న్ మీకు కింద డిస్‌ప్లే అవుతుంది. మీకు కాంటాక్ట్‌లు మీరు ఎమోజీ పంప‌గానే నోటిఫికేష‌న్ వ‌స్తుంది.

మెసెంజ‌ర్ ప్రొఫైల్ కోడ్‌
ప్ర‌తి మెసెంజ‌ర్‌కు ఒక ప్ర‌త్యేక‌మైన కోడ్ ఉంటుంద‌న్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. మీరు మెసెంజ‌ర్‌లోని ఫ్రొఫైల్‌లోకి వెళితే మీ ఫ్రొఫైల్ పిక్చ‌ర్ ఒక స‌ర్కిల్‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మై కోడ్‌, స్కాన్ కోడ్ క‌నిపిస్తాయి. అయితే కొత్త వాళ్ల‌ను మీరు యాడ్ చేసుకోవాలంటే స్కాన్ కోడ్ కొడితే చాలు.

ప్లే మోర్ గేమ్స్‌
సాధార‌ణంగా ఎఫ్‌బీలో కొన్ని గేమ్స్ ఆడుతుంటాం. కానీ మెసెంజ‌ర్‌లోనూ మ‌నం గేమ్స్ ఆడుకోవ‌చ్చు. ఈ యాప్‌లో గేమ్స్ యాప్‌ను క్లిక్ చేస్తే దాదాపు 10 గేమ్‌లు మీకు క‌నిపిస్తాయి. ఒక గేమ్‌ను యాక్సిస్ చేస్తే చాలు మిగిలిన గేమ్‌ల‌న్నీ మీకు యాక్సిస్ అవుతాయి.  ఈ గేమ్‌ల‌ను రోజు రోజుకు యాడ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే 60కి పైగా గేమ్‌లు మెసెంజ‌ర్‌లో యాడ్ అయ్యాయి. 

స్నేహితుల్ని ట్యాగ్ చేయండి
గ్రూప్ చాట్ చేస్తున్న‌ప్పుడు ఫ‌లానా వ్య‌క్తికి మాత్ర‌మే మెసేజ్ పంపాల‌ని మీరు అనుకుంటే వారి ట్యాగ్ చేయచ్చు. ఎట్ ద రేట్ అని టైప్ చేసి వారి పేరు టైప్ చేస్తే చాలు.  ఇది వ్య‌క్తిగ‌తంగా నోటిఫికేష‌న్ పంపిస్తుంది. ఈ ఆప్ష‌న్ మీరు మెసేజ్‌లు మిస్ అయ్యే అవ‌కాశం ఉండ‌దు. 

రిమైండ‌ర్లు పెట్టుకోండి
మీరు రోజు వారీ  లైఫ్‌కు సంబంధించిన యాక్టివిటీస్ కోసం కూడా రిమైండ‌ర్లు ఈ మెసెంజ‌ర్‌లో పెట్టుకోవ‌చ్చు. లేదా ఏమైనా ఫ‌లానా తారీఖున ప్లాన్ చేసుకుంటే వాటిని కూడా సెట్ చేసుకోవ‌చ్చు. మెసేజ్ బాక్స్‌లో క్లిక్ చేసి మెసేజ్ టైప్ చేసి, డేట్‌, టైమ్ సెట్ చేసుకుంటే చాలు.

జన రంజకమైన వార్తలు